13 హిందూ పేపర్

ఆవడి వర్క్ ఆగిపోవటంతో అక్కడ మినిమమ్ స్టాఫ్ని ఉంచి మిగిలిన అందరినీ బెంగళూరు వర్కుల వద్దకి పంపే పనిలో ఉన్నప్పుడు, నేను మాబాస్ ని కలిసి నాలుగు రోజుల సెలవు అడిగాను. నాన్న వదిలి వెళ్ళాక గడిచిన మూడు నెలల్లో నేను ఇంటికి పోలేదు. పైగా పనుల వత్తిడి కూడా అంతగా లేక పోవటం తో ఆయన వెంటనే ఒప్పుకున్నాడు. “వెళ్ళి వెంటనే వచ్చేయి. బెంగుళూరు పంపుతాను.” అన్నారు. ఆ శనివారం మద్రాస్ సెంట్రల్ నుండి రాత్రిContinue reading “13 హిందూ పేపర్”

12 బీదగా చావటం తప్పు

అపర్ణ అక్క రిసెప్షన్ చూడటానికి రెండుకళ్ళూ చాలవు. ఇంత పెద్ద పార్కింగ్ ఏమి చేసుకుంటారో ఆని ముందురోజు అనుకున్న స్థలం కార్ల పార్కింగ్ కి చాలక రోడ్డు వారగా కొన్ని వాహనాలు ఆపాల్సి వచ్చింది. మద్రాస్ నగరం లోని పేరున్న పెద్ద కాంట్రాక్టర్స్ అందరూ అటెండ్ అయి ఉంటారు. మా బాస్ కాంట్రాక్టర్స్  కమ్యూనిటీ కి ప్రెసిడెంట్ గా కూడా ఉండటం వల్ల అతిదులతో వేదిక నిండి పోయింది. ఆ సాయంత్రం తమిళనాడులా అనిపించలేదు. తెలుగు వాళ్ళతోContinue reading “12 బీదగా చావటం తప్పు”

11. రెండు కాళ్ళ ఎలుక

మా ఆఫీస్ ఎకౌంటెంట్ నారాయణ రావు గారు, ఆరోజు మద్యాహ్నం అవుతున్నా ఇంకా రాలేదు. మా బాస్ ఆఫీసులో కూర్చుని ఉన్నారు. గారిజన్ ఇంజనీరు, MES Works, వారికి కొంత కరెస్పాండెన్స్ చేయాల్సి ఉంది. అప్పటికే రెండు మూడు సార్లు మా ఇద్దరినీ అడిగి ఉన్నాడు. టెన్త్ ఇంటర్ మద్య కాలం లో చాలామంది మాతరం వారి లాగే నేను కూడా ఇంగ్లీష్ టైపింగ్, కొన్ని క్లాసుల షార్ట్ హాండ్ నేర్చుకుని ఉన్నాను. మా బాస్ నన్ను పిలిచి ‘యు నో టైపింగ్’ అని అడిగారు.Continue reading “11. రెండు కాళ్ళ ఎలుక”

10 డిజిటల్ వాచ్

అతనటు వెళ్లాడో లేదో నాకొ ఆలోచన వచ్చింది. ఆ రాత్రి తన్నులు తిని పోగొట్టుకున్న HMT వాచీ గుర్తుకు వచ్చింది. నాన్నఎంతో ప్రేమగా కొనిఇచ్చినది. దాని బదులుగా ఎలెక్ట్రానిక్ డిజిటల్ వాచ్ కొనుక్కోవాలని. మొదట్లో ఆరేడు వందలు ఉండే డిస్ప్లే వాచ్ లు, క్రమీణా అందుబాటు ధరలోకి వచ్చాయి. వంద రూపాయలు లోపే మంచి వాచీ అమ్మటం గమనించాను.బర్మా బజారు పొడవంతా కాళ్లతో, కళ్ళతో కొలిచాను. ఆ వైపు నుండి ఈ వైపు కి తిరిగాను.అక్కడక్కడా షాపుల వద్ద రేటు అడిగాను.Continue reading “10 డిజిటల్ వాచ్”

9. బర్మా బజార్ (ప్యారిస్)

నడి నెత్తికి ఎండ వచ్చే సరికి వినోద్ వచ్చాడు. వచ్చీ రాగానే ‘ఎంత సేపయింది వచ్చి?’ అని అడిగాడు.  అతను గుర్తుపట్టినందుకు సంతోషం వేసింది. ఏదయినా ఒక ఆదివారం రోజు కలుస్తాను అని ఒంగోలు లో కలిసినప్పుడు చెప్పాను … “సారి అనుకోకుండా లేటయింది. ఇక్కడ లేటు అనే మాటే తప్పు. టైమ్ ప్రకారం ఇక్కడ అవసరాలు నడవవు. వీలు కుదిరినప్పుడు అవసరాలు తీర్చుకుంటూ ఉండాలి. పైగా నువ్వు వచ్చే విషయం నాకు తెలియదు. వచ్చేవారం షూటింగు షెడ్యూల్ చూసుకుని వస్తున్నాను.”Continue reading “9. బర్మా బజార్ (ప్యారిస్)”

8. ఛాయా దేవి ఇల్లు

ఇంటికి/ఆఫీసుకి ఎలా వచ్చానో తెలీదు. వచ్చాను. రూములోకి వెళ్ళి తలుపు వేసుకున్నాను.చమటతో చొక్కా తడిచి వంటికి అతుక్కుపోయింది. వళ్ళంతా నొప్పి. చొక్కా విప్పి చూసుకున్నాను. వంటి మీద వాతలు. అక్కడక్కడా వాపు. వీపు మీద కట్టేతో కొట్టిన చోట ఎముక మీద బొప్పి లా అనిపించింది.ఆఫీసు టేబుల్ మీద ఒక మూత ఉంచిన ప్లేట్ లో పోపు పెట్టిన పెరుగన్నం, ఒక పెద్ద ఆరటి పండు, గ్లాసు మజ్జిగ పెట్టి ఉన్నాయి. అమ్మ గుర్తొచ్చింది. ఇక నావల్ల కాలేదు. సోఫాలో కూర్చుని ఏడుస్తూ ఉండిContinue reading “8. ఛాయా దేవి ఇల్లు”

7. విరగ్గొట్టారు

‘మాంబలం’ లోకల్ రైల్ స్టేషన్ వద్ద (టి నగర్ కి వెళ్ళేవారు ఇదే పాయింట్ లో దిగాలి)ఎక్కువగా ‘ఆంధ్రా మెస్’ లు ఉండేవి.AMIE. (Associate Member in Institute of Engineering) చదివే పిల్లలు కోకొల్లలు. ఆంధ్రపదేశ్ లో ఇంజనీరింగ్ కాలేజీ లు వేళ్ళ మీద లెక్కించేట్టు గా ఉండేవి. ప్రభుత్వ కాలేజీలు కాకుండా ఇంకా కొన్ని తక్కువ సంఖ్య లో ప్రైవేట్ కాలేజీ లు ఉండేవి. ఇంజనీరింగ్ విధ్య అంటే అదో అందని పండు. ఇంజనీరింగ్Continue reading “7. విరగ్గొట్టారు”

6. ఆమె ‘శాంతి’ కాదు

మద్రాసు, త్యాగరాయనగర్ (టి నగర్)లో అప్పట్లోనే అనేక కళ్యాణ మండపాలు ఉండేవి. ముహూర్తాల కాలం లో అవిఅన్నీకళకళ లాడుతుండేవి. ముహూర్తాలు ఎన్ని ఉండేవోగాని దాదాపు ప్రతిరోజూ పెళ్లిళ్లు & రిసెప్షన్ లు అట్టహాసంగా జరుగుతుండేవి. రోడ్డుమీద షామియానా వేసి, ఎదురుగానో పక్కనో ఉన్న ఖాళీస్థలంలో వేదిక కట్టి, చుట్టూ సప్లయ్ కంపెనీ వాల్ క్లాత్ కట్టి భోజనాలు వండించి బంతులు పెట్టడం మాత్రమే తెలుసు. ఇలా కళ్యాణమండపాలు, వాటికి అత్యంత వైభవంగా అలంకరణ రంగురంగుల లైట్లు, పన్నీరు,Continue reading “6. ఆమె ‘శాంతి’ కాదు”

5. జయమాలినికి ఫోన్ చేశాను

అపర్ణ అక్క ఆ పుట ఆకలి తీర్చటంతో పాటు, మరో వరం కూడా ఇచ్చింది.ఆఫీసు అకౌంటెంట్ నారాయణ రావు గారికి ఆర్డర్ పాస్ చేసింది. ఆఅబ్బాయి అడిగిన్నన్ని పోస్టల్ స్టాంపులు ఏమి ప్రశ్నించకుండా ఇవ్వమని. నాన్నగారికి తాను చెప్పుకుంటానని. మరో సమస్య తీరింది. కానీ అందుబాటులో ఉన్నవాటి మీద అశ్రద్ద మనిషికి సహజం. నన్ను మాబాస్ మాటలే వేటాడేయి. “ఏం కావాలని అనుకుంటున్నావు?” ఆయన నిద్రలేపి గధమాయించి నట్లు అనిపించేది. మా ఆఫీస్ కి ఒక మెటీరియల్ సప్లయ్ రిప్రజంటేటివ్Continue reading “5. జయమాలినికి ఫోన్ చేశాను”

4. సుశ్రీ నువ్వే కదా?

నేను బెరుగ్గా హాల్లోకి వెళ్ళేటప్పటికి మా బాస్ సోఫాలో కూర్చుని, హిందూ పేపర్ చూస్తున్నారు.గదిలో ఒక మూల బుష్ కలర్ టి.వి ఉంది. ప్లే అవుతున్న కలర్ టీ.విని అంత దగ్గరగా చూడటం అదే.టీవి స్టాండ్ కింద ఆకాయ్ వి‌సి‌పి లోంచి వచ్చే టామ్ అండ్ జెర్రీ ప్రోగ్రాం చూస్తూ, ఒక పాతికేళ్ళ యువతి కూర్చుని ఉంది. నేను అత్యంత నిశబ్దం గా లోపలికి వచ్చి స్టార్ హోటల్ డోర్ మెన్ లాగా అంతే వినయంగా నిలబడ్డాను.ఆయన నన్నుContinue reading “4. సుశ్రీ నువ్వే కదా?”

Design a site like this with WordPress.com
Get started