తాత కాల్చాడు

చిన్న పిల్లలలని డీల్ చేయటం అంత ఈజీ కాదు.

ముఖ్యం గా “లోహిత్’ (అయిదేళ్ళ మా గ్రాండ్ కిడ్) లాటి సున్నిత మనసు ఉన్న వున్న వాళ్ళని.

నిన్న ఒక ఫామిలీ ఫంక్షన్ కి వెళ్ళవలసి వచ్చింది.

వెళ్తూ ఆటవిడుపుగా అందుబాటు లో ఉన్న పెద్దమ్మాయిని మనవళ్లు ఇద్దరినీ తీసుకెళ్ళాను.

కార్లో అమ్మమ్మ వడి లో కూర్చొంటూ తన చేతికి ఉన్న ఎర్రటి చార ని గమనించి “అమ్మమ్మా ఏమిటిది ?” అని అడిగాడు.

తాను నవ్వుతూ “తాత కాల్చాడు. అల్లరి చేస్తున్నా అని అట్లకాడ కాల్చి వాత పెట్టాడు” అంది. నవ్వుతూ ..

సుమారుగా ఒక వంద కిలోమీటర్ల జర్నీ చేశాం. త్రోవలో రాజస్థాన్ వాళ్ళ ఆలూ సమోసా, జిలేబి తీసుకున్నాం. ఇద్దరు కొద్దిగా తిని మిగిలింది పొట్లం లో దాచుకున్నారు.

మా మామయ్య గారి కి ముని మనవళ్ల ని చూయించాము. ఇద్దరికీ చెరో యాబై ఇచ్చారాయన.

థాంక్స్ చెప్పాడు లోహిత్.. నువ్వు కూడా చెప్పు అని యువిన్ చేత చెప్పించాడు.

ముద్దు మురిపాలు అయ్యాక వాళ్ళని ఇంటివద్ద దించేసి. మరో అరగంట తర్వాత మేము ఇంటికి చేరాం.

కార్ పార్క్ చేసి మెట్లు ఎక్కుతుంటే భావన ఫోన్ నుండి యువిన్ వాయిస్ మెసేజ్ పెట్టాడు. తాత నీ కారు లో సీటు బాగ్ లో జిలేబీ ఉంది. మరచి పోయా అని.

రాత్రి పదిన్నరకి పెద్దమ్మాయి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసింది.

లోహిత్ దోమతెర లో పడుకుని వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి చెబుతున్నాడు. “ తాత కి అమ్మమ్మ అంటే ఇష్టం లేదు. అమ్మమ్మ ని కాల్చాడు” అని.

రమ షాక్ అయింది.

స్పీకర్ లో వింటున్న నేను “అందరు పిల్లలకి అన్నీ అర్ధం కావు. నువ్వు తమాషా చేశావని వాడికి అర్ధం కాలేదు. తప్పు నీదే. ఉదయాన్నే వెళ్ళి ఇద్దరు చిన్నవాళ్ళని తీసునిరా. వాడి మనసు లోనుండి ఆ భావం తేసేయటం అంత సులభం కాదు. ప్రయత్నం చేద్దాం. చిన్న మనవడి కి జిలేబీ తీసుకెళ్లు.”

All reactions:

1Uma Kalyani

Published by Sreenivasarao Sunkara

Civil Engineer, Writer, and now a Grand father

Leave a comment

Design a site like this with WordPress.com
Get started