వక్క పొడి

“అబద్దాలు ఆడటం అనేది పిల్లలకి మనమే నేర్పుతాం. కాపీ పుస్తకం లో అబద్దం ఆడరాదు అని రాయిస్తాం. వెంకట్రావు అంకుల్ వస్తే మా నాన్న ఇంట్లో లేడు అని చెప్పమని కూడా మనమే చెబుతాం.”బస్సులో పక్క సీటు అతనికి మాత్రమే చెబుతున్నాడు కానీ. ప్రశాంతంగా సిటింగు మించని బస్సులో అందరికీ బోర్డు మీద వ్రాసి,పాఠం చెబుతున్నంత కమాండింగా ఉన్నది అతని వాయిస్.ఈపాటికే అమరావతి బోటు ప్రమాదానికి కారణాలు విశ్లేషించి,నివారణకి, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏమేం చెయ్యాలో,ప్రజానీకం ఎవరెవరి కాలర్లుContinue reading “వక్క పొడి”

తియ్యటి లడ్డు

ఒక్కోసారి అనుకోకుండా కొన్ని వేదికలు పంచుకోవాల్సి వస్తుంది.“చినమనగుండం” అనే ఒక మారుమూల ఊరికి వృతి రీత్యా ఈ ఉదయం వెళ్లినప్పుడు ఆ గ్రామ సర్పంచ్ నేను గ్రామం లోకి వచ్చానని తెలుసుకుని అక్కడి ఎలిమెంటరీ స్కూల్ లో జరిగే బాలల దినోత్సవానికి అతిదిగా ఆహ్వానించాడు.నాకు గంట పైగా లేటు ఉందని మీరు కొనసాగించండి వీలుంటే వచ్చి కనబడతానని చెప్పాను.కానీ నా కోసం కార్యక్రమం ప్రారంభం చేయలేదని తెలిసి వెంటనే వెళ్ళాను.చిన్న చిన్న పిల్లలు, బుగ్గలమీద పౌడర్, కొత్తContinue reading “తియ్యటి లడ్డు”

వారి సమస్య

మౌనం, చిరునవ్వు విలువైనవి.చిరునవ్వు సమస్యలని పరిష్కరిస్తే , మౌనం సమస్యలను దూరం గా ఉంచుతుంది.విజయాన్ని చూసిన వ్యక్తుల పెదవుల మీద వీటి చిరునామా.చక్కెర, ఉప్పు ని కలిపి ఉంచినా చీమలు తీపినే తీసుకువెళ్తాయి.సరైన వ్యక్తులని జీవితం లోకి ఆహ్వానించండి. మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోండీ. పుట్టుక ద్వారా వచ్చినవి మాత్రమే మన చేతిలో లేవు. మిగిలిన మొత్తం మన చేతిలో నే ఉంది.మన కలలని సాకారం చేసుకోలేనప్పుడు మన మార్గాలు మార్చుకుందాం. ‘గమ్యం’ ని కాదు.ప్రకృతి లో జరిగేదిContinue reading “వారి సమస్య”

హస్త వాసి

‘టెన్నిస్ ఎల్బో’ నుండి చాలావరకు బయట పడ్డాను.పరిస్తితి చాలా మెరుగ్గా ఉంది. ఆర్ధో డాక్టర్ OP (నెల రోజులు) గడువు ఇంకా ఉంది కదా అని హాస్పిటల్ కి వెళ్ళాను. :pఆయన సర్జరీ లో ఉన్నారు.వెయిటింగ్ రూమ్ లో ఖాళీ చూసుకుని కూర్చున్నాను..స్మార్ట్ ఫోను, jio సిమ్ ఎటూ ఉన్నాయిగా??గంట పైగా కూర్చున్నాను.కాంపౌండర్ వచ్చి “శ్రీనివాసరావ్.. ఒంగోలు” అని రెండు మూడు సార్లు పిలిచిందాకా గమనించనే లేదు.హడావిడిగా లెచానా?.. కాలు తిమ్మిరెక్కింది.అలానే లాక్కుంటూ డాక్టర్ గారి రూము లోకి వెళ్ళాను.డాక్టర్ గారితోContinue reading “హస్త వాసి”

తిరుగు టపా

ఇంకో రెండు  నిమిషాల్లో బస్సు బస్టాండ్ కి చేరుతుంది అనగా జరిగిందా సంఘటన.గట్టిగా పది పన్నెడు ఏళ్ల మద్య ఉంటుందా  పిల్లాడి వయసు. నిలబడ్డ పిల్లాడు నిలబ్డ్డట్టుగా కూలిపోయాడు. పక్కనే ముప్పై  మించని మరో మనిషి, చేతిలో ఉన్న గుడ్డల  సంచి  సర్దుకుని పిల్లాడిని పొదివి పట్టుకున్నాడు.రాఘవ  కూర్చున్న సీటుకి మూడు అడుగుల దూరం లో  కూలబడ్డ కుర్రాడు స్కూల్ యూనిఫార్మ్ వేసుకుని ఉన్నాడు. కుడి అరచేతి వెనుక ప్లాస్టర్ వేసిన సూది ఉంది.అప్పటిదాకా  సెల్ లో చాటింగ్Continue reading “తిరుగు టపా”

అబద్దం నచ్చింది.

రమేశ్ వచ్చే సరికి ‘వెలుగొండయ్య’ తమ పాత కాలం నాటి మట్టి మిద్దె లో నులక మంచం పరుచుకుని నిద్ర పోతున్నాడు.అది పూర్తిగా నిద్ర కూడా కాదు. చేయటానికి మరేం లేదు. మద్యాహ్నం ఒక కునుకు.ఆయనకి ఒక అబ్బాయి, మరో అమ్మాయి. ఇద్దరు స్థిరపడ్డారు. చెరో చోట. పాత మట్టిమిద్దేలో బోలెడు శూన్యం మిగిల్చి ఆర్నెల ల క్రితం బార్య వెళ్లిపోయింది. వృదాప్యం లో ఆసరాగా ఉంచుకున్న డబ్బు, కార్పొరేట్ ఆసుపత్రులు మింగేసాయి.బార్య అంత్యక్రియయలకి కొడుకుని ఇబ్బందిContinue reading “అబద్దం నచ్చింది.”

ద్విభాషీ – పావులూరి శంకరనారాయణ శ్రేష్ఠి

ఇంగ్లీషువాడు సప్తసముద్రాలు దాటి వచ్చేశాడు.ముందు వ్యాపారం చేయడానికి… తరువాత అధికారం చెలాయించడానికి….వాడి భాష మనకి రాదు…వాడు “గాడ్ ఈజ్ గుడ్” అనేవాడు.మనకి అది “గాడిదగుడ్డు” గా అర్థమైంది.మనం “రాజమహేంద్రి” అన్నాం…వాడికి “రాజమండ్రి”లా వినిపించింది.మన మాట వాడికి అర్ధమయ్యేది కాదు… వాడి భాష మనకి బోధపడేది కాదు.వ్యాపారం, పరిపాలన వాళ్ల అవసరం కనుక తెల్ల అధికారులు ఒక్కొక్కరూ తెలుగు పదాలను పట్టుకున్నారు. డిక్షనరీలు తయారు చేశారు. 1818లో విలియం బ్రౌన్ తొలి తెలుగు – ఇంగ్లీషు డిక్షనరీ తయారుచేశాడు. 1821లో క్యాంప్ బెల్Continue reading “ద్విభాషీ – పావులూరి శంకరనారాయణ శ్రేష్ఠి”

పెద్దరికం అంటే ఇస్త్రీ చొక్కాలు, ఇనప వాచ్చీలెనా ?

మా ఊర్లో ఉన్న పెద్ద కళ్యాణ మండపం లలో అదొకటి.ఆటొ లో అక్కడికి చేరే సరికి దాదాపుగా మా (ఆఫీసు) బ్యాచ్ అందరూ దిగారు.తెలిసిన వాళ్ళ పెళ్లి. బ్రతికున్నప్పుడు మాతో పాటు పని చేసిన ఒక కొలీగ్ కుమార్తె పెళ్లి.ఒకరి నొకరు పలకరించు కున్నాం.రంగుల దీపాల అలంకరణ ని, పక్కనే ఉన్న ఖాళీస్థలం లో చక్కటి కార్పెట్స్ వేసి ఏర్పాటు చేసిన బఫే విందుని దాటి కళ్యాణ వేదిక వద్దకి వెళ్ళాం.పెళ్లి కూతురు అన్న విజయ్ వచ్చిContinue reading “పెద్దరికం అంటే ఇస్త్రీ చొక్కాలు, ఇనప వాచ్చీలెనా ?”

వింత గిన్నె

అనగనగా ఒక ఊరిలో రంగయ్య అని ఒక రైతు ఉండే వాడు.అతను బీదవాడు. తనకి తండ్రి ఇచ్చిన కొద్ది పాటి పొలం లో పక్కనే ప్రవహించే వాగు నుండి నీరు తెచ్చి కూరగాయలు పండించే వాడు.అతని బార్య ఆ కూరగాయలు దగ్గర్లో ఉన్న నగరం లో అమ్మి , ఇంటికి కావల్సిన అవసరాలు గడుపుతూ ఉండేది.ఒక రోజు ఆ రైతు తన పొలం లో చెట్ల పాదులు తవ్వుతూండగా అతని పలుగుకి ఏదో లోహం తగిలి శబ్దంContinue reading “వింత గిన్నె”

ముత్యాల హారం

ఒక యువకుడు  దారిన వెళుతూ ఉంటే ఒక ప్రక్క మురికి కాలవ లో ఒక ముత్యాల హారం కనిపించింది.పెద్ద ముత్యాలు. చూడగానే చాలా విలువయినదిగా తెలుస్తుంది.చుట్టూ గమనిస్తే కనుచూపు మేర లో ఎవరు కనిపించలేదు.ఒక కర్ర పుల్ల తీసుకుని కాలవలో ముంచాడు. ఊహూ కర్ర కి తగల్లేదుమరి కొంచెం లోపలికి ఉంది. వంగి చేతితో తీసే ప్రయత్నం చేశాడు. లాభం లేదు.మరికొంత వంగి చూశాడు. ముత్యాల హారం చేతికి తగల్లేదు. కానీ అది మెరుస్తూ ఉంది.ముత్యాలు కలుపుతూContinue reading “ముత్యాల హారం”

Design a site like this with WordPress.com
Get started