ఆమె యవ్వనాన్ని అతనికి ధార పోసింది.ఎంతో అనుకువగా అతనితో ఉంది.అతను ఆవిడని వదిలి మరో స్త్రీ తో వెళ్ళి పోయాడు.ఆమె ని ఒక్క సారిగా శూన్యం ఆవహించింది.ఒక నిస్పృహ.. వేదన ముంచెత్తాయి.మనశ్శాంతి కోసం పరితపించింది.కాశీ వెళ్లింది. అనేక సాధువులని దర్శించింది.చివరికి ఆమెకి ఒక గురువు లభించాడు.తన బాదంతా వెళ్లగక్కింది.“నేను అతన్ని ఎంతో ప్రేమించాను. జీవితం లో విలువయిన కాలం అతని సేవలకే కేటాయించాను. నన్ను విడిచి వెళ్లిపోయాడు.” దుఖం మళ్ళీ తన్నుకొచ్చింది.అతను ఆశ్రమం నుండి ఒక హల్వాContinue reading “హల్వా”
Author Archives: Sreenivasarao Sunkara
లంగాలు
ఎర్రటి ఎండలో ఆఫీసు జీప్ లో దరిశి నుండి అద్దంకి వెళ్తూ ఉన్నప్పుడూ.ముండ్లమూరు దాటాక ..హటాత్తుగా డ్రైవర్ ని కారు ఆపమన్నాను. కూడా ఉన్న నా పై అధికారి (మా మద్య స్నేహం కూడా ఉంది) విస్మయంగా చూస్తుండగా నేను జీబు దిగిఎదురుగా సైకిలు మీద వస్తున్న ‘మాబు’ ని పలకరించాను. నన్ను చూసి నవ్వి అతను ఒక చెట్టు వారగా ఆగాడు. రెండు నిమిషాలు క్లుప్తంగా మాట్లాడి తిరిగి జీపు ఎక్కి పోనియ్యమన్నాను.“ఎవరతను?” మా తారక రామారావుContinue reading “లంగాలు”
మూడో గొర్రే
ఒక ఊరు ఉంది. ఆ వూరి ప్రజలకి కావలసినవి అన్నీ ఆ ఊర్లో దొరుకుతాయి. ఎవరు బయటకి వెళ్ళేపని లేదు. మార్కెటింగ్ స్ట్రాటజీ లు పెరిగాయి.కావల్సిన వస్తువుల సంఖ్య, కొత్త అవసరాలు కూడా పెరిగాయి.బయట నుండి కొత్త వస్తువులు తెచ్చి ఇచ్చేవారు తయారయారు.వారి మధ్య పోటీ కూడా ఉంది. సేవలు క్వాలిటీ పెరిగింది.అయినా ప్రజలకి అసంతృప్తి., మరేదో కావాలని మరేదో లేదని..ఒకరోజు వాళ్ళు కొన్ని గొర్రెలని చూశారు. వాటి మీద మెరిసే పేయింట్ తో అంకెలు వేసిContinue reading “మూడో గొర్రే”
ఈ రోడ్లకి ఆహ్వానం
ప్లాస్టిక్ వ్యర్ధాలు .. ప్రస్తుత ప్రపంచపు సమస్య ..తిరిగి ఉపయోగించలేని, భూమిలో కరగని ప్లాస్టిక్ వ్యర్ధాలు అనేక రకాలుగా చికాకులు కలిగిస్తున్నాయి.వీది జంతువులు మరణాలు, డైనేజ్ వ్యవస్థ కి అడ్డంకులు, పర్యావరణానికి వీటిని కాల్చడం ద్వారా వచ్చే విష వాయులు, ఒకటేమిటి అనేకం. తెల్లటి హిమాలయాలనుండి, సముద్రగర్భాలవరకు అనేక చోట్ల ప్రకృతి ని నాశనం చేస్తున్న వ్యర్ధాల గురించి ప్రపంచ వ్యాప్తంగా అనేక సంస్థలు కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రయోగాలు చేస్తూ ఉన్నాయి.తాత్కాలికంగా తిరిగి వినియోగించడం, లేదా కేరళContinue reading “ఈ రోడ్లకి ఆహ్వానం”
తిక్క శంకరయ్య
వారంతా అమృతం కోసం పాలసముద్రాన్ని మధిస్తున్నారు.దేవతలను అమరులుగా చేసేందుకు ‘అమృతం’ కావాలి.‘అమృతం’ కోసం ప్రయత్నిస్తే వద్దన్నా వచ్చేది ‘హాలాహలం’.‘హాలాహలం’ కాలకూట విషం. అది నిలువునా ప్రాణులని చంపేస్తుంది.ఆ తర్వాత అమృతం వస్తే ఎంత? రాకపోతే ఎంత?హాలాహలం వరకు ఎవరైనా హరించేస్తే ఎంత బాగుంటుంది?అప్పుడు ఒక ‘బైరాగి’ ముందుకొచ్చాడు.అతడు బేసి కన్నుల వాడు. గోచిపాత వాడు.అతను మంచుని, మంటని ఒక్కటిగా లెక్క చేసే తిక్క శంకరయ్య.చర్మమే ఆయన దుస్తులు……భస్మమే ఆయన ఆభరణాలు…..స్మశానమే ఆయన ఇల్లు……భూతాలు ఆయన మిత్రులు ……..”లోకాల… కోసం నేను విషాన్నిమింగేస్తాను.” అన్నాడు.”రేపు రాబోయే అమృతం కోసం నేడు హాలాహలం తాగేస్తాను” అన్నాడు.హాలా హల విషమంటే మాటలా? విషం దహించి వేస్తుంది. ఆవిరులు ఊపిరిని ఆపేస్తాయి.అయినా విషాన్ని ఖుషీగా తాగేస్తానంటున్నాడుContinue reading “తిక్క శంకరయ్య”
‘భాన్ గఢ్’ కోట
ఇది చాలా పెద్ద చర్చే….ఈ విషయంపై టీవీల్లో గంటలు గంటల పాటూ చర్చలు జరుగుతాయి. కెమెరాల ముందు దాదాపు మీదపడి రక్కుకున్నంత పని చేస్తారు మన మేథావులు. నాస్తికులకు ఈ విషయం చూయింగ్ గమ్ లాంటి నిత్య నాస్తా .ఎంత నమిలితే అంత సాగుతుంది.ఎంత వాగితే అంత కొనసాగుతుంది.ఇంతకీ భారత ప్రభుత్వం ఏమంటుంది?ప్రభుత్వం లెక్కల ప్రకారం అధికారికంగా దయ్యాలూ, భూతాలూ, శాపాలూ ఉన్నాయా?ఉన్నాయి!!!భారత ప్రభుత్వం దయ్యాలున్నాయని డిక్లేర్ చేసిందా?చేసింది!!!ఎప్పుడు? ఎక్కడ?ఆ సంగతి తెలుసుకోవాలంటే మీరు ‘భాన్ గఢ్’Continue reading “‘భాన్ గఢ్’ కోట”
‘విరక్తి’ ని మించిన సంతృప్తి లేదు.
ఒక విలువయినది భౌతికమయినది మనకి అందుబాటులోకి వచ్చినప్పుడు, సమాంతరంగా ఒక ‘భావం’ మనం పెంపొందించుకోవలసి ఉంటుంది. నా జీవితం లో అత్యంత ప్రియమయిన నా తండ్రి భౌతికంగా నన్ను వీడి పోతున్నాడని తెలిసినప్పుడు ఆ భావమే నన్ను ఆయన మరణానంతరం కాపాడింది. లేకుంటే నా గుండె పగిలి పోయి ఉండేది. ఇది ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఆ ‘భావమే’ ‘విరక్తి/నిరాశ’.జీవితం లో ఎంతో ప్రణాళిక చేసుకుని ఒక ఇష్టమయిన వస్తువు (car/మొబైల్/ఫ్లాట్) కొంటాము. దాని ఉపయోగం కంటే అది మనవద్దContinue reading “‘విరక్తి’ ని మించిన సంతృప్తి లేదు.”
మార్నింగ్ చాయ్-బిస్కెట్.
కన్వేయర్ బెల్ట్ మీద 500,1000 నోట్ల కట్టలు, ప్రయాణం చేస్తూ ఉన్నాయి. రద్దయిన కోట్లాది నోట్లని ఎలెక్ట్రిక్ క్రిమేషన్ 🙂 కి పంపిస్తున్నారు. మార్గం రద్దీగాను, ప్రయాణం మందం గాను సాగుతుంది. ఇంతలో పక్క పక్క నే ఉన్న ఒక 500 నోటుకి, మరో 1000 నోటుకి స్నేహం కుదిరింది.రెండు వాటి జీవిత ప్రయాణాన్ని గుర్తుచేసుకుని నిట్టూర్చాయి. ..“నేను జీవితం లో అన్నీ అనుభవించేశాను” అంది వెయ్యి నోటు. ..కళ్ళు విప్పార్చింది 500 నోటు.“కంకార్డ్ విమానాల్లో తిరిగాను, నెలల తరబడి షిప్పులో ప్రయాణంContinue reading “మార్నింగ్ చాయ్-బిస్కెట్.”
కష్టం – సుఖం
మెడికల్ షాపు లో అమ్మ కోసం ‘పెయిన్ బామ్’ ఒకటి కొనటానికి ఆగినప్పుడు, బాల్య మిత్రుడు ఒకరు కలిశాడు. చదువు పెండలాడే ఆపేసి ఫ్సైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు. ఆడ పిల్లలు ఇద్దరు యూ.ఎస్ లో ఉన్నారట. పిల్లలు, చదువులు, లాటి పిచ్చాపాటి మాట్లాడాక, పెద్దమ్మాయి వివాహం దగ్గరలోనే ఉందని చెప్పాను. “మీ నాన్న, అమ్మ.. అంతెందుకు మీకుటుంబం నాకు బాగా తెలుసు. పెళ్ళికి అవసరం అయిన డబ్బు ఇస్తాను. (500,1000 నోట్లు). ఈ రోజే తీసుకో, చే ఉత్తరం వ్రాసిContinue reading “కష్టం – సుఖం”
హొ ఆర్ యు డూయింగ్ ?
ఒక బాసుడు ఆఫీసులోకి బాసిని వచ్చింది. తను స్టాఫ్ చేత ఎంత బాగా పని చేయిస్తాడో బాసిని కి వినిపించాలని అతని ఆరాటం. వెంటనే ఒక సబ్ ఆర్డినేట్ కి ఫోన్ చేశాడు. “How are you doing?” అన్నాడు స్పీకర్ ఫోన్ నుండి…అటునుండి ఫోను మెడ వంపులో ఉంచుకుని మాట్లాడుతున్నట్టుగా ఉంది…సమాదానం ఇలా ఉంది“I was under a lot of pressure, but things seem to be flowing well now. I’ve gotContinue reading “హొ ఆర్ యు డూయింగ్ ?”
