33 హెయిర్ కట్

అలసిన సాయంత్రాలు కి ఆటవిడుపుగా TVలో వచ్చే బునియాద్, బంకేష్ బక్షి లాటి సిరియల్స్ దూరదర్శన్ ప్రైమ్ టైమ్ లో ఇరగదీసేవి. నా రూములో మంచం మళ్ళీ మళ్ళీ విరిగిపోయేది. మంచం విషయం ఏ‌ఓ ఆదినారాయణ గారితో చెప్పటం, ఆయన నన్ను ఎగాదిగా చూడటం ఎందుకని నేలమీద చాప వేసుకుని పడుకోవటం మొదలెట్టాను.పగలంతా పనిచేసి వచ్చాక, ఫ్రెష్ అయి భోజనం చేసి పడుకుంటే ప్రాణం ఎటో వెళ్ళి పోయేది.ఎంత టోపీ వాడినా, తలంతా సిమెంటు, దుమ్ముతో నిండిContinue reading “33 హెయిర్ కట్”

32 చేసింది చెప్పు

రెకొండో అనే సంస్థ కేవలం రోడ్ల నిర్మాణం చేపట్టేది. కాంట్రాక్ట్ పీరియడ్ కంటే చాలా ముందే వాళ్ళ వర్క్ పూర్తిచేయ్యటం వారి అలవాటు. వారివద్ద పవర్ఫుల్ మెషినరీ, అనుభవంతో కూడిన స్టాఫ్ ఉన్నారు. ముందుగానే అనుకున్నట్లు వాళ్ళు ఒక్క పగలు, ఒక రాత్రికి రెండు కిలోమీటర్ల మేర శరవేగంతో రోడ్డు నిర్మాణం చేయగలిగిన వాళ్ళు. పెద్ద రబ్బరు చక్రాల పవర్ రోలర్ మొదటి సారి వాళ్ళ వద్దే చూశాను. Unit 1010 మార్గం నికి లంభంగా  ఒకContinue reading “32 చేసింది చెప్పు”

31 పెరిగిన జీతం

మారూములో టి‌వి అయినా తీసేయాలి లేదా నా మిత్రులు నా మంచం మీద కూర్చోటం అయినా ఆపేయాలి. పైగా టీవి చూస్తూ తిన్నబజ్జి పోట్లాలు రూములో మూలకి ఉన్న అట్టపెట్టి/డస్ట్ బిన్ లో వేసి వెళ్తారు. ఎప్పుడో వారానికి ఒకసారి మేము కేకలేస్తే గాని పనావిడ అట్టపెట్టె లోని చెత్త బయట వెయ్యదు. మంచంతో పాటు కొన్ని కుర్చీలు కూడా కొంటె కానీ సమస్య తీరదు. “టి‌వి చూసేటప్పుడు అందరం కూర్చుని, బరువుకి వంగి విరిగి పోయింది.” చెప్పాను. ఆContinue reading “31 పెరిగిన జీతం”

30 మంచం విరిగింది

చిటికినవేలు కన్నా తక్కువ పరిమాణంలో ఉండే డిటోనేటర్లు, సన్నటి వైర్లు ద్వారా ఒక చోటకి చేర్చి మరో బాటరీ సర్క్యూట్కి కలిపి ఉంచుతారు. చాలా సినిమాల్లో చూపించినంత ఘోరంగా, (సైకిల్ పంపు గట్టిగా కొట్టినట్లు) ఉండదు బ్లాస్టింగ్ అంటే. చాలా సింపుల్. మన బెండకాయ స్విచ్ వేసినంత సింపుల్. కానీ దాని పరిణామం మాత్రం చాలా పెద్దది. కొండరాయి గుండె పగిలి బీటలు వారొచ్చు లేదా ధుఖం తన్నుకు వచ్చినట్లు పగిలిన ముక్కలు ఎంతో దూరంలో పడొచ్చు. బాగాContinue reading “30 మంచం విరిగింది”

29 సాంబారు –ఇడ్లీ

మర్నాడు ఉదయానికి నాకు కావల్సిన మెటీరల్స్, మిల్లరు, వర్కర్లు సిద్దంగా ఉన్నారు. కానీ ట్రెంచ్ మాత్రం పూర్తి కాలేదు. మెత్తటి మట్టి మద్యలో పెద్ద పెద్ద కొండ రాళ్ళు పొడుకుకు వచ్చి ఉన్నాయి.  అనుకున్నట్లు బెడ్ కాంక్రీట్ వర్క్ వీలవలేదు. జే‌సి‌బి తో పని సాధ్యపడలేదని నిన్న సాయంత్రమే నేను తెలుసుకుని ఉండాల్సింది. కొత్త వర్క్ ప్రారంభం అని ఈశ్వరమణి వచ్చారు. అక్కడ పరిస్తితి చూసి, సూపర్వైజర్ ని తెట్టాడు. “చూసుకోవాలని తెలీదా? ఇప్పుడు ఇక్కడికి వచ్చిన లేబర్ కిContinue reading “29 సాంబారు –ఇడ్లీ”

28 సవారి

ప్రతి సోమవారం పని ప్రారంభం అయ్యే లోపు ఒక చిన్న రివ్యూ లాటిది జరిగేది. వర్క్స్ ఇంచార్జ్ ఈశ్వరమణి నిర్వహణలో. అయిదుభాషలు అనర్గళంగా మాట్లాడి , ఎలాటి డ్రాయింగ్ నయినా చూసి సునాయాసంగా మా సందేహాలు తీర్చగల 4 అడుగుల 10 అంగుళాల ఈశ్వరమణి అంటే అందరికీ హడల్. Experience makes a man perfect కి సరయిన ఉదాహరణ. ఆ వారం ఏమేం పనులు చెయ్యాలో, గత వారం చేసిన బిల్ల్స్ లో లోపాలు (కొంతమంది ఇంజనీర్లు చిన్న మేస్త్రీలతో కుమ్మక్కయి ఎక్కువContinue reading “28 సవారి”

27 నన్న మగనే .. యు మూవ్డ్ మీ

మేము నుంచున్న దగ్గర కుడివైపున ఫ్లాట్ ఫామ్ మీద అమ్ముతున్న బూట్లు చూసి ప్రాణం లేచి వచ్చింది. సండే షాపులు శలవు కనుక ఎలా కొనటమా? అని ఆలోచిస్తూ ఉన్నాను. ఒక ప్లాస్టిక్ కారి బాగ్ కాలికి సాక్స్ లాగా వేసుకుని అక్కడున్న బూట్లు తొడుక్కుని సైజు చెక్ చేసుకుంటుంటే ‘మణిమారెన్’ దగ్గరకి వచ్చి ‘ఎక్కువ మందికి ఎడమకాలు పెద్దదిగా ఉంటుంది. ఆ కాలుకి కంఫర్ట్ గా ఉండే బూటు ని సెలెక్ట్ చేసుకోవాలని’ చెప్పాడు. నేను అతని సలహాతోContinue reading “27 నన్న మగనే .. యు మూవ్డ్ మీ”

26 ఐ నీడ్ వన్ మోర్ హండ్రెడ్

‘The best way of learning a language is to be with the people who speak it ‘ అని ఒక పుస్తకం లో చదివాను. అక్కడ ఉన్న AE, JE లలో నేను కాకుండా మరో AE గారు మాత్రమే తెలుగువాళ్లం. వివాహితుడయిన ఆయన సమీపంలోని విలేజ్ లో ఉంటూ సైట్ కి వచ్చేవాడు. సఫారి డ్రస్ లేకుండా నేనెప్పుడూ అతన్ని చూడలేదు. మంచి వర్కర్. ఠంచనుగా ఉదయం 8-00 గంటలకిContinue reading “26 ఐ నీడ్ వన్ మోర్ హండ్రెడ్”

25 బూట్లు

ఉన్న ఎనిమిది రూముల్లో రూముకి సగటున ఇద్దరం/ముగ్గురం  చొప్పున AE, JE లం ఉండేవాళ్ళం. దాదాపు మధ్యలో ఉండే మారూములో శ్రీనివాస్ అని కన్నడ AE ఉండేవారు. ఇప్పుడే చెప్పినట్లు మారూములో ఒక పెద్ద బ్లాక్ & వైట్ టి‌వి ఉండేది. ఒక చక్క టేబుల్ మీద. అందుకే మా రూంలో ఇద్దరమే ఉండేవాళ్లం. అప్పట్లో పొడవాటి GI పైపు కి కట్టిన చాప ముల్లు లాటి యాంటీనా, బూస్టర్ సాయంతో దూరదర్శన్ డిల్లీ కార్యక్రమాలు వస్తుండేవి. ప్రతి రోజు రాత్రి 8-30Continue reading “25 బూట్లు”

24 ఆర్గనైజేషన్

రూముకి వెళ్ళి ప్లాస్టిక్ నవారు అల్లిన మంచం పరుచుకుని పడుకుని నిద్ర పోయాను. నిద్ర లేచే సరికి సాయంత్రం అయింది. స్నానం చేసి మెస్ కి వెళ్ళి భోజనం చేశాను. కొత్తగా వచ్చిన ఒకరిద్దరు JE లతో పరిచయం చేసుకుని మళ్ళీ వచ్చి పడుకుని గాఢంగా నిద్రపోయాను. ప్రతిరూముకి ఇద్దరు చొప్పున (ఏ‌ఈ & జే‌ఈ) మొత్తం పదహారు మందికి ఈ క్వార్తెర్స్, ప్రధాన సైట్ ఆఫీస్ కి రెండు నిమిషాల నడక దూరంలో ఉండేది. సూపర్వైజర్లుContinue reading “24 ఆర్గనైజేషన్”

Create your website with WordPress.com
Get started