ఇంటికి వెళ్ళటం బెటర్

“మాల్ లో టమోటా కేజీ 65 ట తీసుకోనా?” పొద్దుటే చిన్న పని మీద బయటకి వచ్చాను. తిరిగి వెళ్తూ గ్రోసరీస్ కోసం ఆగాను.

“తీసుకోండి” అంది నెమ్మదిగా..

“గట్టిగా మాట్లాడు.. బేబీ కార్న్, ఉల్లి కాడలు తీసుకుంటున్నా.”

“ ఎక్కడో చోట తిరిగి సాయంత్రం దాకా ఇంటికి రాకండి.”

“ఏమయింది?”

“మీ శిష్యుడు వినోద్ వచ్చాడు.”

“పోయిన వారం బెంగుళూరు ట్రైనింగ్ ఉందని వెళ్ళాడు. ఏదైనా గిఫ్ట్ తెచ్చి ఉంటాడు.”

“గిఫ్ట్ లాగా లేదు. ఇంతకీ ….ఈ మద్య ఏమైనా సలహా ఇచ్చారా?”

“తాను ట్రైనింగ్ కి వెళ్ళిన టైమ్ లో వాళ్ళావిడ బర్త్ డే వచ్చింది. గురూ గారు తక్కువ ఖర్చులో ఆవిడని ఇంప్రెస్ చేయాలి ఎలా అని అడిగాడు.”

మీరేం చెప్పారు?

“తన ఏజ్ కన్నా ఒక పది తక్కువ రోజా పూల బొకే పంపి .. డియర్ .. నాకళ్ళకి నీవు ఎప్పటికీ ఈ పూల వయసు దానివే …. అని ఇంకో రెండు రొమాంటిక్ వాక్యాలు మెసేజ్ పెట్టమని చెప్పాను. మనాడి కి రాగానే మంచి ఫిల్టర్ కాఫీ ఇచ్చి ఉంటుంది. ఆనందం తట్టుకోలేక థాంక్స్ చెప్పటానికి వచ్చి ఉంటాడు.”

“దుడ్డు కర్ర తెచ్చుకున్నాడు.”

“అదేంటి?”

“కొత్తగా ఓపెన్ చేసిన ప్లవర్ షాప్ కి ఆన్లైన్ లో ఆర్డర్ పంపాడట. మొదటి ఆర్డర్ కి పువ్వు కి పువ్వు ఫ్రీ ట”

***

“శనివారం కదా ఏదో గుడి లో ప్రసాదం తిని తిరుగుతూ ఉండండి. “ ఫోన్ కట్ అయింది.

హలో సార్ “భోళా శంకర్ బెటరా ? జైలర్ బెటరా?”

Published by Sreenivasarao Sunkara

Civil Engineer, Writer, and now a Grand father

One thought on “ఇంటికి వెళ్ళటం బెటర్

Leave a comment

Design a site like this with WordPress.com
Get started