MGBS లో ముందస్తు రిజర్వేషన్ లేకుండా బస్సు పట్టుకుని, ఒంగోలు వచ్చి సీతారాంపురం (మారేళ్ళవారిపాలెం) చేరే సరికి ఏడయ్యింది. ఇంట్లో మాములుగానే ఉంది, అని తెలియగానే మానాన్న మీద విరుచుకు పడ్డాను. ‘ఆ టెలిగ్రాం ఏమిటి?’ అని. అయన ఏమి మాట్లాడకుండా నవ్వి రెండో రోజు ఒంగోలులో అటెండ్ అవాల్సిన ఒక ఇంటర్వ్యూ లెటర్ చూయించాడు. వర్క్ చార్జేడ్ సిబ్బంది (టెక్నికల్ వర్క్ ఇన్స్పెక్టర్) నెలకి 700 రూపాయలు వేతనంతో తాత్కాలిక సిబ్బంది నియామకానికి ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజిContinue reading “41 సెలెక్టెడ్ లిస్టు”
Author Archives: Sreenivasarao Sunkara
40. స్టార్ట్ ఇమిడియట్లి
ఆదివారం రోజు యూనిట్ 1818 వద్ద కొందరం పోగయ్యాం, ఏం చేస్తే బాగుంటుంది? అని మణి గారు అడిగారు. కింద నుండి స్టీల్ కట్ చేసి, సువ్వలు వంచి ఇరుక్కు పోయిన రేకు తొలగించి యధావిధిగా స్టీల్ రాడ్లు వెల్డింగ్ చేసి అంతవరకూ కాంక్రీట్ చేద్దాం అని చెప్పాను. మరి కొందరు వాళ్లకి బాగా అనిపించిన సలహాలు వాళ్ళు ఇచ్చారు. చివరకి మణి గారు చెప్పినట్లు, కింద వైపు షట్టర్ లు అలానే ఉంచి, పై నుండిContinue reading “40. స్టార్ట్ ఇమిడియట్లి”
తర్జుమా
వేగంగా వెళ్ళే కారు కి పెట్రోలింగ్ వెహికల్ అడ్డుగా వచ్చింది.పెద్దావిడ డ్రైవింగ్ చేస్తుంటే పక్కనే ముసలాయన కూర్చొని ఉన్నాడు. “స్పీడ్ లిమిట్ దాటి నట్టున్నారు?” అన్నాడు పెట్రోలింగ్ పోలీస్ అధికారి హింది లో.అవిడ ‘ఏమంటున్నాడు?’ అంది భర్త తో.“నువు వేగంగా వెళ్తున్నావని అంటున్నాడు”“మీ లైసెన్స్ చూడొచ్చా?”ఆవిడ మళ్ళీ పెద్దాయన వైపు తిరిగింది. తెలుగు లోకి తర్జుమా చేశాడీయన.“ఓహ్ మీ నేటివ్ ఆంధ్ర లో ఒంగోలా? అక్కడ మా దూరపు బందువు ఒకావిడ ఉండేది. బహు గయ్యాళిది.” డ్రైవింగ్Continue reading “తర్జుమా”
39 అమీనమ్మ
రెగ్యులర్ డ్యూటి కి అలవాటు పడుతూ, వాటర్ ట్యాంక్ వద్దకు వెళ్లి వర్క్ ప్రోగ్రెస్ చూసుకుంటుంటే ‘లాల్ జీ’ జీపు లో యూనిట్ 1515 వద్దకి వచ్చాడు. లిఫ్ట్ లో పైకి వచ్చి “క్యా బాయ్ హమే భూల్ గయే హో “ అంటూ పలకరించాడు. ఇద్దరం వాటర్ ట్యాంక్ గురించి, మధ్యమధ్య లో వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుకున్నాం. నేను లేని ఆవారం రోజుల్లో జరిగిన విశేషాలు చెప్పుకొచ్చాడు. హిమాయత్ నగర్ mecon ఆఫీసు డ్రాఫ్ట్స్ఉమన్ ఒకమ్మాయికిContinue reading “39 అమీనమ్మ”
38 గోవిందా గోవిందా
అంతా తిరనాళ్ళ వాతావరణం. పండగే పండగ.ప్లాస్టిక్ సంచుల్లో మిఠాయిలు, సెంటరింగ్ మేస్త్రీలు ఏర్పాటు చేసిన మెట్ల మీద పనుముట్ల అలంకరణ, తోరణాలు, సైట్ ఆఫీసుకి విద్యుత్ దీపాలంకరణ, అంతా చక్కటి రంగు రంగుల శుబ్రమయిన బట్టలు వేసుకుని వర్కర్లు, గుర్తు పట్టని విధంగా మంచి బట్టలతో రోజూ పనిలోకి వచ్చే స్త్రీలు, దువ్విన తలలు, పూలు, పిల్లలకి రిబ్బన్లు, చిన్న మేస్త్రీలు, అందరితో పాటు మేమూ రెడీ అయ్యాం. ఎవరు మొదలెట్టారో గాని ఈశ్వరమణి చేతికి రంగులContinue reading “38 గోవిందా గోవిందా”
37 కంట్రోల్డ్ బ్లాస్టింగ్
ముసురుపట్టిన దీపావళి రోజు తడిచిన తాటాకుమందు తుప్పుమని శబ్దం చేసినట్లు చిన్నశబ్దం వచ్చింది. నాలుగయిదు ఇసుక బస్తాలు గాల్లోకి లేస్తూ పగిలి పోయాయి. ఒక దుమ్ము మేఘం చుట్టూ కమ్ముకుంది. ఒక అయిదు నిమిషాలు నిశ్శబ్దంగా గడిచాయి. పక్కనే ఉన్న భవనం కిటికీలకి కొత్తగా బిగించిన గాజు పలక ఒకటి జారీ నేలని తాకింది. చీమలు పుట్టల్లోంచి బయటకి వచ్చినట్లు మేము దాక్కున్న చోటు నుండి బయటకి వచ్చాం. ఏవిదమయినా పొరపాటు లేకుండా విజయవంతంగా ‘కంట్రోల్డ్ బ్లాస్టింగ్’ చేసినందుకు వర్కర్స్Continue reading “37 కంట్రోల్డ్ బ్లాస్టింగ్”
36 అట్టపెట్టెలో పాము
ఆయన అపనమ్మకంగా చూసి కేబిన్ బయట నాగేంద్రదేవ్ అని సబ్ ఎడిటర్ ఉంటారు కలవండి అన్నాడు. నేను ఆయన్ని కలిశాను. ఒక న్యూస్ ప్రింట్ పాడ్ ని నా వైపు నెట్టి, ‘ఏమయినా రాయండి’ అన్నారు. నేను అక్కడే ఆయన ఎదురుగా కూర్చుని “తెలుగువాడు” అనే చిన్న కొమెక (కొస మెరుపు కధ) వ్రాశాను. బీరువాలోంచి ఒక పాడ్ లో కట్టిన నా చేతివ్రాతతో ఉన్న కధని తీసి నావ్రాతతో సరి చూసుకుని “మీ ఈ జన్మకిది చాలుContinue reading “36 అట్టపెట్టెలో పాము”
35 ఎడిటర్ ని కలిశాను
పల్లెటూర్లలో వేడుకలకి షామియానాలు వేసేటపుడు నాలుగు మూలలా వెదురు బొంగుని నిలబెట్టి దానిని స్తిరంగా ఉంచడానికి తాళ్లు కడతారు. అలానే మేం ఎక్కివచ్చిన లిఫ్ట్ ని స్తిరంగా ఉంచడం కోసం రెండు తాళ్ళు ఏటవాలుగా కట్టి ఉన్నాయి. నేలవైపు వెళ్తున్న సవారి శరీరం సరిగ్గా ఆతాడుకి తాకింది. సర్కస్ లో నెట్ మీద కళాకారులు గాలిలోకి లేచినట్లు అతను తిరిగి గాల్లోకి లేచి ఈసారి సరిగ్గా ఎటు చూసినా పదిఅడుగులు మించని నీటితొట్టిలో పడ్డాడు.మేమెవరం జరుగుతున్నది గ్రహించే స్తితిలో లేము.Continue reading “35 ఎడిటర్ ని కలిశాను”
34 ఏం జరుగుతుందో అర్ధమయ్యేసరికి
ఉదయం ఎనిమిదికి అటూఇటూగా అందరం పొగయ్యాం.ఏడెనిమిది కార్లు, అందులో మెకాన్ ఇంజనీర్లు, మిలట్రీ గేరీజన్ ఇంజనీర్లు, కొన్ని కొత్త మొఖాలు కూడా ఉన్నాయి. మామెస్ నుండి రుచికరమయిన టిఫిన్, చిక్కటి కాఫీలు అన్నీ సిద్దం. అందరం వాటర్ టాంక్ (యూనిట్1515) వద్దకి చేరాం.ఒక ఆపరేటర్ నడిపే నిలువైన లిఫ్ట్ మీద బిగించిన చక్క తొట్టి లో పైకి వెళ్ళాం.పక్కనే మరో లిఫ్ట్ కాంక్రీట్ బకెట్ తో సిద్దంగా ఉంది. వంచడానికి వీలయిన బకెట్ అది. సరిగ్గా అదిContinue reading “34 ఏం జరుగుతుందో అర్ధమయ్యేసరికి”
33 హెయిర్ కట్
అలసిన సాయంత్రాలు కి ఆటవిడుపుగా TVలో వచ్చే బునియాద్, బంకేష్ బక్షి లాటి సిరియల్స్ దూరదర్శన్ ప్రైమ్ టైమ్ లో ఇరగదీసేవి. నా రూములో మంచం మళ్ళీ మళ్ళీ విరిగిపోయేది. మంచం విషయం ఏఓ ఆదినారాయణ గారితో చెప్పటం, ఆయన నన్ను ఎగాదిగా చూడటం ఎందుకని నేలమీద చాప వేసుకుని పడుకోవటం మొదలెట్టాను.పగలంతా పనిచేసి వచ్చాక, ఫ్రెష్ అయి భోజనం చేసి పడుకుంటే ప్రాణం ఎటో వెళ్ళి పోయేది.ఎంత టోపీ వాడినా, తలంతా సిమెంటు, దుమ్ముతో నిండిContinue reading “33 హెయిర్ కట్”
