Design a site like this with WordPress.com
Get started

SHEAR WALL TECHNOLOGY

చిన్నతనం లో సత్తు రేకు తో రివెటింగ్ చేసి జాయింట్స్ మీద తారు పూసిన బెందెలు ఉండేవి. చెరువుల నుండి కావిళ్లలో నీళ్ళు తెచ్చుకోటానికి అనుకూలంగా ఉండేవి. బరువు తక్కువ. తర్వాత తర్వాత ఒకే రేకుతో పోతపోసిన/ లేత్ వర్క్ చేసిన బిందెలు మార్కెట్ లోకి వచ్చేశాయి. ఎక్కడా జాయింట్ అనేది ఉండదు. ఇంటి, నిర్మాణం లో చాలా మెటేరియల్ వాడుతుంటాం పునాది కోసం గాళ్ళు తీసి నల్ల రాళ్ళు పేర్చి సున్నం/సిమెంట్ తో పాక్ చేసిContinue reading “SHEAR WALL TECHNOLOGY”

ఒక్క సారేగా

…. ఎనిమిది దాటాక టౌన్ లోకి ఎంటర్ అవుతుంటే పొద్దుటే మా ఇంటావిడ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. కలెక్టర్ లు చెప్పినవి మర్చిపోయినా కొంపలు ఏమీ మునగవు. నేరుగా ఇంటికి రాకుండా ఒక రెడీమేడ్ బట్టల షాపుకి వెళ్ళాను. “ఆర్నెల్ల పిల్లాడికి ఏవైనా డ్రస్ లు?” వెంటనే వాల్ ఫ్యాన్ స్విచ్ వేసి సేల్స్ గర్ల్ ఒకామే “ఇటు రండి సార్” అంది. వాట్స్ అప్ప్ వీడియొ కాల్ చేసి మనమడి అన్న ప్రాసన కోసం రెండుContinue reading “ఒక్క సారేగా”

స్వంత స్థలం, ఇంకా కష్టం

Un authorised లేఔట్ ల registration లు ఆగిపోయి నెలలు గడుస్తున్నాయి. మార్కెట్ లో ఎంతో డబ్బు బ్లాక్ అయింది, లావాదేవీలు ఆగిపోయాయి. ప్రభుత్వ నిర్ణయం కోసం అనేకమంది మంది ఎదురు చూస్తున్నారు. ఎలాటి రెగ్యులరైజేషన్ కానీ, కొనుగోలుదార్ల ని ధృష్టి లో ఉంచుకుని రాయితీలు గాని ప్రకటించలేదు. ఒక పాలసీ తీసుకు రాలేదు. పావలా అడ్వాన్స్ ల మీద రియల్ ఎస్టేట్ రంగం pause బటన్ మీద కూర్చుని ఎదురుచూస్తూ ఉంది. స్వపక్ష నేతల రియల్Continue reading “స్వంత స్థలం, ఇంకా కష్టం”

పందికొక్కు

మూడు రోజుల నుండి పంది కొక్కు సమస్య చర్చకి వస్తూనే ఉంది. మొదటి రోజు పప్పీలా గా ముద్దుగా ఉండే ప్రస్తావన, రెండో రోజుకి వేట కుక్క అయి మూడో రోజుకి చిరుత గా మారుతుంది. గ్రౌండ్ ఫ్లోర్ లో కుండీలలో మట్టి తోడటం, మెట్లు మీద నానా చెత్త వదలటం, సీసా లో నుండి వచ్చిన భాష తెలియని చైనీస్ పొగ భూతం లాగా తలుపు తీయగానే చెప్పుల స్టాండ్ నుండి గబాలున దూకటం …Continue reading “పందికొక్కు”

మాల్ కల్చర్

“చిన్నప్పుడు పచారీ కొట్టుకి పావు కేజీ కందిపప్పుకి వెళ్తే అదొక్కటే తెచ్చేవాళ్లం. ఈ దరిద్రపు మాల్ కల్చర్ వచ్చింది అడ్డమైన నానా చెత్త కొంటున్నాం. కందిపప్పు తప్ప.” ఆవిడ కూర్చోగానే గేరు మారుస్తూ చెప్పాను. “మాల్ కి వెళ్ళే ప్రతిసారి నీ మొదటి డైలాగ్ ఇదే” అంది. “అబ్బే అవసరమయినవి మాత్రమే కొంటావు అనుకో..నీ విషయం కాదు. జనరల్ గా చెబుతున్నాను.” అది జనరల్ కాదని ఇద్దరికీ తెలుసు. ఏసి ఆన్ చేసినా కారు లో వేడిContinue reading “మాల్ కల్చర్”

శ్లాబ్ జాయింట్ -1

#technical_post (ఆసక్తి లేనివాళ్లు స్కిప్ చేయండి.) కొత్త బిల్డింగ్ కట్టటానికి మార్కెట్ లో చాలా మంది ఉన్నారు.పాత భవనాలని రెన్నోవేట్ చేయటానికే నైపుణ్యం అవసరం. సరైన సలహా, సాంకేతిక సూచనలు అవసరం. ఇదో 27 సంవత్సరాల వయసు ఉన్న భవనం. ఒక కుటుంబానికి మొట్ట మొదటి ఇల్లు. 35 అడుగుల వెడల్పు, 56 అడుగుల లోతు తో ఉన్న తూర్పు ముఖం ఇల్లు. రెండు వాటాలుగా ఒకటి రెండు బెడ్ రూముల తోను మరోటి ఒక్క బెడ్Continue reading “శ్లాబ్ జాయింట్ -1”

ఫ్రీ ఎయిర్, వాటర్ & వాష్ రూమ్స్

కొన్నేళ్ళ క్రితం వరకు పెట్రోల్ బంకులు కేవలం పెట్రోలే డీజిల్ అవుట్ లెట్స్ మాత్రమే అనుకునేవాడిని. ఒకసారి మిత్రుడు అర్జున్ చౌదరి బొల్లా డ్రైవింగ్ లో మా పిల్లలతో హైదరాబాదు వెళ్తుంటే, దారిలో తాను చెప్పిందాకా నాకు అవగాహన లేదు. ప్రతి పెట్రోల్ బంక్ లోనూ ఫ్రీ ఎయిర్, డ్రింకింగ్ వాటర్, washrooms సౌకర్యాలు ఏర్పాటు చేయటం మాండేటరీ అని, మనం పెట్రోల్ కొన్నా కొనకపోయినా ఆ సౌకర్యాలు కల్పించవలసినదే అని మొదటి సారి తెలుసుకున్నాను. అప్పటిContinue reading “ఫ్రీ ఎయిర్, వాటర్ & వాష్ రూమ్స్”

SIR

రత్న ఒక లివ్ ఇన్ మైడ్. (ధనవంతుల ఇళ్ళలో వంటగది సర్వీస్ నుండి ఎంట్రీ ఉన్న చిన్న రూమ్ లో ఉండే పనిమనిషి) అశ్విన్ అనే ఆర్కిటెక్ట్ అతనితో జీవితం పంచుకొనున్న గర్ల్ ఫ్రెండ్ సబీనా ఒక పల్లెటూరి నుండి రత్న ని పనికి కుదుర్చుకుంటారు. అశ్విన్ ఒక బ్లాగర్/రైటర్ కావాలనుకుని ఇండియా లోని తమ్ముడు అనారోగ్యం కారణంగా న్యూ యార్క్ నుండి వచ్చేస్తాడు. తమ్ముడు చనిపోయాక ఇక్కడే కుటుంబ కన్స్ట్రక్షన్ వ్యాపారం లో బాగం అవుతాడు.Continue reading “SIR”