అంతా తిరనాళ్ళ వాతావరణం. పండగే పండగ.ప్లాస్టిక్ సంచుల్లో మిఠాయిలు, సెంటరింగ్ మేస్త్రీలు ఏర్పాటు చేసిన మెట్ల మీద పనుముట్ల అలంకరణ, తోరణాలు, సైట్ ఆఫీసుకి విద్యుత్ దీపాలంకరణ, అంతా చక్కటి రంగు రంగుల శుబ్రమయిన బట్టలు వేసుకుని వర్కర్లు, గుర్తు పట్టని విధంగా మంచి బట్టలతో రోజూ పనిలోకి వచ్చే స్త్రీలు, దువ్విన తలలు, పూలు, పిల్లలకి రిబ్బన్లు, చిన్న మేస్త్రీలు, అందరితో పాటు మేమూ రెడీ అయ్యాం. ఎవరు మొదలెట్టారో గాని ఈశ్వరమణి చేతికి రంగులContinue reading “38 గోవిందా గోవిందా”
Author Archives: Sreenivasarao Sunkara
37 కంట్రోల్డ్ బ్లాస్టింగ్
ముసురుపట్టిన దీపావళి రోజు తడిచిన తాటాకుమందు తుప్పుమని శబ్దం చేసినట్లు చిన్నశబ్దం వచ్చింది. నాలుగయిదు ఇసుక బస్తాలు గాల్లోకి లేస్తూ పగిలి పోయాయి. ఒక దుమ్ము మేఘం చుట్టూ కమ్ముకుంది. ఒక అయిదు నిమిషాలు నిశ్శబ్దంగా గడిచాయి. పక్కనే ఉన్న భవనం కిటికీలకి కొత్తగా బిగించిన గాజు పలక ఒకటి జారీ నేలని తాకింది. చీమలు పుట్టల్లోంచి బయటకి వచ్చినట్లు మేము దాక్కున్న చోటు నుండి బయటకి వచ్చాం. ఏవిదమయినా పొరపాటు లేకుండా విజయవంతంగా ‘కంట్రోల్డ్ బ్లాస్టింగ్’ చేసినందుకు వర్కర్స్Continue reading “37 కంట్రోల్డ్ బ్లాస్టింగ్”
36 అట్టపెట్టెలో పాము
ఆయన అపనమ్మకంగా చూసి కేబిన్ బయట నాగేంద్రదేవ్ అని సబ్ ఎడిటర్ ఉంటారు కలవండి అన్నాడు. నేను ఆయన్ని కలిశాను. ఒక న్యూస్ ప్రింట్ పాడ్ ని నా వైపు నెట్టి, ‘ఏమయినా రాయండి’ అన్నారు. నేను అక్కడే ఆయన ఎదురుగా కూర్చుని “తెలుగువాడు” అనే చిన్న కొమెక (కొస మెరుపు కధ) వ్రాశాను. బీరువాలోంచి ఒక పాడ్ లో కట్టిన నా చేతివ్రాతతో ఉన్న కధని తీసి నావ్రాతతో సరి చూసుకుని “మీ ఈ జన్మకిది చాలుContinue reading “36 అట్టపెట్టెలో పాము”
35 ఎడిటర్ ని కలిశాను
పల్లెటూర్లలో వేడుకలకి షామియానాలు వేసేటపుడు నాలుగు మూలలా వెదురు బొంగుని నిలబెట్టి దానిని స్తిరంగా ఉంచడానికి తాళ్లు కడతారు. అలానే మేం ఎక్కివచ్చిన లిఫ్ట్ ని స్తిరంగా ఉంచడం కోసం రెండు తాళ్ళు ఏటవాలుగా కట్టి ఉన్నాయి. నేలవైపు వెళ్తున్న సవారి శరీరం సరిగ్గా ఆతాడుకి తాకింది. సర్కస్ లో నెట్ మీద కళాకారులు గాలిలోకి లేచినట్లు అతను తిరిగి గాల్లోకి లేచి ఈసారి సరిగ్గా ఎటు చూసినా పదిఅడుగులు మించని నీటితొట్టిలో పడ్డాడు.మేమెవరం జరుగుతున్నది గ్రహించే స్తితిలో లేము.Continue reading “35 ఎడిటర్ ని కలిశాను”
34 ఏం జరుగుతుందో అర్ధమయ్యేసరికి
ఉదయం ఎనిమిదికి అటూఇటూగా అందరం పొగయ్యాం.ఏడెనిమిది కార్లు, అందులో మెకాన్ ఇంజనీర్లు, మిలట్రీ గేరీజన్ ఇంజనీర్లు, కొన్ని కొత్త మొఖాలు కూడా ఉన్నాయి. మామెస్ నుండి రుచికరమయిన టిఫిన్, చిక్కటి కాఫీలు అన్నీ సిద్దం. అందరం వాటర్ టాంక్ (యూనిట్1515) వద్దకి చేరాం.ఒక ఆపరేటర్ నడిపే నిలువైన లిఫ్ట్ మీద బిగించిన చక్క తొట్టి లో పైకి వెళ్ళాం.పక్కనే మరో లిఫ్ట్ కాంక్రీట్ బకెట్ తో సిద్దంగా ఉంది. వంచడానికి వీలయిన బకెట్ అది. సరిగ్గా అదిContinue reading “34 ఏం జరుగుతుందో అర్ధమయ్యేసరికి”
33 హెయిర్ కట్
అలసిన సాయంత్రాలు కి ఆటవిడుపుగా TVలో వచ్చే బునియాద్, బంకేష్ బక్షి లాటి సిరియల్స్ దూరదర్శన్ ప్రైమ్ టైమ్ లో ఇరగదీసేవి. నా రూములో మంచం మళ్ళీ మళ్ళీ విరిగిపోయేది. మంచం విషయం ఏఓ ఆదినారాయణ గారితో చెప్పటం, ఆయన నన్ను ఎగాదిగా చూడటం ఎందుకని నేలమీద చాప వేసుకుని పడుకోవటం మొదలెట్టాను.పగలంతా పనిచేసి వచ్చాక, ఫ్రెష్ అయి భోజనం చేసి పడుకుంటే ప్రాణం ఎటో వెళ్ళి పోయేది.ఎంత టోపీ వాడినా, తలంతా సిమెంటు, దుమ్ముతో నిండిContinue reading “33 హెయిర్ కట్”
32 చేసింది చెప్పు
రెకొండో అనే సంస్థ కేవలం రోడ్ల నిర్మాణం చేపట్టేది. కాంట్రాక్ట్ పీరియడ్ కంటే చాలా ముందే వాళ్ళ వర్క్ పూర్తిచేయ్యటం వారి అలవాటు. వారివద్ద పవర్ఫుల్ మెషినరీ, అనుభవంతో కూడిన స్టాఫ్ ఉన్నారు. ముందుగానే అనుకున్నట్లు వాళ్ళు ఒక్క పగలు, ఒక రాత్రికి రెండు కిలోమీటర్ల మేర శరవేగంతో రోడ్డు నిర్మాణం చేయగలిగిన వాళ్ళు. పెద్ద రబ్బరు చక్రాల పవర్ రోలర్ మొదటి సారి వాళ్ళ వద్దే చూశాను. Unit 1010 మార్గం నికి లంభంగా ఒకContinue reading “32 చేసింది చెప్పు”
31 పెరిగిన జీతం
మారూములో టివి అయినా తీసేయాలి లేదా నా మిత్రులు నా మంచం మీద కూర్చోటం అయినా ఆపేయాలి. పైగా టీవి చూస్తూ తిన్నబజ్జి పోట్లాలు రూములో మూలకి ఉన్న అట్టపెట్టి/డస్ట్ బిన్ లో వేసి వెళ్తారు. ఎప్పుడో వారానికి ఒకసారి మేము కేకలేస్తే గాని పనావిడ అట్టపెట్టె లోని చెత్త బయట వెయ్యదు. మంచంతో పాటు కొన్ని కుర్చీలు కూడా కొంటె కానీ సమస్య తీరదు. “టివి చూసేటప్పుడు అందరం కూర్చుని, బరువుకి వంగి విరిగి పోయింది.” చెప్పాను. ఆContinue reading “31 పెరిగిన జీతం”
30 మంచం విరిగింది
చిటికినవేలు కన్నా తక్కువ పరిమాణంలో ఉండే డిటోనేటర్లు, సన్నటి వైర్లు ద్వారా ఒక చోటకి చేర్చి మరో బాటరీ సర్క్యూట్కి కలిపి ఉంచుతారు. చాలా సినిమాల్లో చూపించినంత ఘోరంగా, (సైకిల్ పంపు గట్టిగా కొట్టినట్లు) ఉండదు బ్లాస్టింగ్ అంటే. చాలా సింపుల్. మన బెండకాయ స్విచ్ వేసినంత సింపుల్. కానీ దాని పరిణామం మాత్రం చాలా పెద్దది. కొండరాయి గుండె పగిలి బీటలు వారొచ్చు లేదా ధుఖం తన్నుకు వచ్చినట్లు పగిలిన ముక్కలు ఎంతో దూరంలో పడొచ్చు. బాగాContinue reading “30 మంచం విరిగింది”
29 సాంబారు –ఇడ్లీ
మర్నాడు ఉదయానికి నాకు కావల్సిన మెటీరల్స్, మిల్లరు, వర్కర్లు సిద్దంగా ఉన్నారు. కానీ ట్రెంచ్ మాత్రం పూర్తి కాలేదు. మెత్తటి మట్టి మద్యలో పెద్ద పెద్ద కొండ రాళ్ళు పొడుకుకు వచ్చి ఉన్నాయి. అనుకున్నట్లు బెడ్ కాంక్రీట్ వర్క్ వీలవలేదు. జేసిబి తో పని సాధ్యపడలేదని నిన్న సాయంత్రమే నేను తెలుసుకుని ఉండాల్సింది. కొత్త వర్క్ ప్రారంభం అని ఈశ్వరమణి వచ్చారు. అక్కడ పరిస్తితి చూసి, సూపర్వైజర్ ని తెట్టాడు. “చూసుకోవాలని తెలీదా? ఇప్పుడు ఇక్కడికి వచ్చిన లేబర్ కిContinue reading “29 సాంబారు –ఇడ్లీ”
