భార్య కి పాడయిపోయిన స్మార్ట్ ఫోన్ బదులు మరో ఫోన్ కొనిపించడం మర్చిపోయిన శ్యాం కి ఇంట్లో శనివారం పొద్దుటే టిఫిన్ పెట్టలేదు. ATM సాఫ్ట్ వేర్ మైంటనెన్స్ చేసే శ్యాం కి ఆ పూటకి వీధి చివర్లో ఉన్న మిత్రుడి హోటల్ కి వెళ్ళాడు. కాషియర్ సీట్లో నుంచి లేచి వచ్చిన మిత్రుడు, పలకరింపుగా నవ్వి “ఏం కావాలి?” అని అడిగాడు, గ్లాసులోకి నీళ్ళు వంచుతూ..
“ఏమున్నాయి?”
“ఇడ్లీ, వడ, దోసె, పూరీ, పెసర, మసాలా దోశె “
“మసాలా దోశె చెప్పండి”
“లేదు”
“పెసర?”
“లేదు”
“మరి ఏమి ఉంది?”
“ఏమీలేదు”
“ఏమి లేవని మొదట్లోనే చెప్పొచ్చుగా?” శ్యాం చిరాకు పడ్డాడు.
“మీ ATM సంగతేమిటి.? కార్డు సరిగా ఇన్సర్ట్ చెయ్యమంటుంది!, 1 నుండి 15 లోపు అంకె నొక్క మంటుంది.1 PIN నెంబరు అడుగుతుంది. మొదట్లో ఏం భాష కావాలి అంటుంది!, బ్యాంకింగ్, కాష్ విత్ డ్రాయల్ అని అడుగుతుంది!. ఎంత కావాలి అంటుంది!, రశీదు కావాలా వద్దా!! అంటుంది. తీరా చివర్లో “ నో సఫిషియంట్ బాలన్స్!!!” అంటుంది. ! మరి మాకు మండదా ???”