మా గుండమ్మ పాల ఖాతా మార్చింది. రెగ్యులర్ గా పల్లె నుండి ఇంటికి వచ్చి రెండు పూటలా పాలు పోసి నెలాఖరుకు డబ్బు తీసుకునే అతన్ని ఆపేసింది. లోకల్ గా మా బజారు చివర్లో ఉండే ఒక ఫామిలీ పాలు తీసుకు వస్తున్నారు. ఏడాకాలం పాలు క్వాలిటీ అంత మెరుగ్గా ఏమీ లేవు. రేటు కూడా లీటరు డెబ్బయి. పెద్ద మార్పు లేదు. పచ్చి పాలతో ఉదయాన్నే టీ తాగటం ఒక మంచి ఫీల్. పాకెట్ పాలుContinue reading “అభి”
Author Archives: Sreenivasarao Sunkara
ఎగిరే బాటరీ
అర్ధరాత్రి బాగా చలి అనిపించినప్పుడు, బెడ్ పక్కనే ఉన్న రిమోట్ తో సరిచేసే ప్రయత్నం చేశాను. ఒకటి రెండు సార్లు రెండో అరచేతితో చరిచాను. “బాటరీలు డ్రై అయిపోయినట్లు ఉన్నాయి. ‘వారం నుండి చెబుతూనే ఉన్నా..’ 1.30 గెగాహెడ్స్ మీద ప్రత్యక రేడియో ప్రసారాలు మొదలయ్యాయి. చాకచక్యం గా పక్కకి తిరిగి పడుకుని దుప్పటి కప్పుకున్నాను. ఉదయాన్నే వాష్ రూమ్ కి వెళ్ళినప్పుడు, ట్రిపుల్ A సైజు బాటరీలు ఇంట్లోనే ఎక్కడో ఉన్నట్లు స్పురించింది. బెడ్ రూమ్Continue reading “ఎగిరే బాటరీ”
SHEAR WALL TECHNOLOGY
చిన్నతనం లో సత్తు రేకు తో రివెటింగ్ చేసి జాయింట్స్ మీద తారు పూసిన బెందెలు ఉండేవి. చెరువుల నుండి కావిళ్లలో నీళ్ళు తెచ్చుకోటానికి అనుకూలంగా ఉండేవి. బరువు తక్కువ. తర్వాత తర్వాత ఒకే రేకుతో పోతపోసిన/ లేత్ వర్క్ చేసిన బిందెలు మార్కెట్ లోకి వచ్చేశాయి. ఎక్కడా జాయింట్ అనేది ఉండదు. ఇంటి, నిర్మాణం లో చాలా మెటేరియల్ వాడుతుంటాం పునాది కోసం గాళ్ళు తీసి నల్ల రాళ్ళు పేర్చి సున్నం/సిమెంట్ తో పాక్ చేసిContinue reading “SHEAR WALL TECHNOLOGY”
ఆత్మ బంధువులు
ఈ రోజు మా వెంకట్రామయ్య & గురవమ్మ వచ్చారు. ఎటూ వెళ్లకుండా ఇంట్లో నే ఉండటానికి ఇదొక కారణం. న్యూస్ పేపర్ లో చుట్టిన డబ్బు ‘ఎనబైవేలు’ తీసి ఇచ్చాడు. పొలం పనులు కోసం పెట్టుబడి కి తీసుకున్నవి, ఎప్పుడూ ఏడాది దాటి ఉంచుకోలేదు. మొట్ట మొదటి సారి మూడేళ్లు తర్వాత ఈ రోజు తీసుకొచ్చాడు. ఖాతా బుక్ app లో చూశాను. లక్షా డెబ్బై అయిదువేలు మూడు సార్లుగా సర్దుబాటు చేసినట్లు, దానిలో లక్ష వరకుContinue reading “ఆత్మ బంధువులు”
పులిహోర
మహానాడు కి వచ్చిన జనం పలచగా ఉన్నచోట/ ఖాళీ కుర్చీల ఫోటోలు తీసుకుని, తనకి కావల్సిన స్టఫ్ సేకరించుకుని బైక్ మీద తన ఊరు బయలుదేరాడు రాకేశ్.. ఏడు దాటింది. చీకటి ముసురుకుంటూ ఉంది. వెన్నెల వెలుగు రాబోతుంది. మరో ఆరు కిలోమీటర్లు ప్రయాణం ఉండగా పాలేరు బ్రిడ్జ్ మీద మలుపులో ఒక అమ్మాయి అనుమానాస్పదంగా తచ్చట్లాడటం గమనించాడు. కొద్ది దూరం ముందుకి వెళ్ళి తిరిగి వెనక్కి వచ్చాడు. బండి ఒక పక్క పార్క్ చేసి తానూContinue reading “పులిహోర”
ఒక్క సారేగా
…. ఎనిమిది దాటాక టౌన్ లోకి ఎంటర్ అవుతుంటే పొద్దుటే మా ఇంటావిడ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. కలెక్టర్ లు చెప్పినవి మర్చిపోయినా కొంపలు ఏమీ మునగవు. నేరుగా ఇంటికి రాకుండా ఒక రెడీమేడ్ బట్టల షాపుకి వెళ్ళాను. “ఆర్నెల్ల పిల్లాడికి ఏవైనా డ్రస్ లు?” వెంటనే వాల్ ఫ్యాన్ స్విచ్ వేసి సేల్స్ గర్ల్ ఒకామే “ఇటు రండి సార్” అంది. వాట్స్ అప్ప్ వీడియొ కాల్ చేసి మనమడి అన్న ప్రాసన కోసం రెండుContinue reading “ఒక్క సారేగా”
కుక్క కరిచింది
తెల్లవారు ఝామున మంచం పక్క ఏదో శబ్దానికి అతనికి మెళుకువ వచ్చింది. టి వి రిమోట్ క్రింద పడ్డ శబ్దం . మంచి నిద్రలో ఉన్న అతను లేచి దుప్పటి తొలగించాడు. మళ్ళీ నిద్రలోకి జారుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే వాష్ రూము తలుపు శబ్దం వచ్చేట్టు తెరుచుకుంది. మరో రెండు నిమిషాలకి బెడ్ రూములో ట్యూబ్లైట్ వెలిగింది. ఇంటావిడ హాల్లోకి వెళ్ళి వాళ్ల అమ్మతో చిన్నగా (అంటే అతనికి గట్టిగా అని అర్ధం) మాట్లాడసాగింది. అతన్నిContinue reading “కుక్క కరిచింది”
మన్మధరావు
పసుపు పచ్చ చొక్కా మీద ఆకుపచ్చ పూలు ఉన్న లూజు షర్ట్ వేసుకుని, అనేక రంగుల బర్ముడా వేసుకుని నెత్తిన టోపీ పెట్టుకుని కొబ్బరి బొండం లో కలుపుకున్న ద్రవం సిప్ చేస్తూ గోవా లో బీచ్ లో కూర్చుని ఉన్నాడు మన్మధరావు. పది నిమిషాల నుండి తననే గమనిస్తూ, ఒక పాతిక నిండని బ్యూటీ ఎదురు టేబుల్ వద్ద కూర్చుని ఉంది. చక్కటి పలు వరస. చక్కటి శరీరం. కాన్ఫిడెంట్ గా చూపులు. ఫోర్క్ తోContinue reading “మన్మధరావు”
స్వంత స్థలం, ఇంకా కష్టం
Un authorised లేఔట్ ల registration లు ఆగిపోయి నెలలు గడుస్తున్నాయి. మార్కెట్ లో ఎంతో డబ్బు బ్లాక్ అయింది, లావాదేవీలు ఆగిపోయాయి. ప్రభుత్వ నిర్ణయం కోసం అనేకమంది మంది ఎదురు చూస్తున్నారు. ఎలాటి రెగ్యులరైజేషన్ కానీ, కొనుగోలుదార్ల ని ధృష్టి లో ఉంచుకుని రాయితీలు గాని ప్రకటించలేదు. ఒక పాలసీ తీసుకు రాలేదు. పావలా అడ్వాన్స్ ల మీద రియల్ ఎస్టేట్ రంగం pause బటన్ మీద కూర్చుని ఎదురుచూస్తూ ఉంది. స్వపక్ష నేతల రియల్Continue reading “స్వంత స్థలం, ఇంకా కష్టం”
పందికొక్కు
మూడు రోజుల నుండి పంది కొక్కు సమస్య చర్చకి వస్తూనే ఉంది. మొదటి రోజు పప్పీలా గా ముద్దుగా ఉండే ప్రస్తావన, రెండో రోజుకి వేట కుక్క అయి మూడో రోజుకి చిరుత గా మారుతుంది. గ్రౌండ్ ఫ్లోర్ లో కుండీలలో మట్టి తోడటం, మెట్లు మీద నానా చెత్త వదలటం, సీసా లో నుండి వచ్చిన భాష తెలియని చైనీస్ పొగ భూతం లాగా తలుపు తీయగానే చెప్పుల స్టాండ్ నుండి గబాలున దూకటం …Continue reading “పందికొక్కు”
