ఇంటి నిర్మాణాలకి, ఇప్పుడిప్పుడే ఇంజనీరింగ్ నిపుణుల పర్యవేక్షణ కోసం గృహస్థులు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ఈ మార్పు ఇంకా చాలా రావాల్సిఉంది. ఒక సరైన సాంకేతిక నిపుణుడు తీసుకునే ఫీజు కన్నా, క్వాలిటి రూపం లో కానీ, వృధా ఆరికట్టటం లో కానీ ఇంటియజమానికి మిగిల్చేది ఎక్కువ. ఇది నిజం. సరైన సాంకేతిక నిపుణుడు అన్నాను గమనించండి. ఇంటి నిర్మాణం లో 33 ఏళ్ల అనుభవం ఉన్న సాంకేతిక వ్యక్తిగా నేను కొన్ని టిప్స్ మీతో పంచుకొదలుచుకున్నాను.Continue reading “Column steel joints.”
Author Archives: Sreenivasarao Sunkara
Bamboo is New Steel
స్టీల్ (నిర్మాణం లో వాడేది) చదరపు అంగుళం ఏరియా కి 23000 పౌండ్ల బరువు మోస్తుంది. (tensile strength) వెదురు చదరపు అంగుళం ఏరియా కి 28000 పౌండ్ల బరువు మోస్తుంది. అవును మీరు చదివింది నిజం. స్టీల్ కంటే వెదురు మాలిక్యుల్ స్ట్రక్చర్ నిర్మాణం దగ్గరగా, గట్టిగా ఉంటుంది. https://youtu.be/XSuZ6ukuz5s వెదురు ని, పేపర్, బట్టలు, మెడికల్, డిఓడరెంట్, ఆహారం, నిర్మాణ రంగాల్లో వినియోగిస్తున్నారు. సుమారుగా 490 రకాల వెదురు జాతులు ఉన్నాయి. మూడేళ్ళ నుండిContinue reading “Bamboo is New Steel”
15 కంపార్ట్మెంటలైజేషన్
“ఏ ఊరు?” వెంకట్రావు గారు పలకరిస్తూ కూర్చోమన్నట్టు సైగ చేశారు.నేను నా బాగ్లు రెండు ఒక వైపు ఉంచి, “ఒంగోలు సార్. అంటే ఒంగోలుకి దగ్గర. నాన్నగారు టీచరు. నేను అక్కా ఇద్దరం పిల్లలం, అమ్మ మిషను కుడుతుంది. నాన్న రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నారు. రీసెంట్ గా డిప్లొమో చేశాను 83% తో ..” వీలయినంత వివరంగా చెప్పాను. ఆయన తక్కువగా అయినా మనసుతో మాట్లాడటం గమనించాను.మనలో చాలా మందిమి రెండు రకాల సంభాషణలు చేస్తూ ఉంటాం. మాటలContinue reading “15 కంపార్ట్మెంటలైజేషన్”
14. నాను బెంగుళూరు బందిదిని
సరిగ్గామధ్యాహ్నంభోజనం టైమ్కి బెంగుళూరు చేరింది బృందావన్ ఎక్స్ ప్రెస్. మరో అరగంట తర్వాత తిరిగి మద్రాస్ వెళ్లిపోతుంది. బెంగుళూరు రైల్వే స్టేషన్ , బస్ స్టాండ్ దగ్గరదగ్గరగా ఉంటాయి. ఒక ఫ్లై ఓవర్ మీదుగా ఈజీగా స్టేషన్ నుండి బస్ స్టాండ్ కి రావచ్చు. మొత్తం ఆ ఏరియాని ‘ మెజెస్టిక్ ‘ అంటారుట. ముందు రోజు గూడ్స్ లో బుక్ చేసిన ఇండ్ సుజికి బండికోసం పార్సిల్ ఆఫీసుకి వెళ్ళాం. ఎల్‌ఆర్ కాగితాలు చూపించి పార్సిల్ ఆఫీస్ నుండి దాన్ని హాండ్ఓవర్ చేసుకున్నాం. పాకింగ్Continue reading “14. నాను బెంగుళూరు బందిదిని”
13 హిందూ పేపర్
ఆవడి వర్క్ ఆగిపోవటంతో అక్కడ మినిమమ్ స్టాఫ్ని ఉంచి మిగిలిన అందరినీ బెంగళూరు వర్కుల వద్దకి పంపే పనిలో ఉన్నప్పుడు, నేను మాబాస్ ని కలిసి నాలుగు రోజుల సెలవు అడిగాను. నాన్న వదిలి వెళ్ళాక గడిచిన మూడు నెలల్లో నేను ఇంటికి పోలేదు. పైగా పనుల వత్తిడి కూడా అంతగా లేక పోవటం తో ఆయన వెంటనే ఒప్పుకున్నాడు. “వెళ్ళి వెంటనే వచ్చేయి. బెంగుళూరు పంపుతాను.” అన్నారు. ఆ శనివారం మద్రాస్ సెంట్రల్ నుండి రాత్రిContinue reading “13 హిందూ పేపర్”
12 బీదగా చావటం తప్పు
అపర్ణ అక్క రిసెప్షన్ చూడటానికి రెండుకళ్ళూ చాలవు. ఇంత పెద్ద పార్కింగ్ ఏమి చేసుకుంటారో ఆని ముందురోజు అనుకున్న స్థలం కార్ల పార్కింగ్ కి చాలక రోడ్డు వారగా కొన్ని వాహనాలు ఆపాల్సి వచ్చింది. మద్రాస్ నగరం లోని పేరున్న పెద్ద కాంట్రాక్టర్స్ అందరూ అటెండ్ అయి ఉంటారు. మా బాస్ కాంట్రాక్టర్స్ కమ్యూనిటీ కి ప్రెసిడెంట్ గా కూడా ఉండటం వల్ల అతిదులతో వేదిక నిండి పోయింది. ఆ సాయంత్రం తమిళనాడులా అనిపించలేదు. తెలుగు వాళ్ళతోContinue reading “12 బీదగా చావటం తప్పు”
11. రెండు కాళ్ళ ఎలుక
మా ఆఫీస్ ఎకౌంటెంట్ నారాయణ రావు గారు, ఆరోజు మద్యాహ్నం అవుతున్నా ఇంకా రాలేదు. మా బాస్ ఆఫీసులో కూర్చుని ఉన్నారు. గారిజన్ ఇంజనీరు, MES Works, వారికి కొంత కరెస్పాండెన్స్ చేయాల్సి ఉంది. అప్పటికే రెండు మూడు సార్లు మా ఇద్దరినీ అడిగి ఉన్నాడు. టెన్త్ ఇంటర్ మద్య కాలం లో చాలామంది మాతరం వారి లాగే నేను కూడా ఇంగ్లీష్ టైపింగ్, కొన్ని క్లాసుల షార్ట్ హాండ్ నేర్చుకుని ఉన్నాను. మా బాస్ నన్ను పిలిచి ‘యు నో టైపింగ్’ అని అడిగారు.Continue reading “11. రెండు కాళ్ళ ఎలుక”
రబ్బరు తీగ !!
Ipomoea nil/ రబ్బరు తీగ అనే మొక్కని మీరు చూసి ఉంటారు. చెరువులు చుట్టూ, మడుగుల ఒడ్డున ఇది ఏపుగా పెరుగుతుంది. దీన్ని వాడుక బాష లో రబ్బరు మొక్క లేదా రబ్బరు తీగ అంటారు. సిరా బులుగు పూలతో అందంగా ఉంటుంది. విపరీతంగా పెరుగుతుంది. గ్రామీణ ప్రాంతాలలో వీటితో చుట్టిల్లు నిర్మాణం చేస్తారు. కప్పుగా ఏదయినా గడ్డిని కప్పుతారు. మరికొందరు ఈ రబ్బరు తీగ గోడలకి, కల్వం లో తొక్కిన మట్టి తో రెండువైపులా మెత్తిContinue reading “రబ్బరు తీగ !!”
10 డిజిటల్ వాచ్
అతనటు వెళ్లాడో లేదో నాకొ ఆలోచన వచ్చింది. ఆ రాత్రి తన్నులు తిని పోగొట్టుకున్న HMT వాచీ గుర్తుకు వచ్చింది. నాన్నఎంతో ప్రేమగా కొనిఇచ్చినది. దాని బదులుగా ఎలెక్ట్రానిక్ డిజిటల్ వాచ్ కొనుక్కోవాలని. మొదట్లో ఆరేడు వందలు ఉండే డిస్ప్లే వాచ్ లు, క్రమీణా అందుబాటు ధరలోకి వచ్చాయి. వంద రూపాయలు లోపే మంచి వాచీ అమ్మటం గమనించాను.బర్మా బజారు పొడవంతా కాళ్లతో, కళ్ళతో కొలిచాను. ఆ వైపు నుండి ఈ వైపు కి తిరిగాను.అక్కడక్కడా షాపుల వద్ద రేటు అడిగాను.Continue reading “10 డిజిటల్ వాచ్”
9. బర్మా బజార్ (ప్యారిస్)
నడి నెత్తికి ఎండ వచ్చే సరికి వినోద్ వచ్చాడు. వచ్చీ రాగానే ‘ఎంత సేపయింది వచ్చి?’ అని అడిగాడు. అతను గుర్తుపట్టినందుకు సంతోషం వేసింది. ఏదయినా ఒక ఆదివారం రోజు కలుస్తాను అని ఒంగోలు లో కలిసినప్పుడు చెప్పాను … “సారి అనుకోకుండా లేటయింది. ఇక్కడ లేటు అనే మాటే తప్పు. టైమ్ ప్రకారం ఇక్కడ అవసరాలు నడవవు. వీలు కుదిరినప్పుడు అవసరాలు తీర్చుకుంటూ ఉండాలి. పైగా నువ్వు వచ్చే విషయం నాకు తెలియదు. వచ్చేవారం షూటింగు షెడ్యూల్ చూసుకుని వస్తున్నాను.”Continue reading “9. బర్మా బజార్ (ప్యారిస్)”
