తాత కాల్చాడు

చిన్న పిల్లలలని డీల్ చేయటం అంత ఈజీ కాదు. ముఖ్యం గా “లోహిత్’ (అయిదేళ్ళ మా గ్రాండ్ కిడ్) లాటి సున్నిత మనసు ఉన్న వున్న వాళ్ళని. నిన్న ఒక ఫామిలీ ఫంక్షన్ కి వెళ్ళవలసి వచ్చింది. వెళ్తూ ఆటవిడుపుగా అందుబాటు లో ఉన్న పెద్దమ్మాయిని మనవళ్లు ఇద్దరినీ తీసుకెళ్ళాను. కార్లో అమ్మమ్మ వడి లో కూర్చొంటూ తన చేతికి ఉన్న ఎర్రటి చార ని గమనించి “అమ్మమ్మా ఏమిటిది ?” అని అడిగాడు. తాను నవ్వుతూContinue reading “తాత కాల్చాడు”

57 నిండాయి

ఎనిమిదిన్నరకి ఒక పార్సిల్ వచ్చింది ఏవో డిజైనర్ బట్టలు లాగా అనిపించింది నన్ను చూసి నవ్వుతూ ఆ పార్సిల్ తీసుకుంది ఇంటావిడ లోహిత్ యూవీన్ లు వీడియో కాల్ చేసి హ్యాపీ బర్త్డే తాతా అని చెప్పారు స్నానం చేసి టవల్ తోనే హాల్ లోకి వచ్చి ఇందాకటి పార్సిల్ ఏంటి? అని అడిగాను “మీ బర్త్డే కోసం వారం క్రితమే ఆర్డర్ పెట్టాం” అంది నవ్వుతూ .. .. .. .. సాయంత్రం గుడికి వెళదాం.Continue reading “57 నిండాయి”

ఇంటికి వెళ్ళటం బెటర్

“మాల్ లో టమోటా కేజీ 65 ట తీసుకోనా?” పొద్దుటే చిన్న పని మీద బయటకి వచ్చాను. తిరిగి వెళ్తూ గ్రోసరీస్ కోసం ఆగాను. “తీసుకోండి” అంది నెమ్మదిగా.. “గట్టిగా మాట్లాడు.. బేబీ కార్న్, ఉల్లి కాడలు తీసుకుంటున్నా.” “ ఎక్కడో చోట తిరిగి సాయంత్రం దాకా ఇంటికి రాకండి.” “ఏమయింది?” “మీ శిష్యుడు వినోద్ వచ్చాడు.” “పోయిన వారం బెంగుళూరు ట్రైనింగ్ ఉందని వెళ్ళాడు. ఏదైనా గిఫ్ట్ తెచ్చి ఉంటాడు.” “గిఫ్ట్ లాగా లేదు. ఇంతకీContinue reading “ఇంటికి వెళ్ళటం బెటర్”

అన్నా నువ్వెళ్ళిపో

అతను ఊరి విడిచి వెళ్లి న విషయం ఊరందరికీ తెలుసు. తల్లి తండ్రులు ఎందుకు మందలించారో, అసలు ఏమి జరిగిందో మాత్రం ఎక్కువ మందికి తెలీదు. ఇద్దరు కొడుకుల్లో ఒకరినే చదివించగలిగే వెసలు బాటు ఉన్న ఆ తండ్రికి చదువు కునే పెద్ద కొడుకు ఇల్లు వదిలి వెళ్ళటం అనేది తట్టుకోలేని విషయం. కుటుంబం అంతా గొర్రెలు కాసి, మెట్ట పైర్లు వేసి, తినీ తినకా డబ్బులు పోగు చేసి పెద్ద పిల్లాడిని పక్కూర్లో చదువు కిContinue reading “అన్నా నువ్వెళ్ళిపో”

అభి

మా గుండమ్మ పాల ఖాతా మార్చింది. రెగ్యులర్ గా పల్లె నుండి ఇంటికి వచ్చి రెండు పూటలా పాలు పోసి నెలాఖరుకు డబ్బు తీసుకునే అతన్ని ఆపేసింది. లోకల్ గా మా బజారు చివర్లో ఉండే ఒక ఫామిలీ పాలు తీసుకు వస్తున్నారు. ఏడాకాలం పాలు క్వాలిటీ అంత మెరుగ్గా ఏమీ లేవు. రేటు కూడా లీటరు డెబ్బయి. పెద్ద మార్పు లేదు. పచ్చి పాలతో ఉదయాన్నే టీ తాగటం ఒక మంచి ఫీల్.  పాకెట్ పాలుContinue reading “అభి”

ఎగిరే బాటరీ

అర్ధరాత్రి బాగా చలి అనిపించినప్పుడు, బెడ్ పక్కనే ఉన్న రిమోట్ తో సరిచేసే ప్రయత్నం చేశాను. ఒకటి రెండు సార్లు రెండో అరచేతితో చరిచాను. “బాటరీలు డ్రై అయిపోయినట్లు ఉన్నాయి. ‘వారం నుండి చెబుతూనే ఉన్నా..’ 1.30 గెగాహెడ్స్ మీద ప్రత్యక రేడియో ప్రసారాలు మొదలయ్యాయి. చాకచక్యం గా పక్కకి తిరిగి పడుకుని దుప్పటి కప్పుకున్నాను. ఉదయాన్నే వాష్ రూమ్ కి వెళ్ళినప్పుడు, ట్రిపుల్ A సైజు బాటరీలు ఇంట్లోనే ఎక్కడో ఉన్నట్లు స్పురించింది. బెడ్ రూమ్Continue reading “ఎగిరే బాటరీ”

SHEAR WALL TECHNOLOGY

చిన్నతనం లో సత్తు రేకు తో రివెటింగ్ చేసి జాయింట్స్ మీద తారు పూసిన బెందెలు ఉండేవి. చెరువుల నుండి కావిళ్లలో నీళ్ళు తెచ్చుకోటానికి అనుకూలంగా ఉండేవి. బరువు తక్కువ. తర్వాత తర్వాత ఒకే రేకుతో పోతపోసిన/ లేత్ వర్క్ చేసిన బిందెలు మార్కెట్ లోకి వచ్చేశాయి. ఎక్కడా జాయింట్ అనేది ఉండదు. ఇంటి, నిర్మాణం లో చాలా మెటేరియల్ వాడుతుంటాం పునాది కోసం గాళ్ళు తీసి నల్ల రాళ్ళు పేర్చి సున్నం/సిమెంట్ తో పాక్ చేసిContinue reading “SHEAR WALL TECHNOLOGY”

ఆత్మ బంధువులు

ఈ రోజు మా వెంకట్రామయ్య & గురవమ్మ వచ్చారు. ఎటూ వెళ్లకుండా ఇంట్లో నే ఉండటానికి ఇదొక కారణం. న్యూస్ పేపర్ లో చుట్టిన డబ్బు ‘ఎనబైవేలు’ తీసి ఇచ్చాడు. పొలం పనులు కోసం పెట్టుబడి కి తీసుకున్నవి, ఎప్పుడూ ఏడాది దాటి ఉంచుకోలేదు. మొట్ట మొదటి సారి మూడేళ్లు తర్వాత ఈ రోజు తీసుకొచ్చాడు. ఖాతా బుక్ app లో చూశాను. లక్షా డెబ్బై అయిదువేలు మూడు సార్లుగా సర్దుబాటు చేసినట్లు, దానిలో లక్ష వరకుContinue reading “ఆత్మ బంధువులు”

పులిహోర

మహానాడు కి వచ్చిన జనం పలచగా ఉన్నచోట/ ఖాళీ కుర్చీల ఫోటోలు తీసుకుని, తనకి కావల్సిన స్టఫ్ సేకరించుకుని బైక్ మీద తన ఊరు బయలుదేరాడు రాకేశ్.. ఏడు దాటింది. చీకటి ముసురుకుంటూ ఉంది. వెన్నెల వెలుగు రాబోతుంది. మరో ఆరు కిలోమీటర్లు ప్రయాణం ఉండగా పాలేరు బ్రిడ్జ్ మీద మలుపులో ఒక అమ్మాయి అనుమానాస్పదంగా తచ్చట్లాడటం గమనించాడు. కొద్ది దూరం ముందుకి వెళ్ళి తిరిగి వెనక్కి వచ్చాడు. బండి ఒక పక్క పార్క్ చేసి తానూContinue reading “పులిహోర”

ఒక్క సారేగా

…. ఎనిమిది దాటాక టౌన్ లోకి ఎంటర్ అవుతుంటే పొద్దుటే మా ఇంటావిడ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. కలెక్టర్ లు చెప్పినవి మర్చిపోయినా కొంపలు ఏమీ మునగవు. నేరుగా ఇంటికి రాకుండా ఒక రెడీమేడ్ బట్టల షాపుకి వెళ్ళాను. “ఆర్నెల్ల పిల్లాడికి ఏవైనా డ్రస్ లు?” వెంటనే వాల్ ఫ్యాన్ స్విచ్ వేసి సేల్స్ గర్ల్ ఒకామే “ఇటు రండి సార్” అంది. వాట్స్ అప్ప్ వీడియొ కాల్ చేసి మనమడి అన్న ప్రాసన కోసం రెండుContinue reading “ఒక్క సారేగా”

Design a site like this with WordPress.com
Get started