శ్లాబ్ జాయింట్ -1

#technical_post (ఆసక్తి లేనివాళ్లు స్కిప్ చేయండి.) కొత్త బిల్డింగ్ కట్టటానికి మార్కెట్ లో చాలా మంది ఉన్నారు.పాత భవనాలని రెన్నోవేట్ చేయటానికే నైపుణ్యం అవసరం. సరైన సలహా, సాంకేతిక సూచనలు అవసరం. ఇదో 27 సంవత్సరాల వయసు ఉన్న భవనం. ఒక కుటుంబానికి మొట్ట మొదటి ఇల్లు. 35 అడుగుల వెడల్పు, 56 అడుగుల లోతు తో ఉన్న తూర్పు ముఖం ఇల్లు. రెండు వాటాలుగా ఒకటి రెండు బెడ్ రూముల తోను మరోటి ఒక్క బెడ్Continue reading “శ్లాబ్ జాయింట్ -1”

మెట్లు

రెండు వారాల తర్వాత ఇంట్లో లంచ్ చేశాను.దీక్షిత తో ఆడుకుంటుంటే తెలిసిన ఒక ఈ‌ఈ గారు ఫోన్ చేశాడు. “మీ ఏరియా లో అంజన రెసిడెన్సీ అని అపార్ట్మెంట్ ఉంది అయిడియా ఉందా? అని.”లేదన్నాను. అడ్రెస్ చెప్పాడు. “అక్కడి కి వస్తావా వీలుంటే ఫ్లాట్, construction క్వాలిటీ చూద్దాం.”షార్ట్స్ నుండి పొడుగు లాగు లోకి మారి బండి మీద అక్కడికి వెళ్ళాను.అప్పటికే ఆయన సతీ సమేతంగా వచ్చి, 3rd ఫ్లోర్ లో ఉన్న ఫ్లాట్ చూస్తున్నాడు. పక్కనేContinue reading “మెట్లు”

నీలిమ

సచివాలయం లో పని చేస్తున్న ఒక యువ ఇంజనీరు మా ఆఫీస్ లో పర్మిషన్ అడిగి నా రూమ్ లోనికి వచ్చి ఎదురుగా కూర్చుని పలకరింపుగా నవ్వింది.ఆ అమ్మాయిని మాస్క్ లేకుండా గుర్తు పట్టటం కొంచెం కష్టం అయింది. ఒక్క నిమిషం మాట్లాడాక కొత్తగా నా పరిది లోకి వచ్చిన 12 మంది యువ ఇంజనీర్లలో నీలిమ అని నిర్ధారించుకున్నాను. ఇప్పటి వరకు ఫోన్ లో మాట్లాడాను కానీ ప్రత్యక్షం గా చూడటం ఇదే. ఒకటి రెండుContinue reading “నీలిమ”

సాయం

ఎవరికయినా ఏదైనా ఇచ్చినప్పుడు ఎంతో ఆనందం గా ఉంటుంది. అది చెప్పేటం కుదిరేది కాదు.చీకట్లో మార్కింగ్ వాకింగ్ చేస్తూ, ఒక బక్కపలచ్చటి కుర్రాడికి జేబులో పర్సు, మెడలో గొలుసు ఇచ్చేసాను. పాపం ఎంత ఆనందపడ్డాడో బిడ్డ. ** చేతిలో బండరాయి విసిరేసి, కత్తి మడిచి జేబులో పెట్టుకుంటున్నప్పుడు అతని ఆనందం చూసి తీరాల్సిందే.

చపాతీ

మార్నింగ్ వాక్ కి వెళ్ళామా? మొన్న పర్సు గొలుసు ఒక బక్క పలచటి కుర్రాడికి దానం చేసిన విషయం మరి కొందరికి తెలిసింది. చెరువు గట్టు మీదే ఒక సమావేశం ఏర్పాటు చేశారు. పరామర్శించారు. ఇంటావిడ నా క్షేమం కోరి, జేబులో డబ్బులు చేతికి ఉంగరాలు కూడా పీకెసి మూతికి చిక్కం (మాస్క్) కట్టి బయటకి పంపిస్తుందని చెప్పేశాను. వంతుల వారీగా అల్లం టీ ఇప్పిస్తామని ప్రామిస్ లు చేసేశారు. పనిలో పనిగా “బార్యని కంట్రోల్ లోContinue reading “చపాతీ”

చిన్ననాటి స్నేహం

ఇప్పుడంటే గజిటెడ్ పోస్టు, ఓ పాతికమంది సబ్ స్టాఫ్ తో బుద్దిమంతయ్య లాగా బిల్ట్ అప్ ఇస్తున్నాగాని చిన్నప్పుడు చెడ్డీ రోజుల్లో మనం రికార్డ్ హోల్డర్ అనమాట. బాగా అల్లరి చేసే వయసులో పెద కొత్తపల్లి లో బచ్చాలు, ఓకులు, గోలీలు, కర్రా బిల్లా ఆటల్లో ఫేమస్ మనం.అప్పుడో చెడ్డీ దోస్త్ ఉండేవాడు ఖాసిం వలీ అనేది వాడి పేరు. ఇద్దరం కల్సి అనేకానేక కార్యక్రమాల్లో పాల్గొనేవాళ్లం. చింత తోపు కి వెళ్ళి కాయలు కోసే వాళ్ళం,Continue reading “చిన్ననాటి స్నేహం”

చాగోళు ఆమె కధ

ఆలూరి సూర్యకళ అంటే మీకు మల్లె చాలామందికి తెలియకపోవచ్చు. కానీ “చాగోళు ఆమె” అంటే మాత్రం మా బజార్లో ఫేమస్. ‘చాగోళు’ ఆమె పుట్టిన ఊరు. అరవై కి దగ్గర్లో ఉన్నా, ఒంటి చేత్తో డజను బర్రెల పాడి చేస్తుంది. ఊరికి చివర 300 గజాల స్థలం లో ఒక మూల రేకుల ఇల్లు మరో మూల గోడ్ల చావిడి. వారి గడ్డి వాము రోడ్డు కి అటుపక్కన దిబ్బ. కేంద్రానికి పోస్తే శాతం తక్కువ అనిContinue reading “చాగోళు ఆమె కధ”

నవ్వుల రోజు

World Laughter Day నవ్వుల రోజు. ఒక ఇంటర్వ్యూ జరుగుతుంది.  రైల్వే సిగ్నల్ మెన్ పోస్ట్. ఇంటర్వ్యూ చేసే ఆయన తన అనుభవాన్ని అంతటినీ సిద్దం చేసుకుని ఉన్నాడు. అభ్యర్థి రానే వచ్చాడు. కొంత సాధారణ ప్రశ్నలు జరిగాక ఒకే ట్రాక్ మీద “రెండు ట్రైన్స్ ఎదురెదురుగా వస్తున్నట్లు తెలిస్తే ఏమి చేస్తావు ?”అన్నాడాయన. అభ్యర్థి కొంచెం ఆలోచించి “రెడ్ సిగ్నల్ ఇస్తాను.” “సిగ్నల్ పనిచెయ్యలేదు.” “లివర్ ఆపరేట్ చేసి ఒక ట్రైన్ ని లూప్ మీదికిContinue reading “నవ్వుల రోజు”

అలగా

ఆంజనేయులికి ఫోన్ చేసి షాప్ లో ఉన్నాడో లేడో కనుక్కుందాం అనుకున్నాను. తను మా ఆస్థాన హైర్ కట్టర్. :)పదిహేనేళ్ళ గా అదే షాప్ .. అంజయ్య రోడ్ లో ఒక ఆరామక్షేత్రం పక్కనే ఉన్న మునిసిపల్ కాలవ మీద ఉండే బార్బర్ షాప్ .. అబ్బా కొడుకులం అక్కడ కె వెళ్తాం.ఈ మధ్య కరోనా కాలం లో మా చిన్నమ్మాయి ట్రిమ్మర్ తో క్రాఫులు చేసేది. (మా చిన్నదానికి తెలియని విద్య ఉందనుకొను).ఫోన్ మీదికి చెయ్యేContinue reading “అలగా”

oneకాయ గుర్తు

కొత్త ప్లేస్ లో పదోన్నతి మీద ఎం‌పి‌డి‌ఓ గా బాద్యత తీసుకున్న రోజే గ్రామ పంచాయతీ ఎలెక్షన్స్ నోటిఫికేషన్ వచ్చేసింది. మండల అభివృద్ధి అదికారిణి కి ఇది అన్నప్రసాన రోజే ఆవకాయ లాటిది. తక్కువ పరిచయాలు, బలహీనమయిన సబ్ స్టాఫ్, వనరుల కొరత ఇలాటి సమస్యలు అనేకం…పది రోజుల పాటు సరైన నిద్ర/ తిండి జోలీలి వెళ్లలేని పరిస్తితి. మండల స్థాయి అదికార్లు అందరూ తలో చేయి వేసి, తమ పరిది దాటి బాద్యతలు తీసుకుని ఎలక్షన్స్Continue reading “oneకాయ గుర్తు”

Create your website with WordPress.com
Get started