27 ఏళ్ళు నిండి ఇద్దరు పిల్లల తల్లి అయిన మా పెద్దమ్మాయి ఈ మద్య మాటల సందర్భం లో ఒక మాట చెప్పి నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. తన చిన్నప్పుడు అమ్మా నాన్నా(అంటే నేను, రమ) పోట్లాడుకున్నప్పుడు, తను పరిగెత్తుకు వెళ్ళి దేవుడి ముందు మోకరిల్లేదట. మనసులోనే దేవుణ్ణి ప్రార్ధించేదట. తను కాజువల్ గా చెప్పినా, నన్ను బాగా ఆలోచింపచేసిన విషయం ఇది. మేము అందరిలానే కుదురుకోటానికి రెండు మూడేళ్ళ కాలం తీసుకున్నాం. ఆ తర్వాత ఎప్పుడూContinue reading “national_girl_child_day”
Author Archives: Sreenivasarao Sunkara
The great indian kitchen
ఒక మంచి సంప్రదాయ కుటుంబం. అత్త, మామ గారు, బడిపంతులు భర్త. మంచి సంభందం. అమ్మాయి అత్తగారి ఇంట్లో అడుగు పెడుతుంది. పెళ్లి హడావిడి తగ్గి బందు మిత్రులు మాయమయ్యాక .. వంట, వార్పు లో అత్తగారికి సాయం చెయ్యటం తో మొదలవుతుంది ఆమె ప్రయాణం. అత్త గారు గల్ఫ్ లో ఉన్న కుమార్తె ప్రసవానికి సాయం గా వెళ్తుంది. ఇక 360 డిగ్రీలు, వంట, సింకు, ఆమెకి. ఆఖరికి ఆమెని పడకటింట్లో తన చేతి వాసన,Continue reading “The great indian kitchen”
శుభాభినందనలు
85 మండి తాజా ఇంజనీరింగ్ పట్టబధ్రులకి మూడు గంటల రిఫ్రెషింగ్ సెషన్ ఇవ్వటం అంటే అంత మామూలు విషయం ఏమీ కాదు. అంతా యువ ఇంజనీర్లు…. ప్రతిభా పాటవాలతో పరీక్షలలో మెరుగ్గా రాణించి ఉద్యోగాల లోకి వచ్చిన వారు. అసలు అంతమంది యూత్ ని పిన్ డ్రాప్ సైలెన్స్ తో కూర్చోబెట్టి, వాటి అటెన్షన్ రాబట్టటమే ఒక గెలుపు. అనేక విషయాలు కొద్ది కొద్దిగా మాట్లాడాను. నా 33 ఏళ్ల అనుభవం తో తెలుసుకున్న అనేక విషయాలుContinue reading “శుభాభినందనలు”
SIR
రత్న ఒక లివ్ ఇన్ మైడ్. (ధనవంతుల ఇళ్ళలో వంటగది సర్వీస్ నుండి ఎంట్రీ ఉన్న చిన్న రూమ్ లో ఉండే పనిమనిషి) అశ్విన్ అనే ఆర్కిటెక్ట్ అతనితో జీవితం పంచుకొనున్న గర్ల్ ఫ్రెండ్ సబీనా ఒక పల్లెటూరి నుండి రత్న ని పనికి కుదుర్చుకుంటారు. అశ్విన్ ఒక బ్లాగర్/రైటర్ కావాలనుకుని ఇండియా లోని తమ్ముడు అనారోగ్యం కారణంగా న్యూ యార్క్ నుండి వచ్చేస్తాడు. తమ్ముడు చనిపోయాక ఇక్కడే కుటుంబ కన్స్ట్రక్షన్ వ్యాపారం లో బాగం అవుతాడు.Continue reading “SIR”
గొడల్లో పగుళ్లు
మొన్నా మధ్య ఒక మిత్రుడు ఫోన్ చేశాడు. నిండా రెండేళ్ళు వయసున్న తమ ఇంటికి గొడల్లో వచ్చిన పగుళ్లు అతన్ని భయపెట్టాయి. మర్నాడు ఉదయాన్నే వీడియొ కాల్ చెయ్యమని అతన్ని ఇల్లంతా పరిగెత్తించాను. తీరా చూస్తే ఇంటి నిర్మాణం లో స్ట్రక్చర్ చాలా బాగుంది. ఫినిషింగ్ హడావిడిగా చెయ్యటం,కారణం గా గమనించాను. గోడ కి గాడి కొట్టి నడిపిన కంసీల్డ్ కరెంట్ ఆర్ వాటర్ పైప్ నడిపినప్పుడు, వాటిని తిరిగి మాలు తో పూడ్చేస్తారు. ఆ తరువాతContinue reading “గొడల్లో పగుళ్లు”
అందుకే..
విశాలమయిన ఫంక్షన్ హాల్. టౌన్ కి దూరం అయినప్పటికి ఎంతో సౌకర్యం గా ఉంది. హై వే పక్కనే బోలెడు ఓపెన్ పార్కింగ్, సెల్లార్, ఫస్ట్ ఫ్లోర్ లో వేదిక, సెకండ్ ఫ్లోర్ లో గెస్ట్ రూములు, థర్డ్ ఫ్లోర్ డైనింగ్, రెండు లిఫ్ట్ లు మూడు స్టైర్ కేస్ లు కార్పెట్ లు విద్యుత్ లైట్ లూ, విపరీతమయిన చలి. బాగా దగ్గరి మిత్రుని కుమార్తె పెళ్లి. పెళ్లి సమయానికి చాలా ముందుగా వెళ్ళాం. మాContinue reading “అందుకే..”
మాగ్నెటిక్ లాక్
పోయినవారం ఒక సేనియర్ సిటిజన్ మిత్రుడు ఫోన్ చేశాడు. తను కొత్తగా తీసుకున్న 3BHK కి కబోర్డ్లు చేయించాలని, సలహా/ సూచన కోసం. ఒంగోలు లో ఉన్న మంచి బిల్డర్ చేసిన వర్క్ అది. అబ్జెక్షన్స్ పెద్దగా లేకుండా నాణ్యంగా ఉంది. నన్ను చూసి బిల్డర్ విష్ చేశాడు. మాతో పాటు తానూ సెకండ్ ఫ్లోర్ కి వచ్చాడు. తలుపుల వర్క్ జరుగుతూ ఉంది. కొద్ది సేపు కప్ బోర్డు ల గురించి క్లారిటీ గా మాట్లాడుకున్నాక,Continue reading “మాగ్నెటిక్ లాక్”
row houses with low roof ‘ventilation solutions
ఇప్పుడంటే, బెడ్రూం లు దానికి ఆటాచ్ద్ వాష్ రూంలు, హల్లో పౌడర్ రూంలు అలవాటు అయ్యాయి కానీ మేము 1996 లో దరిశి లో నాలుగు గదుల నిలువు ఇంట్లో బాడుగకి ఉన్నప్పుడు ఇల్లు అంటే నాలుగు దరవాజాలు, ఒక కిటికీ ఉన్న రైలు లాటి నిర్మాణం. కామన్ గోడలు. హద్దుమీద నిర్మాణాలు. పక్క స్థలం వాళ్ళు అభ్యంతరం కారణం గా బయటవైపు పూతపని చెయ్యని గోడలు. అరికాయలు మాగెసే గదుల్లాటి ఇల్లు. ఎండాకాలం, లోపల గాలిContinue reading “row houses with low roof ‘ventilation solutions”
దద్దుర్లు / Efflorescence
కోస్తా ప్రాంతాల్లో, సముద్ర తీర ప్రాంతాల్లో ఏదైనా మిగిలిపోయిన ఫ్లాట్ కొంటానికి వెళ్ళండి. లేదూ నాలుగైదు ఏళ్లుగా ఉంటున్న ఫ్లాట్ కి వెళ్ళండి. ఫ్లోరింగ్ లో skirting పై భాగాన, తెల్లగా పౌడర్ లాగా ఒక ఉప్పు లాటి పదార్ధం తయారయి ఉండటం గమనించారా? గోడకి అంటించిన మేలు జాతి putty (వాల్ కేర్) కి దద్దుర్లు వచ్చినట్లు, ఉబ్బలు ఉబ్బలుగా ఉండటం చాలా మందికి తెలుసు. దీన్ని సాంకేతికంగా efflorescence అంటారు. నిఘంటువు లో పుష్పగుచ్చముContinue reading “దద్దుర్లు / Efflorescence”
టీ కట్
విజయదశమి కి ఇల్లు శుభ్రం చెయ్యటం పెట్టుకుంది గుండమ్మ. ప్రతి రోజు చేసే శుభ్రం కాదు, ప్రతి మూలా, మచ్చులు, ఆరమారాలు, కిటికీ గ్రీల్స్, బల్బులు, ఫ్యాన్లు, ఏసి లు పాడు పచ్చి బద్దలు అన్నీ… డస్ట్ ఎలర్జీ ని గుర్తుచేస్తూ దగ్గుతుంటుంది కానీ ఈ పని మానదు.రెండో అంతస్తు మేడ మీది గెస్ట్ రూము నిన్నసాయంత్రమే శుభ్రం చేసింది. కుండీలని రోజు లాగే పలకరించి కిందికి వస్తూ రూము తలుపు వెయ్యమని చెప్పింది. బుద్ధిగా తలContinue reading “టీ కట్”
