మారే హరి రఖే కోన్ :: రఖే హరి మారే కోన్

ఒకాయన చనిపోదలుచు కున్నాడు.సేఫ్టీగా నాలుగంచెల పద్దతి ఎన్నుకున్నాడు…సముద్రం ఒడ్డున ఒక చెట్టుకి ఊరి బిగించుకుని,విషం తాగేసి పిస్టల్ తో నుదుటిన పేల్చుకున్నాడు.పిస్టల్ గురి తప్పి ఉరితాడు తెగింది.కిందపడి సముద్రం లోకి పరిగెట్టాడు.విషం మత్తు లోకి నెట్టేసింది…స్పృహ తెలిసే సరికి, రంభ ఊర్వశి లు బదులుగా జాలర్లు మాటలు వినబడ్డాయి…“ఈడు బతికే ఉన్నాడురోయ్.. సముద్రం ఉప్పు కడుపు ఖాళీ చేయించింది”***మరోకాయన అసలు చావదల్చుకోలేదు..‘ఈత కల్లు’ కోసం వెళితే మృత్యువు ఎదురొచ్చింది…బర్రున తిరిగొచ్చి మిత్రుడిని కారు అప్పడిగాడు.“నేను అమరావతి పారిపోతున్నాను.Continue reading “మారే హరి రఖే కోన్ :: రఖే హరి మారే కోన్”

రేగు పళ్ళు-3

కంచుపళ్ళెం (రేగుపళ్లు 3) పెద్ద ఖర్మ అయ్యాక,బోర్లించిన వెదురు బుట్ట కింద వెలిగించిన మట్టి ప్రమిద పక్కనతెల్ల చిర లో కూర్చున్న తల్లి ని చూడటానికి పెద్ద పిల్లలిద్దరికి కి ఎందుకో మనస్కరించలేదు.ఆరడుగుల ఎత్తు, సన్నగా దృడంగా ఉండే పెద్ద రోశయ్య ని చూసిన వాళ్ళెవరూ అతనికి పదహారు మాత్రమే నిండాయని చెబితే నమ్మరు.మల్లమ్మ కి అతనే ఇప్పుడు ఆశాదిపం.మరో రెండువారాలు గడిచాక పెద రోశయ్య వచ్చి తల్లికి చెప్పాడు“నేను ముఠా పనికి వెళ్తాను”బజార్లో లారీల్లో వచ్చిన సరుకుContinue reading “రేగు పళ్ళు-3”

రేగు పళ్ళు 2

నలికీసు (కంచుపళ్ళెం) ——————————-సైకిలు గురవారెడ్డి గారి అబ్బాయిది కాబట్టి, సామాజిక న్యాయం ప్రకారం ఆ అబ్బాయిని ఎక్కించుకుని అడ్డ తొక్కుడు తొక్కుకుంటూ స్కూల్ కి చేరాడు. రోశయ్య ….తన క్లాస్ రూముని చిమ్మి, బోర్డు ని శుబ్రంగా పాత గుడ్డతో కుట్టిన సంచి తో తుడిచి అయ్యవారి బెంచీ మీద రెండు బెత్తం పుల్లలు విరిచి సిద్దంగా ఉంచడం చిన రోశయ్య పని…పంతులు తెలుగు పద్యాలు చెప్పెటప్పుడు రోశయ్యకి ఎక్కడ లేని ఉత్చాహమ్ గా ఉండేది. శ్రావ్యమయిన పధ్యాలు మదురంగాContinue reading “రేగు పళ్ళు 2”

రేగు పళ్ళు 1

రేగు పళ్ళు (కంచుపళ్ళెం -1)=============పొద్దుపోయేంత వరకు అంగడిలో వెండి పని చేసి వచ్చి పడుకున్న చిన రోశయ్యని తెల్లారగట్ల నిద్ర లేపింది మల్లమ్మ…అప్పటికే పెద రోశయ్య, వసారాలో ఉన్న పెద్ద రోట్లో జొన్నలు దంచుతున్నాడు. చెల్లెలు, తమ్ముడు ఇంకా నిద్ర పోతున్నారు..నిద్ర లేచి కావిడి తీసుకుని వెళ్ళి ఫర్లాంగు దూరం లోని చేద బావి నుండి నీరు తోడుకుని వచ్చి దొడ్లో ఉన్న రాతి తొట్టి నిండా నీళ్ళు నింపాడు చిన రోశయ్య. అన్న తమ్ములిద్దరూ మైలు దూరం లోని పారేContinue reading “రేగు పళ్ళు 1”

43/43 డిటాచ్ మెంట్

ఉదయం అందరి వద్దా వీడ్కోలు తీసుకున్నాను. జీవితపు విలువల్ని నేర్పిన మణిమారెన్, కన్నడ శ్రీనివాస్, ఏకాంతప్ప, రామచంద్రన్, మా వంటమాస్టర్, సూపర్వైజర్లు,  సైకిల్ మీద మా అందరికీ టీలు తెచ్చిచ్చే బుడ్డోడు, ఎవరిని వదల్లేదు. ‘మెకాన్’ వాళ్ళ వద్ద సైన్ చేయించాల్సిన ఫైలు సిద్దంగా ఉంది. నా లగేజ్ కూడా. లగేజ్ అంటే ఒక పెట్టె అంతే. ఈశ్వరమణి ఎప్పటిలాగే ఎనిమిదికి సైట్ కి వచ్చాడు. వస్తూనే నా పేరున ఒక ఎక్స్పెరియన్స్ సర్టిఫికేటు తయారు చేయించాడు. ఆఫీసు నుండి రావలసిన జీతం ఇప్పించాడు. ఒక కవర్లోContinue reading “43/43 డిటాచ్ మెంట్”

42. చీకటి మింగేసింది.

నా పరిస్థితి కుడితిలో ఎలుక మాదిరి అయ్యింది. ఈ ఉద్యోగం చేరను అంటే నాన్న ఎగిరితన్నేట్టు ఉన్నాడు. అక్కడ ‘పహాడీ షరీఫ్’ లో ఎన్నో భాద్యతలు ఉన్నాయి. ఒక వారం తర్వాత జాయిన్ అవోచ్చా? అని నేను ఆఫీసులో అడిగాను.” చేరొచ్చు ఒక్కసారి మద్దిపాడు AE గారికి కనబడండి. మీకు ఇచ్చిన సంతనూతలపాడు వర్క్ఇన్స్పెక్టర్ పోస్టు ఆయన పరిది లోకి వస్తుంది” అని చెప్పారు.అతని పేరు అడిగాను. “మెతుకు రమేశ్ “ అని చెప్పారు.అతని కేరాఫ్ చిరునామా టీ కొట్టుContinue reading “42. చీకటి మింగేసింది.”

41 సెలెక్టెడ్ లిస్టు

MGBS లో ముందస్తు రిజర్వేషన్ లేకుండా బస్సు పట్టుకుని, ఒంగోలు వచ్చి సీతారాంపురం (మారేళ్ళవారిపాలెం) చేరే సరికి ఏడయ్యింది. ఇంట్లో మాములుగానే ఉంది, అని తెలియగానే మానాన్న మీద విరుచుకు పడ్డాను. ‘ఆ టెలిగ్రాం ఏమిటి?’ అని. అయన ఏమి మాట్లాడకుండా నవ్వి రెండో రోజు ఒంగోలులో అటెండ్ అవాల్సిన ఒక ఇంటర్వ్యూ లెటర్ చూయించాడు. వర్క్ చార్జేడ్ సిబ్బంది (టెక్నికల్ వర్క్ ఇన్స్పెక్టర్) నెలకి 700 రూపాయలు వేతనంతో తాత్కాలిక సిబ్బంది నియామకానికి ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజిContinue reading “41 సెలెక్టెడ్ లిస్టు”

40. స్టార్ట్ ఇమిడియట్లి

ఆదివారం రోజు యూనిట్ 1818 వద్ద కొందరం పోగయ్యాం, ఏం చేస్తే బాగుంటుంది? అని మణి గారు అడిగారు. కింద నుండి స్టీల్ కట్ చేసి, సువ్వలు వంచి ఇరుక్కు పోయిన రేకు తొలగించి యధావిధిగా స్టీల్ రాడ్లు వెల్డింగ్ చేసి అంతవరకూ కాంక్రీట్ చేద్దాం అని చెప్పాను. మరి కొందరు వాళ్లకి బాగా అనిపించిన సలహాలు వాళ్ళు ఇచ్చారు. చివరకి మణి గారు చెప్పినట్లు, కింద వైపు షట్టర్ లు అలానే ఉంచి, పై నుండిContinue reading “40. స్టార్ట్ ఇమిడియట్లి”

తర్జుమా

వేగంగా వెళ్ళే కారు కి పెట్రోలింగ్ వెహికల్ అడ్డుగా వచ్చింది.పెద్దావిడ డ్రైవింగ్ చేస్తుంటే పక్కనే ముసలాయన కూర్చొని ఉన్నాడు. “స్పీడ్ లిమిట్ దాటి నట్టున్నారు?” అన్నాడు పెట్రోలింగ్ పోలీస్ అధికారి హింది లో.అవిడ ‘ఏమంటున్నాడు?’ అంది భర్త తో.“నువు వేగంగా వెళ్తున్నావని అంటున్నాడు”“మీ లైసెన్స్ చూడొచ్చా?”ఆవిడ మళ్ళీ పెద్దాయన వైపు తిరిగింది. తెలుగు లోకి తర్జుమా చేశాడీయన.“ఓహ్ మీ నేటివ్ ఆంధ్ర లో ఒంగోలా? అక్కడ మా దూరపు బందువు ఒకావిడ ఉండేది. బహు గయ్యాళిది.” డ్రైవింగ్Continue reading “తర్జుమా”

39 అమీనమ్మ

రెగ్యులర్ డ్యూటి కి అలవాటు పడుతూ, వాటర్ ట్యాంక్ వద్దకు వెళ్లి వర్క్ ప్రోగ్రెస్ చూసుకుంటుంటే ‘లాల్ జీ’ జీపు లో యూనిట్ 1515 వద్దకి వచ్చాడు. లిఫ్ట్ లో పైకి వచ్చి “క్యా బాయ్ హమే భూల్ గయే హో “ అంటూ పలకరించాడు. ఇద్దరం వాటర్ ట్యాంక్ గురించి, మధ్యమధ్య లో వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుకున్నాం. నేను లేని ఆవారం రోజుల్లో జరిగిన విశేషాలు చెప్పుకొచ్చాడు. హిమాయత్ నగర్ mecon ఆఫీసు డ్రాఫ్ట్స్ఉమన్ ఒకమ్మాయికిContinue reading “39 అమీనమ్మ”

Design a site like this with WordPress.com
Get started