23 సిగ్మా

నలభై రూపాయలు అడిగేసరికి భయపడి, ఆవేశంగా తలకి ఎత్తుకుని నడవటం మొదలెట్టాను గాని ఫర్లాంగు దాటే సరికి ‘మాడు’ మంట మొదలయ్యింది. సూటికేసుని క్రిందకి దించాను. టిఫిన్ చేసేటప్పుడు అక్కడ త్రాగిన నీరు రుచిగా లేదు శుచిగా లేదు. అప్పుడు తక్కువగా తాగటం వల్ల దాహం మొదలయ్యింది. గమ్యం దగ్గరలో లేదు. ఎండ పెరిగేదే కానీ తరిగేది కాదు. పెట్టె లోంచి ఒక తువాలు తీసి తలకి చుట్టుకున్నాను. తిరిగి లగేజీ తలకి ఎత్తుకున్నాను. దేవుడిని స్మరించుకున్నాను. పువ్వు లాటి అనూష  మొహంContinue reading “23 సిగ్మా”

22 నేను అబద్దం చెప్పాను

సరిగ్గా పదంటే పది రోజులు ఉన్నాయి కొత్త కొలువులో చేరటానికి. జాయినింగ్ ఆర్డర్ అయితే హుషారుగా తీసుకున్నాను గాని, నాలాటి అనామకుడికి లైఫ్ లో మొదటి అవకాశం ఇచ్చిన మాబాస్ కోటిరెడ్డి గారితో చెప్పటం ఎలా?వెంకట్రావు గారు సైట్ ఇంచార్జ్ గా ఉన్న బ్లాక్ కి రావాలసిన పెండింగ్ బిల్ల్స్ కొన్ని ఉండి పోయాయి. అవి కూడా పూర్తి చెయ్యటం మా సీనియర్ కి నేను ఇచ్చే కనీస గౌరవం అనిపించిది. మూడు రోజుల పాటు శ్రద్దగాContinue reading “22 నేను అబద్దం చెప్పాను”

21 రంగుల లాల్ బాగ్

1.‘సిగ్మా’ ని భాస్కరరాజుని తలుచుకుని అర్ధగంటలో రెజ్యూమ్ ఆఫీసులో ఇచ్చి అక్కడ నుండి సిటీ బస్ పట్టుకుని నేరుగా లాల్ బాగ్ పార్క్ కి వచ్చాను. అద్బుతమయిన ‘లాల్ బాగ్ అందాలు, పూల పరిమళాలు, క్రమ పద్దతిలో పెంచిన అనేక రకాల క్రోటన్స్, వాటిని వివిధ ఆకారాలలోకి మార్చిన పనివాళ్ళ పనితనం చూడాల్సిందే. లాల్ బాగ్ ప్రధాన ద్వారం దగ్గర నేలలో ఏటవాలుగా ఒక పెద్ద గడియారం ఉంటుంది. రంగు రంగుల క్రోటాన్స్ పూలు అంకెలుగా, పెద్ద వెడల్పాటి ఇనుప బద్దలు గంటల, నిమిషాల ముళ్ళుగా, రెండుContinue reading “21 రంగుల లాల్ బాగ్”

కాంక్రీట్ లో నీళ్ళు

కూరలో ఉప్పు ఎంత వాడాలో, కాంక్రీట్ లో నీరు కూడా అంతే.. (వాటర్ సిమెంట్ రేషియో) కంకర, ఇసుక, సిమెంట్, నీరు సరిగ్గా కలిస్తే కాంక్రీట్ అంతే కదా? లాజికల్ గా ఆలోచిద్దాం. నీరు కలిసినప్పుడు సిమెంట్ పేస్ట్ లా తయారవుతుంది. కొంచెం ఎక్కువయినప్పుడు మరికొంత పలచగా మిగులుతుంది.  కాంక్రీట్ మిశ్రమం లో నీరు ఎక్కువ అయినప్పుడు, workability (బెల్దార్లు పెరుగుఅన్నం/గుజ్జు లాగా అంటారు) ఎక్కువగా ఉంటుంది. బొచ్చలో నుండి ఎటువంటి మూస లోకయినా తేలిగ్గా జారుతుంది.Continue reading “కాంక్రీట్ లో నీళ్ళు”

సున్నితమయిన సమస్య

ఆఫీస్ అవర్స్ ముగిసేటప్పుడు పర్సనల్ నెంబరు మోగింది.డాక్టర్ విజయ్.. నా మిత్రుడు, డెంటిస్ట్.“ఇప్పుడు రాగలవా? నీ RCT క్లోజ్ చేస్తాను.”“రేపు అనుకున్నాం కదా?”“రేపు నైట్ బ్యాంకాక్ వెళ్తున్నాను. మరో వారం దొరకను”“ఒక్కడివేనా?”“అవును. వస్తున్నావా?లేదా?”“వస్తున్నాను. గంటలో అక్కడ ఉంటాను. బైక్ తీసుకుని వస్తాను”సబ్ స్టాఫ్ కి చెప్పి బయలుదేరాను.మరో అరగంట దూరం లో ఉన్నప్పుడు SE గారి టెలీ కాన్ఫరెన్స్ మొదలయ్యింది.ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వింటూ అక్కడికి చేరాను…తన రూం లో మరో కుర్రాడు కూడా ఉన్నాడు. అతనేContinue reading “సున్నితమయిన సమస్య”

20 గుస… గుస

ఎవరికయినా ఎదగడానికి పనికివచ్చేంత అసంతృప్తి, ఆనందంగా ఉండటానికి సరిపడే తృప్తి అవసరం. ఇవి సరైన పాళ్లలో ఉన్నపుడే బి.పిలు, షుగర్లు కొంత దూరంగా ఉంటాయి. అసంతృపిని గెలిపించి శుక్రవారం ఇంటర్వ్యూకి వెళ్ళటానికి నిర్ణయించుకున్నాను. మూడు బస్సులు మారి ‘శరవణా కంస్ట్రక్షన్’ ఆఫీసుకి వెళ్ళే సరికి చప్పగా తడిచి పోయాను. ఒక కవర్లో సర్టిఫికేట్లు జిరాక్స్ కాపీలు భద్రంగా తీసుకెళ్లాను. బెంగుళూరు వాతావరణం తమాషాగా ఉంటుంది. పెటేల్మని ఎండ కాస్తుంటుందా, బస్సు ఎక్కి మరో పాయింట్ లో దిగే సరికి జోరున వర్షం కురుస్తుంటుంది.Continue reading “20 గుస… గుస”

19 గ్రాఫాలజీ

ఆరోజు మద్యాహ్నం తర్వాత బావ వచ్చాడు, అసహాయమయిన తన పరిస్తితికి క్రుంగి పోయి ఉన్నాడు. ఒక్కోసారి పరిస్థితులు అనుకూలించవు. అపుడు ఆమనిషి పడే వేదన వర్ణణాతీతం. సరిగ్గా అప్పుడే ఎవరికయినా ఒక ఓదార్పు అవసరం. ఒక చేదు నిజం ఏమిటంటే మనం అప్పుడే ముక్కులతో పొడుస్తాము. మనిషిని మాటల్తో చంపేస్తాము. బావ వస్తూ కొంత డబ్బు తెచ్చుకున్నాడు. కూతురి అవసరాలు కొన్ని చూసుకున్నాడు. పరిస్థితులు సాధారణానికి వచ్చి తల్లి బిడ్డ క్షేమంగా బయటపడే సరికి పదిహేను రోజులు దాటింది.Continue reading “19 గ్రాఫాలజీ”

18 మేనకోడలి ఏడుపు

పదో నెల నిండవస్తుందని. అయినా డెలివరీ అయ్యే సూచనలు లేవని,అమ్మా వాళ్ళతో ఇమడలేక .. అదిలక్ష్మి అక్క వాళ్ళ  ‘సి‌ఆర్‌పి క్వార్టర్స్’  వద్ద ఉన్న పూరింట్లో తనే వండుకు తింటున్నానని, ఒక ప్రెస్ లో కంపోజింగ్ వర్క్ కి వెళ్తున్నానని, బావ గుంటూరు నుండి ఆదివారాలు వచ్చి వెళ్తున్నాడని పరిస్తితి ఏమి అర్ధం కావటం లేదని… ఉందా ఉత్తరం లో.నేను వెంటనే వెంకట్రావు గారి వద్ద శెలవు తీసుకుని, బాస్ కి సమాచారం చేరవెయ్యమని (ఓన్లీ ట్రంక్Continue reading “18 మేనకోడలి ఏడుపు”

17 అయాం కాన్ఫిడెంట్

మా కంపెనీకి, payments రిలీజ్ చేసే మిలటరీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ (MED)కి, వారధి లాటి గేరీజన్ ఇంజనీరు లతో నాఅప్రోచ్ చక్కగా ఉండేది. కొంత అమాయకత్వంతో కూడిన సబ్మిసివ్ నెస్ వాళ్ళు బాగా ఇష్ట పడేవారు. స్టేజ్ వైజ్ వర్క్ డన్ బిల్లులు, కాంట్రాక్ట్ సర్టిఫికేట్ తో కలసి నేనే సబ్మిట్ చెయ్యటం మొదలెట్టాను. చిన్నచిన్న లోపాలు ఉన్నా లౌక్యంగా బిల్ పాస్ చేయిస్తుండే వాడిని. కేవలం ఆ కారణంగానే ఫినిషింగ్ స్థాయిలో ఉండి చాలా పేమెంట్ రావాల్సిContinue reading “17 అయాం కాన్ఫిడెంట్”

16 రాగి సంకటి, కోడికూర

ఆదివారాలు నన్ను ఆయనే, మహాత్మా గాందీ రోడ్డు (M.G.Road) కి, తీసుకెళ్ళేవాడు. వయసులో చాలా వ్యత్యాసం ఉన్నప్పటికి అతనిలో ఇద్దరు మనుషులు ఉన్నారు. ఒకరు సైట్ ఇంజనీరు వెంకట్రావు గారు. రెండోది ఆదివారాలు బయటకి వచ్చినప్పుడు సీనియర్. కంపెనీ డబ్బుతో మా ఆదివారం ఖర్చులు మీట్ అయ్యేవారు. సార్ అని నేను పిలుస్తుంటే ‘సీనియర్’ అని పిలువు చాలు అనేవారు.  ‘సార్ అని మీ బాస్ ని పిలువు చాలు’. అనేవాడు. ఆదివారం మంచి నాన్ వెజ్ భోజనం చేసేవాళ్లం. భోజనం చేసినంతContinue reading “16 రాగి సంకటి, కోడికూర”

Design a site like this with WordPress.com
Get started