Mr X భాను ప్రకాష్

అయిదేళ్ళ వయసులో X అనే పిల్లాడికి ఒక పెద్ద ప్రమాదం ఎదురయ్యింది. తలకి బలమైన గాయం. అనేక సర్జరీలు అవసరం అయ్యాయి. ఆ గాయాల నుండి కోలుకుంటూనే అతను అబాకస్ మీద, ఫజిల్స్ మీద ఇంట్రెస్ట్ పెంచుకున్నాడు. చిన్న వయసులోనే SPI  అకాడమీ లో అబాకస్ లో నమోదు చేసుకుని  9th లెవెల్  విన్నర్ అయ్యాడు. ఇంటెర్నేషనల్ అబాకస్ అకాడమీ లో మూడు సార్లు విన్నర్ అయి లిమ్కా రికార్డు లు సాధించాడు. అప్పటి నుండి లెక్కల్లో అనేక వేదికల మీద ప్రతిభ కనబరిచాడు.  

St. Stephen’s College, డిల్లీ నుండి Maths లో డిగ్రీ చేశాడు. ప్రస్తుతం 50 పైగా లిమ్కా రికార్డులు స్వంతం చేసుకున్నాడు. కేలుక్యులేటర్ కంటే వేగంగా లెక్కించడం అతనికి మామూలు విషయం. లండన్ లో ఈ నెల 15 న జరిగిన MSO మైండ్ స్పొర్ట్స్ ఒలెంపియాడ్ లో పాల్గొని భారతదేశానికి మెంటల్ కలుక్యులేషన్స్ లో మొట్ట మొదటి బంగారు పతకాన్ని సాధించాడు. కోవిడ్ కారణం గా virtual గా జరిగిన ఈ అంతర్జాతీయ పోటీలో 13-50 మద్య వయస్కులు 30 మందికి పైగా పాల్గొన్నారు. తన సమీప లెబనాన్ ప్రత్యర్ధి కంటే రికార్డ్ స్థాయి లో 65 పాయింట్స్ ఎక్కువ పాయింట్స్ సంపాదించి ఈయన ఈ స్వర్ణాన్ని అందుకున్నారు. 1998 నుండి MSO ఈ పోటీలు నిర్వహిస్తూ ఉంది.

ఈ స్వర్ణం సాధించడం ద్వారా అతను పాత రికార్డ్ లు అధిగమించాడు. వాటిలో ప్రముఖులయిన Scott Flansburg మరియు హ్యూమన్ కంప్యూటర్ Shakuntala Devi కూడా ఉన్నారు. (Shakuntala Devi set the record of the Fastest Human Computation by multiplying two randomly selected 13-digit numbers in just 28 seconds, at Imperial College London on June 18, 1980.) మొత్తం 50 లిమ్కా రికార్ద్లు, నాలుగు గిన్నీస్ బుక్ రికార్డ్ లు ఇతన్ని అలరించాయి.

Maths ని ఒక కళ గా గుర్తించాలని, మనం ఒక సైన్స్ గా మాత్రమే గుర్తిస్తున్నామని, ఇది ఒక కళాత్మకమయిన స్పోర్ట్ గా గుర్తించాలనేది ఈయన వాదన.

ఆయన మాటల్లో “child is an art. But he develops a fear of Maths because we have tested him too often on trusts we don’t mean anything to them.  Playing with nos is always fun. I wanted to bring back India its past glory to mathematics. India has some of the finest brains and faculty. “  భావి తరాల మీద బోలెడు నమ్మకం ప్రదర్శిస్తాడు. ప్రపంచం లో భారతీయుల ప్రతిభ కి హద్దులు లేవనేది ఇతని నమ్మకం.

ఇంతా చేసి ఈ Mr X అచ్చతెలుగు బిడ్డ. వయసు 21. పేరు నీలకంట భాను ప్రకాష్. హైదరాబాదు నివాసి.

అతను నెల కొల్పిన Exploring Infinites EI అనే ఆర్గనైజేషన్, తెలంగాణా ప్రభుత్వ స్కూల్ విద్యార్ధుల ప్రతిభా పాటవాలు మెరుగు పరచడానికి కృషి చేస్తూ ఉంది. 6 నుండి 10 తరగతులు చదివే పిల్లలకి సుమారు 700 గంటల పాఠాలు సిద్దం చేసింది.  

బి‌బి‌సి కదనం కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి.

Published by Sreenivasarao Sunkara

Civil Engineer, Writer, and now a Grand father

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create your website with WordPress.com
Get started
%d bloggers like this: