మీకో విషయం చెప్పాలి. ఎప్పుడూ ఆదేనా? అంటే అదే.. నాకదే ఆసక్తి నివాసానికి నిర్మించే ఇంటికి భూమధ్య రేఖ వైపు (భారత దేశం లో సౌత్ సైడ్ వాల్) ఉంచే కిటికీల ఓపెనింగ్ అంత ఉండాలో తెలుసా? 7 శాతం అంటే.. ఇంటి వైశాల్యం లో 7 శాతం. వైశాల్యం అంటే వరండా మినహాయించి గోడలతో కూడిన ఇంటి బయటి కొలతల తో కూడిన విస్తీర్ణం.. దానిలో 7 శాతం ఓపెనింగ్స్ (విండోస్) ఉంచుకోవటం అత్యుత్తమం. ఎండ,Continue reading “కిటికీ సైజు”
Author Archives: Sreenivasarao Sunkara
వారణాసి యాత్ర
వారణాసి –1 ‘కాశీ’ లేదా ‘వారణాసి’ భారతదేశపు అతి ప్రాచీన నగరాల్లో ఒకటి. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్య క్షేత్రము. ఇది ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోవుంది. ఇక్కడ ప్రవహించే గంగానదిలో స్నానం ఆచరిస్తే సర్వపాపాలు నశించి పునర్జన్మ నుంచి విముక్తులౌతారని హిందువుల నమ్మకం. వరుణ, అసి అనే రెండు నదులు ఈ నగరం వద్ద గంగానదిలో కలుస్తాయి. అంచేత, ఈ క్షేత్రానికి వారణాసి అని కూడా నామాంతరం ఉంది. “కాశీ” అనే పదం “ప్రకాశించడం” లేదా “కనిపించడం”Continue reading “వారణాసి యాత్ర”
నీకెందుకురా…
..ఇరుకైన వీధిలో ఉన్న ‘అరిటాకు’ హోటల్ కి బోజనానికి వెళ్లాలని, పక్క రోడ్డులో కొంచెం దూరం గా కారు పార్క్ చేసుకోటానికి వీలుగా ఉన్న చోట ఆపి వెళ్తుంటే… … ఒక చిన్న గుంపు మొగుడు పెళ్ళాలు లా ఉంది చిన్న గొడవ మగమనిషి కొంచెం తీర్ధం పుచ్చుకున్నట్లు .. “బండి తాళం ఇయ్యవే… ఇక తాగను గాక తాగను.” ‘రోజు చెప్పే మాటేగా ఇది. ఈ రోజు నడిచి ఇంటికి వెళ్ళు తాగింది దిగుతుంది.” “బజార్లోContinue reading “నీకెందుకురా…”
తొక్కలో జీతం
నిన్న మధ్యానం లంచ్ కి ఇంటికి వచ్చినప్పుడు కాంపౌండ్ వాల్ గే ట్ విసురుగా వేసి లోపలికి వచ్చాక వరండాలో బూట్లు విసిరేసి ఇంట్లోకి రావటం చూసి మా ఆవిడ “జీతం వచ్చినట్లుంది ?” అంది. బాడీ లాంగ్వేజ్ డీకోడింగ్ లో గుండమ్మలని తట్టే వాళ్ళు లేరు. బోజనం చేసి ఒక చిన్న కునుకు తీసి మళ్ళీ ఆఫీస్ కి రెడీ అవుతూ తను రెస్ట్ తీసుకోకుండా సోఫా లో కూర్చుని ధీర్ఘo గా ఆలోచలో ఉండటాన్నిContinue reading “తొక్కలో జీతం”
అనుపమ
ఒక ఇంటర్ చదివిన పాప అనుపమ అనుకోండి. ఇంజనీరింగ్ ఎంసెట్ లో ముప్పై వేలు దాటిన ర్యాంక్ ఒంగోలుకి సుమారుగా ఎనబై కిలోమీటర్ల దూరం లో ఒక పల్లెటూరు. ఆత్మాభిమానం తో రోజు కూలి తల్లి, అనుపమ, 10 చదివే ఆమె తమ్ముడు… మూడేళ్ళ నుండి ముగ్గురు గా మిగిలిన చిన్న కుటుంబం. ఆన్ సైట్ కెనడాలో ఉన్న ఒక మిత్రుడి దగ్గర బంధువు. లోకల్ గా ఒక నెట్ సెంటర్లో ఎంసెట్ కాలేజీ ఆప్షన్ లుContinue reading “అనుపమ”
ప్రతి నెలా బటనే
మా ఇంట్లో ఒక ముస్లిం మైడ్ పదేళ్ళ పైగా పని చేస్తూ ఉంది. ఒక రకంగా మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలి. యాజ్యూవల్ ఎప్పుడు తడి లో ఉండే పెనిమిట్, ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి, అద్దె ఇల్లు … పిల్లలు ముగ్గురు సాయిబాబా సెంట్రల్ ఛారిటీ స్కూల్ లో చదివారు. పిల్ల కి చదువు పట్ల ఆసక్తి ఉంది. టెన్త్ తర్వాత నా పోరు పడలేక చదువు కి ఒప్పుకున్నారు. మద్యలో రెండు సార్లు (ఎలిక లాటిContinue reading “ప్రతి నెలా బటనే”
నేనేమన్నానే?
“నేను మళ్ళీ మీతో ఏదైనా ఫంక్షన్ కి వచ్చేది లేదు.” అంది మా ఆవిడ కొడుకు తెచ్చిన ఖరీదైన హాండ్ బాగ్ సోఫాలోకి విసిరేస్తూ… “నేనేమన్నానే ?” అమాయకం గా అడిగాను. *** నాలుగేళ్ల క్రితం రిటైర్ అయిన మా కొలీగ్ కూతురి పెళ్ళికి హైదరాబాదు వెళ్లలేక పోయాను. రిసెప్షన్ కి ఇక్కడే ఏర్పాటు చేశాడు. 2 గంటలకి ఎన్నికల విధులు ముగించుకుని ఇరవై నిమిషాల్లో ఇరవై కిలోమీటర్లు డ్రైవ్ చేసుకుని, ఇంజన్ ఆపకుండా ఇంటావిడని పిక్Continue reading “నేనేమన్నానే?”
గోడ మీది వేడి నీళ్ళ గొడవ
అవసరం అనిపిస్తే వివరణ తర్వాత ఇస్తాను. #technical వాటర్ హీటర్ లేదా గీజర్ అనబడే నీటిని వేడి చేసుకోటానికి బాత్రూమ్ లలో గోడకి తగిలించుకునే విద్యుత్ బాయిలర్ లని వినియోగించేవారు మీ గీజర్ లోని అన్నీ వేడి నీళ్ళు ఒకే సారి దించేసుకున్నాక కుళాయి కట్టేయటం అలవాటు చేసుకోండి. ఇంకా మరిగే వేడినీళ్ళు ఉండగానే టాప్ లు కట్టేసె అలవాటు ఉంటే తరచూ టాప్ ల మరమత్తులకి డబ్బు సిద్దంగా ఉంచుకోండి. ప్రతి బిల్డర్ ఇప్పుడు మేముContinue reading “గోడ మీది వేడి నీళ్ళ గొడవ”
వాళ్ళు అంతే ..!
“ఏమో రోజు లేటుగా వస్తున్నాడు అంటే రెండో వ్యవహారం ఉండే ఉంటుంది.” కూతురుతో అంది తల్లి. ప్రతిదీ నెగెటివ్ గా ఆలోచించడం మంచిది కాదు. ఆఫీస్ లో పని ఎక్కువ అయి ఉండవచ్చు. లేదా వర్షాలకి రోడ్లు పాడయి ట్రాఫిక్ లో లేటు అవుతూ .. నువ్వు అమాయకురాలివే .. ఇలా అయితే కష్టం.. తల్లిని ఒక సైకాలజిస్ట్ వద్దకు తీసుకెళ్లింది కూతురు. మూడు వారాల పాటు ‘పాజిటివ్ థింకింగ్’ కోర్సు పూర్తి చేయించి ఇంటికి పంపారుContinue reading “వాళ్ళు అంతే ..!”
పదహారు
కావలి లో బస్సు దిగేసరికి చెడ్డీ మిత్రుడు రవి ప్రకాష్ సిద్దంగా ఉన్నాడు. ఒక చాయ్, ఒక పావుగంట షాపింగ్ .. ఊరి చివర్లో ఉన్న పెళ్లి మండపం వద్ద దించి వెళ్ళాడు. సాయంత్రం ఏడున్నర దాటింది. ముహూర్తం పదిన్నరకి. హనుమంతరావు అన్న కనిపించాడు. “అన్నా ..” అని పిలిచాను. “శ్రీను ఎంత సేపయింది వచ్చి? రమ రాలేదా?” “రాలేదు అన్నా.. నేను ఆఫీస్ నుండి నేరుగా బైపాస్ లో బస్సు ఎక్కాను. రాత్రి పూట డ్రైవింగ్Continue reading “పదహారు”
