నామకరణ

శాస్త్రి గారూ బాగున్నారా?

శ్రీనివాస్ గారా .. బాగున్నాను.

ఫోన్ లిఫ్ట్ చేస్తే ఏం అశుభం వినాల్సివస్తుందో, అనాల్సివస్తుందో అనే భయం. మిమ్మల్ని ఒకసారి కలవాలి.

“ఏంటి విశేషం?”

“పిల్లలకి పేరు పెట్టాలి.”

“ఆహా మీ పని భేషుగ్గా ఉంది. మనవళ్లు, మనవరాళ్ళు తో మంచి కాలక్షేపం.”

“మరే.. సాయంత్రం రమ్మన్నారా?”

“రావటాలు ఏమీ పెట్టుకోకు. అంతా ఆన్లైన్ లోనే. మొన్న మా ఇంటావిడకి చెవి పోటు వస్తే డాక్టర్కి ఫోన్ చేశాం. ఒక app చెప్పాడు. QURAL దాన్ని ఇంస్టాల్ చేసుకుని కావల్సిన డాక్టర్ కి అపాయింట్మెంట్ తీసుకుని వీడియో కాల్ లో వైద్యం చేయించుకున్నాం. అలాగే ఇదీను.”

“మీరు ఏదయినా app లాంచ్ చేశారా?”

“ఇంకా లేదు నాయనా. అదీ వస్తుంది ఎంతో దూరం లో లేదు.”

“అందాకా ఎలా?”

“పిల్లల ఫోటో పంపి. డేట్/టైమ్ వివరాలు, whats app లో పంపితే. రాశి నక్షత్ర భలాలు చూసి దివ్యమయిన పేర్లు కొన్ని పంపుతాను. ఈ నెంబరు కి గూగుల్ పే, ఫోన్ పే లు ఉన్నాయి. వాటి సంగతి అటూ చూసుకుంటావుగా?”

“అలాగే శాస్త్రి గారు. పిల్లల ఫోటో పంపుతున్నాను. డేట్/టైమ్ మా శ్రీమతి తో మాట్లాడి పంపుతాను.”

Published by Sreenivasarao Sunkara

Civil Engineer, Writer, and now a Grand father

Leave a comment

Design a site like this with WordPress.com
Get started