సాయంత్రం అయిదున్నరకి నా పని పూర్తి అయ్యేది. బాస్ అద్దాల కేబిన్ కి మా ఆఫీసు రూమ్ కి తాళం వేసి ఆయమ్మ కి ఇచ్చి బజారున పడేవాడిని. ఎనిమిదిగంటల దాకా మద్రాసు మొత్తం స్వయంగా నాదే …ముఖ్యంగా పాండి బజార్, పానగల్ పార్కు, మెరీనా బీచ్.. నడుచుకుంటూ ఎంతో దూరం తిరుగుతుండేవాడిని,పాండి బజార్ లో సినీ నటుడు నాగేశ్ (హాస్యనటులు) గారి థియేటర్ ఉండేది. అక్కడ తరచూ చిడతల అప్పారావు, పొట్టి ప్రసాదు, టీవి నటుడు బాలాజీ లాటిContinue reading “3. కంపెనీ వి మూడు, నావి ఎనిమిది”
Category Archives: 33 grade
2. ఎంత బాగుందో
నెలకి 400 రూపాయల జీతం. ఉండటానికి జబర్దస్త్ ఏకామిడేషన్.ఆ కేక …శీను గాడు/రోశయ్య పంతులు కొడుకు మద్రాస్ లో ఉద్యోగం అని ఊర్లో పేరు.నా సామిరంగా జీవితం ప్రారంభం అయింది. 9 ఫిబ్రవరి 1986 నుండి. నాతో పాటు అక్కడ మరో స్టార్టర్ పని చేస్తుండేవాడు. పేరు గుర్తులేదు. అతను ఇంజనీరింగ్ డిగ్రీ చదివాడు. పని మీద కంటే తన 500 రూపాయల జీతం గురించి ఎక్కువ మాట్లాడేవాడు. డిఆర్‌డిఓ (Defence Reacher and Development Organization)Continue reading “2. ఎంత బాగుందో”
1. మొదలు
జీవితం ప్రారంభం అనేది సాధారణం గా మొదలవుతుంది. కొంతమంది అదృష్టవంతులకి మార్గదర్శకులు ఉంటారు. వివిధ వ్యక్తుల కారణం గా అనేక మంచి మార్గాలు తారసపడుతుంటాయి. కొందరు అందిపుచ్చుకుని ఎదుగుతారు. చాలామంది వాటిని నిర్లక్షం చేస్తారు. మరి కొందరు ప్రవాహానికి ఎదురు ఈదుతారు. నా జీవితం ఏమిటి అనేది నాకే తెలీదు. చదువు పూర్తి అయ్యాక ఒక సంవత్సరకాలం చాలా విలువయినది అని, తరవాత కాలం లో కాని నాకు తెలిసి రాలేదు. నా జీవితం లో అత్యంతContinue reading “1. మొదలు”
Protected: 33_Grade
There is no excerpt because this is a protected post.
