SHEAR WALL TECHNOLOGY
చిన్నతనం లో సత్తు రేకు తో రివెటింగ్ చేసి జాయింట్స్ మీద తారు పూసిన బెందెలు ఉండేవి. చెరువుల నుండి కావిళ్లలో నీళ్ళు తెచ్చుకోటానికి అనుకూలంగా ఉండేవి. బరువు తక్కువ. తర్వాత తర్వాత ఒకే రేకుతో పోతపోసిన/ లేత్ వర్క్ చేసిన బిందెలు మార్కెట్ లోకి వచ్చేశాయి. ఎక్కడా జాయింట్ అనేది ఉండదు. ఇంటి, నిర్మాణం లో చాలా మెటేరియల్ వాడుతుంటాం పునాది కోసం గాళ్ళు తీసి నల్ల రాళ్ళు పేర్చి సున్నం/సిమెంట్ తో పాక్ చేసి…
ఆత్మ బంధువులు
ఈ రోజు మా వెంకట్రామయ్య & గురవమ్మ వచ్చారు. ఎటూ వెళ్లకుండా ఇంట్లో నే ఉండటానికి ఇదొక కారణం. న్యూస్ పేపర్ లో చుట్టిన డబ్బు ‘ఎనబైవేలు’ తీసి ఇచ్చాడు. పొలం పనులు కోసం పెట్టుబడి కి తీసుకున్నవి, ఎప్పుడూ ఏడాది దాటి ఉంచుకోలేదు. మొట్ట మొదటి సారి మూడేళ్లు తర్వాత ఈ రోజు తీసుకొచ్చాడు. ఖాతా బుక్ app లో చూశాను. లక్షా డెబ్బై అయిదువేలు మూడు సార్లుగా సర్దుబాటు చేసినట్లు, దానిలో లక్ష వరకు…
పులిహోర
మహానాడు కి వచ్చిన జనం పలచగా ఉన్నచోట/ ఖాళీ కుర్చీల ఫోటోలు తీసుకుని, తనకి కావల్సిన స్టఫ్ సేకరించుకుని బైక్ మీద తన ఊరు బయలుదేరాడు రాకేశ్.. ఏడు దాటింది. చీకటి ముసురుకుంటూ ఉంది. వెన్నెల వెలుగు రాబోతుంది. మరో ఆరు కిలోమీటర్లు ప్రయాణం ఉండగా పాలేరు బ్రిడ్జ్ మీద మలుపులో ఒక అమ్మాయి అనుమానాస్పదంగా తచ్చట్లాడటం గమనించాడు. కొద్ది దూరం ముందుకి వెళ్ళి తిరిగి వెనక్కి వచ్చాడు. బండి ఒక పక్క పార్క్ చేసి తానూ…
ఒక్క సారేగా
…. ఎనిమిది దాటాక టౌన్ లోకి ఎంటర్ అవుతుంటే పొద్దుటే మా ఇంటావిడ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. కలెక్టర్ లు చెప్పినవి మర్చిపోయినా కొంపలు ఏమీ మునగవు. నేరుగా ఇంటికి రాకుండా ఒక రెడీమేడ్ బట్టల షాపుకి వెళ్ళాను. “ఆర్నెల్ల పిల్లాడికి ఏవైనా డ్రస్ లు?” వెంటనే వాల్ ఫ్యాన్ స్విచ్ వేసి సేల్స్ గర్ల్ ఒకామే “ఇటు రండి సార్” అంది. వాట్స్ అప్ప్ వీడియొ కాల్ చేసి మనమడి అన్న ప్రాసన కోసం రెండు…
Loading…
Something went wrong. Please refresh the page and/or try again.