మాల్ కల్చర్

“చిన్నప్పుడు పచారీ కొట్టుకి పావు కేజీ కందిపప్పుకి వెళ్తే అదొక్కటే తెచ్చేవాళ్లం. ఈ దరిద్రపు మాల్ కల్చర్ వచ్చింది అడ్డమైన నానా చెత్త కొంటున్నాం. కందిపప్పు తప్ప.” ఆవిడ కూర్చోగానే గేరు మారుస్తూ చెప్పాను. “మాల్ కి వెళ్ళే ప్రతిసారి నీ మొదటి డైలాగ్ ఇదే” అంది. “అబ్బే అవసరమయినవి మాత్రమే కొంటావు అనుకో..నీ విషయం కాదు. జనరల్ గా చెబుతున్నాను.” అది జనరల్ కాదని ఇద్దరికీ తెలుసు. ఏసి ఆన్ చేసినా కారు లో వేడిContinue reading “మాల్ కల్చర్”

ఉత్తరం/ తూర్పు ఏది మంచిది?

సాయంత్రం మన అయస్కాంత పరిది  లో వచ్చిన ఒక కొత్త మిత్రుడి ఇంటికి ‘టీ’ కి వెళ్ళాను. గ్రౌండ్ ఫ్లోర్ లో షాప్ లు కట్టి ముప్పై వేలు రెంట్ తీసుకుంటున్నాడు. మొదటి అంతస్తులో విశాలం గా కట్టుకున్న ఇంటి లో ఫర్నీచర్ కొనలేక పోయినందుకు బాదపడ్డాడు. ఒక పాప మెడిసిన్ (ఫ్రీ సీటు) సిద్దార్ధ, విజయవాడ లో, పిల్లాడు ఏయూ లో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. సెంటు 20/22 లక్షలు చేసే రోడ్ ఫేస్ 20Continue reading “ఉత్తరం/ తూర్పు ఏది మంచిది?”

టాటా సుమో

యూట్యూబ్ వీడియో లో కంటెంట్ ఎక్కడ మొదలవుతుందో చూసి కామెంట్ లో పోస్ట్ చేసే త్యాగరాజు లు మనకి తెలుసు. ఈ త్యాగరాజు లకి ఏమాత్రం తీసిపోని ‘మొనగాళ్లు’ మన చుట్టూ చాలా మంది ఉన్నారు. మా నియోకవర్గం లో ఇంచార్జ్ నాయకుడు ఈ పది రోజుల్లో నాలుగు సార్లు ఫోన్ చేశాడు. “మా వాడు వస్తాడు. ‘తన్నీరు మాధవి’ అనే పేరు కి ఇంటి బిల్లు ఇవ్వాలి.” అంటూ..పక్కనే ఉన్న మగ మనిషి ఎవరో ప్రాంటింగ్Continue reading “టాటా సుమో”

శ్లాబ్ జాయింట్ -2

#Technical_post (ఆసక్తి/ అవసరం ఉన్నవాళ్లకి మాత్రమే)రెండు మనసులని కలపటం కష్టం. ఇద్దరు మనుసులకి కలిపి రబ్బర్ బాండ్ వేసి వదిలేసినప్పటికీఒక పాత శ్లాబ్ కి జాయింట్ గా మరో కొత్త నిర్మాణం చేసేటప్పుడు అనేక చాలెంజెస్ ఉంటాయి. Structural గా స్టెబిలిటీ ఉంటుందా లేదా అనేది ప్రధానమయినది అయితే, రెండోది జాయింట్ వద్ద లీక్ ప్రూఫ్ గా చేయటం ఎలా అనేది. ఓల్డ్ శ్లాబ్ సర్ఫేస్ ని నిలువుగా చెక్కించాలి. శ్లాబ్ జాయింట్ అనేది ఎప్పుడూ ఏదోContinue reading “శ్లాబ్ జాయింట్ -2”

శ్లాబ్ జాయింట్ -1

#technical_post (ఆసక్తి లేనివాళ్లు స్కిప్ చేయండి.) కొత్త బిల్డింగ్ కట్టటానికి మార్కెట్ లో చాలా మంది ఉన్నారు.పాత భవనాలని రెన్నోవేట్ చేయటానికే నైపుణ్యం అవసరం. సరైన సలహా, సాంకేతిక సూచనలు అవసరం. ఇదో 27 సంవత్సరాల వయసు ఉన్న భవనం. ఒక కుటుంబానికి మొట్ట మొదటి ఇల్లు. 35 అడుగుల వెడల్పు, 56 అడుగుల లోతు తో ఉన్న తూర్పు ముఖం ఇల్లు. రెండు వాటాలుగా ఒకటి రెండు బెడ్ రూముల తోను మరోటి ఒక్క బెడ్Continue reading “శ్లాబ్ జాయింట్ -1”

మెట్లు

రెండు వారాల తర్వాత ఇంట్లో లంచ్ చేశాను.దీక్షిత తో ఆడుకుంటుంటే తెలిసిన ఒక ఈ‌ఈ గారు ఫోన్ చేశాడు. “మీ ఏరియా లో అంజన రెసిడెన్సీ అని అపార్ట్మెంట్ ఉంది అయిడియా ఉందా? అని.”లేదన్నాను. అడ్రెస్ చెప్పాడు. “అక్కడి కి వస్తావా వీలుంటే ఫ్లాట్, construction క్వాలిటీ చూద్దాం.”షార్ట్స్ నుండి పొడుగు లాగు లోకి మారి బండి మీద అక్కడికి వెళ్ళాను.అప్పటికే ఆయన సతీ సమేతంగా వచ్చి, 3rd ఫ్లోర్ లో ఉన్న ఫ్లాట్ చూస్తున్నాడు. పక్కనేContinue reading “మెట్లు”

నీలిమ

సచివాలయం లో పని చేస్తున్న ఒక యువ ఇంజనీరు మా ఆఫీస్ లో పర్మిషన్ అడిగి నా రూమ్ లోనికి వచ్చి ఎదురుగా కూర్చుని పలకరింపుగా నవ్వింది.ఆ అమ్మాయిని మాస్క్ లేకుండా గుర్తు పట్టటం కొంచెం కష్టం అయింది. ఒక్క నిమిషం మాట్లాడాక కొత్తగా నా పరిది లోకి వచ్చిన 12 మంది యువ ఇంజనీర్లలో నీలిమ అని నిర్ధారించుకున్నాను. ఇప్పటి వరకు ఫోన్ లో మాట్లాడాను కానీ ప్రత్యక్షం గా చూడటం ఇదే. ఒకటి రెండుContinue reading “నీలిమ”

సాయం

ఎవరికయినా ఏదైనా ఇచ్చినప్పుడు ఎంతో ఆనందం గా ఉంటుంది. అది చెప్పేటం కుదిరేది కాదు.చీకట్లో మార్కింగ్ వాకింగ్ చేస్తూ, ఒక బక్కపలచ్చటి కుర్రాడికి జేబులో పర్సు, మెడలో గొలుసు ఇచ్చేసాను. పాపం ఎంత ఆనందపడ్డాడో బిడ్డ. ** చేతిలో బండరాయి విసిరేసి, కత్తి మడిచి జేబులో పెట్టుకుంటున్నప్పుడు అతని ఆనందం చూసి తీరాల్సిందే.

చపాతీ

మార్నింగ్ వాక్ కి వెళ్ళామా? మొన్న పర్సు గొలుసు ఒక బక్క పలచటి కుర్రాడికి దానం చేసిన విషయం మరి కొందరికి తెలిసింది. చెరువు గట్టు మీదే ఒక సమావేశం ఏర్పాటు చేశారు. పరామర్శించారు. ఇంటావిడ నా క్షేమం కోరి, జేబులో డబ్బులు చేతికి ఉంగరాలు కూడా పీకెసి మూతికి చిక్కం (మాస్క్) కట్టి బయటకి పంపిస్తుందని చెప్పేశాను. వంతుల వారీగా అల్లం టీ ఇప్పిస్తామని ప్రామిస్ లు చేసేశారు. పనిలో పనిగా “బార్యని కంట్రోల్ లోContinue reading “చపాతీ”

చిన్ననాటి స్నేహం

ఇప్పుడంటే గజిటెడ్ పోస్టు, ఓ పాతికమంది సబ్ స్టాఫ్ తో బుద్దిమంతయ్య లాగా బిల్ట్ అప్ ఇస్తున్నాగాని చిన్నప్పుడు చెడ్డీ రోజుల్లో మనం రికార్డ్ హోల్డర్ అనమాట. బాగా అల్లరి చేసే వయసులో పెద కొత్తపల్లి లో బచ్చాలు, ఓకులు, గోలీలు, కర్రా బిల్లా ఆటల్లో ఫేమస్ మనం.అప్పుడో చెడ్డీ దోస్త్ ఉండేవాడు ఖాసిం వలీ అనేది వాడి పేరు. ఇద్దరం కల్సి అనేకానేక కార్యక్రమాల్లో పాల్గొనేవాళ్లం. చింత తోపు కి వెళ్ళి కాయలు కోసే వాళ్ళం,Continue reading “చిన్ననాటి స్నేహం”

Design a site like this with WordPress.com
Get started