పిల్లల ప్రేమని తట్టుకోగలరా?

రాత్రి పన్నెండు అవుతుండగా క్లబ్ లోని లాండ్ ఫోన్ మోగింది..(కొన్ని క్లబ్బుల్లో సెల్స్ వాడరు)ఆఫోనే ఎవరికోసమో తెలుసు కనుక క్లబ్ లో కుర్రాడువైర్లెస్స్ రిసీవర్ ని తెచ్చి “ముని ” కి ఇచ్చాడు..” ఇంటికి బయలుదేరారా ? ఏమైనా తిన్నారా?బయలుదేరేటప్పుడు ఒక్క రింగ్ ఇవ్వండి.టిఫిన్ తయారు చేస్తాను మీరు వచ్చేసరికి,చల్లారి పోకుండా ఉంటుంది”.ప్రతిరోజూ దాదాపు ఇదే సీన్ రిపీట్ అవుతుంది..పెళ్ళయిన కొత్తలో అడిగినంత మర్యాదగా ఆమె అడుగుతుంది.అందులో వ్యంగ్యం ఏమి ఉండదు. ఒక్క కేరింగ్ తప్ప.25 ఏండ్లContinue reading “పిల్లల ప్రేమని తట్టుకోగలరా?”

ఆరాధన

1996 ఏప్రియల్ 27 నిన్ననే ఒంగోలు పార్లమెంటు బై ఎలక్షన్లు ముగిశాయి.వైశాఖ శుద్ద దశమి ఈ రాత్రి కి ఆరాధన ఘడియలు ప్రారంభం.(తిరిగి 19 యేండ్ల తర్వాత 2015 యెప్రియల్ 27 న కూడా రాత్రి 9-45 కి ప్రారంభం ).సాయంత్రం కాంపు నుండి రాగానే తాళ్ళూరు లో ఉన్న మా పాత పెంకుల ఇంటి నుండిఒంగోలు లో ఉన్న అమ్మా నాన్న వద్దకు వెళ్ళటానికి రెడీ అయ్యామ్.జీన్సు పేంటు మీద పొడవాటి లాల్చీ వేసుకుని తలుపుContinue reading “ఆరాధన”

Dr. సదాశివం

సంధ్య వేళ ..డాక్టర్ .. సదాశివం గారి కారు అలవాటు లేని ఇరుకు వీధులలో ప్రయాణించి ఒక సన్నటి కాలి బాట ముందు ఆగింది.ఆయన కారు దిగి, అక్కడే ఆడుకుంటున్న పిల్లవాళ్లలో ఒక పెద్ద పిల్లాడిని పిలిచి ఒక పది నోటు అతనికి ఇచ్చాడు..“అరగంటలో వస్తాను కారు చూస్తుండు”చుట్టూ ఒకసారి దీర్ఘంగా పరిశీలించాక , ..అక్కడి నుండి ఫర్లాంగు దూరంలోని ఆమె ఇంటికి వెళ్ళాడు.అతనలా నేరుగా ఇంటికే వస్తాడని ఏమాత్రం ఊహించని ..ఆవిడ కొద్ది సేపు ఏమిContinue reading “Dr. సదాశివం”

వాడు

అస్తిపంజరం వళ్ళు , గుడ్లగూబ కళ్ళు,ఆడదాని జుట్టు , టైటు ఫాంటు, మాచికల చొక్కా….వాడో ఉష్ణ పక్షి , వాడో గుంట నక్క .కాలేజీకి వెళ్ళే దారిలో కాపు వేస్తాడు వెనుకనే నడుస్తాడు ..ఏదేదో కూస్తాడు, అరుస్తాడు , ఇకిలిస్తాడు , సకిలిస్తాడు ..సాయంత్రం ట్యూషన్ కి వెలితే దారిలో సైకిల్ మీద అడ్డొస్తాడు ..చేతులు వదిలి , కాళ్ళు వదిలి , రకరకాల విన్యాసాలు చేస్తాడు .నవ్వుతాడు .. హీరో లా గెంతుతాడు,,తోక తెగిన జంతువులా గెంతుతాడు.ఎపుడైనా వీది మలుపుContinue reading “వాడు”

గుప్పెడు నేరేళ్ళు

గుప్పెడు నేరేళ్ళు………..    సుంకర శ్రీనివాస రావురాత్రి నుండి మా శ్రీమతి ముభావంగానే ఉంది. వాతావరణం సాధారణ స్థితికి తేవటానికి విఫల ప్రయత్నం చేసి, మిన్నకున్నాను.సాదారణంగా ఆదివారం బద్దకంగా మొదలవుతుంది. కాని ఈ ఆదివారం అన్ని రోజుల్లాగానే వేగంగా మొదలయ్యింది. తొమ్మిదయ్యేసరికి అందరం (అందరం అంటే నేను మా ఆవిడా..మా 16 ఏండ్ల మా కుమారుడు.) రెడీ అయ్యాం.తను కాటన్ చిర కట్టుకుని , తలలో పులు తురుముకుని ..నుదిటి మిద పూజ చేసిన తాలుకు కుంకుమ తోContinue reading “గుప్పెడు నేరేళ్ళు”

సిగిరెట్లు

కనీసం నాలుగు రోజులైనా పడుతుంది అనుకున్నా..కానీ ఆ ఆదివారపు మధ్యాన్నం అమ్మ తవ్వ(లోహం తో చేసిన cylindrical vessel )లోని జొన్నలు చాటలో దొర్లించింది. (గిద్ద అంటే సుమారుగా 125 g ,2 గిద్దలు అర సోల, 2 అర సోలలు ఒక సోల , రెండు సోలలు ఒక తవ్వ మనము 1000 g లేదా Kg అనుకోవచ్చు) . బయట కొచ్చి బుద్దిగా ? చదువుకుంటున్న నన్ను వాసు లోపలికిరా రా అంది. వణికే కాళ్లతో లోపలికి వెళ్ళాను. చాట వైపు చూపించింది.జొన్నల మధ్యలో తెల్లని బియ్యం. రైతుల వద్ద ఎపుడైనా జొన్నలు, రాగులు, సజ్జలు (పొలం లోకి పని కిContinue reading “సిగిరెట్లు”

ఒక వర్షపు సాయంత్రం

కొన్నేళ్ళ క్రితం ఒక వర్షం కురిసే సాయంత్రం లక్కవరం (తాళ్ళూరు మండలం, ప్రకాశం జిల్లా ) నుండి దరిశి (హోం) కి వెళుతున్నాను.ఎడతెరిపిరి లేని వర్షం.చిత్తడి నేల. బజాజ్ m-80 బండి. జారుతున్న నేల. కళ్ళలో సూదుల్లా గుచ్చుతున్న వాన చినుకులు. జాగర్తగా ఇంటికి మరో (20 km) వెళుతుండగా చెయ్యెత్తి లిఫ్ట్ అడిగిన ఆగంతకుడు. యువకుడే కానీ అతని ముఖం లో ఆదుర్దా…. బండి ఎక్కించుకున్నాను. ఒక 10 km ప్రయాణం చేశాక తూర్పువీరాయపాలెం లో రోడ్డు కి అడ్డంగా వాగు… హటాత్తుగా పెరిగి తగ్గే గుణం ఉన్నది. దాదాపు నడుం లోతుగాContinue reading “ఒక వర్షపు సాయంత్రం”

జొన్న దంట్లు

పెద కొత్తపల్లి … నా బాల్యం లో ప్రధానమైన బాగం ఇక్కడే గడిచింది. ప్రారంభం లోనే ఒక గాలి గోపురం. మరో వైపు పెద్ద చెరువు. చెరువు కట్ట మీద ఎత్తైన చింత చెట్లు. సాగు త్రాగు నీరు సమకూర్చే చెరువు చాలా పెద్దది. రేవులోకి దిగడానికి మెట్లు. మెట్లు మీది దిగి నీళ్ళు ముంచుకునే స్త్రీలు, కావిడిలతో నీళ్ళు ముంచుకెల్లే ముఖం పుల్ల మగాళ్లు… ఉదయామ్ సాయంత్రం అంతా సందడి. ..రేవు కి దగ్గర్లో ఒక చింత్ చెట్టు ఉండేది . ..చాలా పెద్దది. గొప్పగా ఉండేది. ముఖ్యంగాContinue reading “జొన్న దంట్లు”

Create your website with WordPress.com
Get started