ఒక పదేళ్ళ తర్వాత.. మన ఆంధ్ర ప్రదేశ్ లో, ప్రకాశం -కర్నూలు జిల్లాల లో మనిషి సాధించిన ఒకానొక ఇంజనీరింగ్ అద్బుతం గా చెప్పుకోగలిగిన ఒక గొప్ప నిర్మాణం…కృష్ణ నది శ్రేశైలం డామ్ ఎగువ రిజర్వాయర్ కి చేరే మలుపు వద్ద నుండి, 18.8 కిలోమీటర్లు దూరం కొండలని తొలుచుకుంటూ నలమల్ల సాగర్ రిజర్వాయర్ కి కేవలం గ్రావిటీ ఆధారంగా నీళ్ళు ప్రవహించేట్టుగా , రెండు సొరంగమార్గాలు నిర్మాణం భావితరాల దేవాలయం “పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్”ప్రకాశంContinue reading “పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ (ప్రకాశం, ఆంధ్ర ప్రదేశ్, ఇండియా)”
Author Archives: Sreenivasarao Sunkara
ప్లాన్ ‘A’
ఆదివారం ఉదయాన్నే రఘుపతి గుంటూరు నుండి నేరుగా వచ్చేశాడు. మస్తాన్ ఇడ్లీ తిన్నాక పిచ్చాపాటి మాట్లాడుకున్నాం. “ పాంచజన్య ఎలా ఉన్నాడు?”“వాడికేం? బావున్నాడు గురుజీ”“ఇప్పుడు నీకేం అయింది? “ఇంట్లో నన్ను సరిగా పట్టించుకోవటం లేదు గురూజీ” రఘుపతి కళ్ళు ఒత్తుకున్నాడు.“బాధపడకు మన దగ్గర దండిగా అవుడియాలున్నాయి”అతను నమస్కరించాడు.నేను దీవించాను.***రాత్రి పది దాటింది.వాట్స్ అప్ కాల్. రఘుపతి నుండి.“గురుజీ..” గొంతుని బట్టి ఏడుపు ఆపుకుంటున్నట్టు తెలుస్తుంది.“ఏమయింది?” కంగారుగా అడిగాను.“మీరు చెప్పినట్లే ప్లాన్ A ప్రకారం హల్వా కొనుక్కుని, మూరెడు మల్లెపూలు కొనుక్కుని ఇంటికెళ్ళాను.”“ఏడుపు ఆపు. విషయంContinue reading “ప్లాన్ ‘A’”
అప్పట్లో ఒక నెల బడ్జెట్
మా చిన్నమ్మాయి హై స్కూల్ లో ఉన్నప్పుడు, పొదిలి నుండి ఒంగోలు కి షిఫ్ట్ అయ్యాం.స్కూల్ కి దగ్గర్లో ఒక చిన్న ఇల్లు 1500 రూపాయల అద్దెకి తీసుకున్నాం.మ చిన్నది 9th క్లాస్ లోనూ, పెద్దది 10th లోనూ, సాయి 4th లోనూ ఉన్నారు.చిన్నమ్మాయికి డబ్బు గురించి చెప్పాల్సిన వయసు వచ్చిందని అనిపించింది.ఒక రోజు అందరం బోజనం చేసేటప్పుడు స్క్రిప్ట్ ప్రకారం మా చిన్నమ్మాయికి ఉన్న తెలివితేటలు గుండమ్మకి లేవని నమ్మేట్టు చెప్పాను. కావాలంటే ఒక నెలContinue reading “అప్పట్లో ఒక నెల బడ్జెట్”
డుర్రు
జస్టిస్ రాజశేఖరం గారు తనుండే ఐశ్వర్య అపార్ట్మెంట్, నాలుగో అంతస్తు నుండి లిఫ్ట్ వాడకుండా మెట్లు దిగి వాకింగ్ మొదలెట్టే సరికి టైమ్ సరిగ్గా నాలుగున్నర అవుతుంది.ఎవరయినా గడియారం సరిచేసుకోవచ్చు. అంత కరెక్ట్.ఒక వారం క్రితం సరిగ్గా పోయిన శనివారం జరిగిందా విషయం.రోజు లాగే..మెట్లు దిగి గేటు వైపు నడుస్తూ ఉంటే..అనూహ్యంగా ఏదురు వచ్చిన వాచ్మేన్ ‘కొండలు’ రెండు చేతులు బొటన వెళ్ళు నోట్లో, చూపుడు వేళ్ళు తో కళ్లని సాగదిస్తూ.. నాలుక బయట పెట్టి “డుర్ర్Continue reading “డుర్రు”
ఎంతవారు గాని !!
“ఇంత చాతగాని వాడనుకోలేదు” వెనక సీట్లో కూర్చున్న అత్త మెత్తగా మెల్లగా అయినా స్పస్టంగా అంది. డ్రైవింగ్ చేస్తున్న అతనికే వినబడింది. పక్కన కూర్చున్నా ఆవిడకి వినబడదా?అతను అసలే కుమిలి పోతున్నాడు. ఇన్నాళ్ళు కష్టం ఉపయోగపడలేదు.నాలుగేళ్ల తర్వాత మళ్ళీ మొదటకి వచ్చాడు. అనుభవ రాహిత్యం, కార్పొరేట్ ప్రవేశం, ఖర్చులు, రవాణాలు పెరిగిపోవటం, వెహికల్స్ కొన్ని ప్రమాదలకి గురి అవటం, సరిపడా ఇన్సూరెన్స్ రాకపోవటం, వడ్డీలు పెరగటం, కోర్టు కేసులు… ఇలా చాలా .. మొత్తం కార్లన్ని అమ్మటం/ఫైనాన్స్ వాళ్ళకి ఇచ్చేయటంContinue reading “ఎంతవారు గాని !!”
ఒక ధర్మ సందేహం
నిన్నటి రోజు..ఉదయం వాకింగ్ కి వెళ్లి వచ్చి, వరండా లో కూర్చుని పేపర్ తిరగేస్తూ.. కాఫీ తాగిన సుబ్బారావు..భార్యని పిలిచి ..’ఛాతి’ నొప్పిగా ఉందని ‘చమటలు’ కక్కాడు.అప్పటి కి అందుబాటులో ఉన్న ఆర్‌ఎంపి, ‘లో బిపి’ అని, మరో పావుగంటలో దగ్గర ఉన్న హాస్పిటల్ కి చేరి ecg మొదలెట్టగానే , డాక్టర్ మరో పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ కి తీసుకు వెళ్ల మని సలహా ఇస్తే, ఆటో లో మెయిన్ రోడ్డు ఎక్కే సరికి అతనిContinue reading “ఒక ధర్మ సందేహం”
ఇంటావిడ
మీ కిప్పుడు పన్నెండు లక్షలా యబైవేల రూపాయల ప్రశ్న. కంప్యూటర్ స్క్రీన్ మీద…బంగారం ఏ ఫారన్ హీట్ ఉష్ణోగ్రత వద్ద కరుగుతుంది. (what is the melting point of the metal Gold?)A) 2017 B) 1945 C) 1497 D) 3612సుబ్బారావు సందేహం లో పడ్డాడు. ఈ ఒక్క ప్రశ్న చెబితే 12.5 లక్షలు అంటే టాక్స్ పోను సుమారుగా 9 లక్షలు తీసుకుపోవచ్చు. బాకీలన్నీ తీరతాయి.సుబ్బులు కి మెడ లోకి ఏదయినా చేయించొచ్చు. ఆ సుబ్బులు. (y)‘ఫోన్ ఏContinue reading “ఇంటావిడ”
పనికి మాలిన సలహా
భరించలేని తలనొప్పి, గుండె దడ, నీరసం, వళ్ళంతా ఎర్రగా దద్దుర్లు, 104 డిగ్రీల జ్వరం తో బాద పడుతున్న వ్యక్తి ని డాక్టర్ వద్దకి తీసుకు వచ్చారు.“ఇవి వడదెబ్బ లక్షణాలు. ఎప్పటి నుండి ఇలా?”“రెండు రోజుల నుండి ““రెండు రోజులా? ఎవరికయినా చూయించారా?”“ప్రగతి మెడికల్స్ షాపు రామయ్య గారికి చూపించాం”“మెడికల్ షాపా? వాళ్లకేం తెలిసి చచ్చుద్ది. వెదవ సలహాలు ఇస్తారు. మీ ప్రాణాలు తీస్తారు” కొప్పడ్డాడు డాక్టర్.పెషంటు ని వార్డ్ లోకి షిఫ్ట్ చేసి సెలైన్ పెట్టమనిContinue reading “పనికి మాలిన సలహా”
బస్సు లో ఇంటికి
ఆదివారం నాకు ఇంట్లో ‘తడి’ పర్మిట్ ఉంది.కార్ తీసుకుని బస్ స్టాండ్ దగ్గర ఉన్న నా ఫావేరేట్ ‘ఈగిల్’ బార్ కి వెళ్ళాను.మూడు పెగ్గులకే పర్మిట్ ఉంది. అందుకని నాలుగు మూడో పెగ్గులు (? :p) తీసుకున్నాను.బార్లోనుండి బయటకి వస్తుంటే.. మేనేజర్ కార్ తోలటం మంచిది కాదన్నాడు.‘పొద్దుటే వచ్చి తీసుకెళ్ళండి. పార్కింగ్ లాట్ లోనే ఉంచండి”బయటకి వచ్చి ఇంటికి వెళ్ళటానికి బస్సు పట్టుకున్నాను.మంచిదయింది.దారిలో ట్రాఫిక్ పోలీసులు కార్లు ఆపి బ్రీత్ టెస్ట్లు చేస్తున్నారు.బస్సులో ఉండటం వల్ల ఎవరు నాContinue reading “బస్సు లో ఇంటికి”
వీడేనా?
కొడుకు కార్లో సామాను జాగర్తగా దించే సరికి కోడలు “అనుసూయమ్మ’ ని జాగర్తగా నడిపించి వరండాలో కూర్చోబెట్టింది.ముందుగానే ఫోన్ చెయ్యటం వల్ల ఆశ్రమ నిర్వాహకులు పరంధామయ్య గారు ఆఫీసు గదిలో కూర్చొని ఉన్నారు.అనసూయమ్మ కి వెలుతురు బాగా ఉండే కార్నర్ గది కేటాయించేట్టు గట్టి సిఫారసు చేయించాడు కొడుకు. గది లోకి ఆమెని ఆమె సామానుని చేర్చాక, బాత్రూము సౌకర్యంగా ఉండటం, గదిలో తిరిగే ఫాను ఉండటం. మంచానికి దోమతెర కట్టుకునే ఏర్పాటు ఉండటం చూసి,కోడలు సంతృప్తి పడింది.ఆశ్రమంContinue reading “వీడేనా?”
