కుటుంబం, సమాజం మనన్ని అనుక్షణం నియంత్రిస్తుంటాయి.మానవ సంభందాలు కూడా అదుపు చేస్తూ ఉంటాయి.మనస్పూర్తిగా మాట్లాడటానికి, నిష్కపటం గా ఉండటానికి ఏదీ మనన్ని అనుమతించదు.మన సంతోషాన్ని అదుపు చేసుకోవాలి. మన బాధలని హద్దులో ఉంచుకోవాలి. నవ్వును మనుషులని బట్టి అనుమతించాలి. కొందరి వద్దే మనసు విప్పాలి. ప్రయోజనాల పరంపర లో మనుష్యులు నిజమయిన స్వేచ్చని, స్వతంత్రాన్ని ఎప్పుడో కోల్పోయారు.మనం అదుపు చేసినవి, అణిచి పెట్టినవి ఎక్కడికీ పోవు. అవి మనసు పొరల్లో ఉండి పోతాయి. మన లోనే ఉంటాయి.Continue reading “ఏది నిజం?!?”
Author Archives: Sreenivasarao Sunkara
ఎవరికి చెప్పుకోవాలి?
సాగర్, సవీంద్ర హైదరాబాదు ‘బుక్ ఫెస్టివల్’ లో తోపుడుబండి stall వద్ద సాయం కోసం వెళ్ళారు.మూడో రోజు ఉంటున్న లాడ్జి కి వస్తూ ఉంటె.. ఒకావిడ వీది మలుపులో మిద్దె మీద నుంచుని చిన్నగా చెయ్యి ఊపి చిరునవ్వు నవ్వింది.సవీంద్ర హటాత్తుగా ఆగాడు.“అన్నా … నువ్వు వెళ్ళు అన్నా.. నాకు అర్జెంట్ పని ఉంది మా చిన్నాయన అపోలో లో ఉన్నాడు ఒక తూరి చూసోస్తాను. వీలయితే రాత్రికి వస్తాను. లేటయితే పొద్దుటే వస్తాను. “ అన్నాడు.కళాContinue reading “ఎవరికి చెప్పుకోవాలి?”
కార్డు మీద ఫోటో
నాలుగో రౌండ్ గ్లాసు దించిన తర్వాత అతను గంభీరం గా అయిపోయాడు. మాటలు లేకుండా ఎటో చూస్తూ సాలోచనగా తల ఉపాడు. “రావు గారి కి సరిపోయినట్లుంది” సాగర్ అన్నాడు. రావు ఏమి మాట్లాడలేదు.“సాగర్ గారూ.. మీకో విషయం చెప్పాలి”ఏమిటన్నట్లు చూశాడు సాగర్.“నేను చనిపోయి ఈ రోజు కి నిండా పది.”సాగర్ చేతిలో గ్లాసు ఆగిపోయింది. కుర్చీ లో వెనక్కి కూర్చుని జోగుతున్న బాగీ అంత మత్తులోను చురుగ్గా చూశాడు.“రావు గారికి ఎక్కువయింది” మాటలు కూడా దీసుకుంటూ అనుమానంగా సాగర్రావు గారిContinue reading “కార్డు మీద ఫోటో”
సంక్రాంతి శుభాకాంక్షలు
అప్పుడు:‘బండి మీద ప్రయాణం తగ్గించండి’ అని వైద్యులు చెప్పినప్పుడు కారుకి మారాడు.ఉంటున్న ఇంట్లో కొళాయిలు లు వాస్తు ప్రకారం లేవని, ఖాళీ స్తలం లో ‘వాస్తు హోమం’ చేయించి మరీ ఇల్లు కట్టించాడు.ఇన్సూరెన్స్ ఏజంటుగా అన్నీ ఎత్తులు చూశాడు.యడాదికి లక్షల్లో కమిషన్ తీసుకున్నాడు.**పరిచయాలని వాడుకున్నాడు. చేతులు నోప్పెట్టేదాకా నోట్లు వ్రాసి ఇచ్చాడు.అమరావతి లో స్థలం కొన్నాడు. పావలా ఇచ్చి అగ్రిమెంట్ అయ్యాడు.ఆశించినంత హైక్ రాలేదు. రిజిస్ట్రేషన్ చేసుకోవలసి వచ్చింది.ఇల్లు అమ్మాడు. కారు అమ్మాడు. అందిన డబ్బు అందినట్టు మద్యవర్తిContinue reading “సంక్రాంతి శుభాకాంక్షలు”
శారదా దేవి.
రామకృష్ణ పరమహంస శరీరం విడిచారు.ఆయన బార్య అనేక సంవత్సరాలు గా వస్తున్న ఆనవాయితిని వ్యతిరేకించింది.శిరోముండనం చేయించుకోలేదు. శ్వేతవస్త్రం ధరించలేదు. కంట నీరు కార్చలేదు.ఆయన శరీరాన్ని శ్మశానం కి తీసుకెళ్ళాక, రోజు మాదిరిగానే ఆయనకి వంట చేసింది.ఎప్పటి లాగే ఆయన కూర్చుని బోజనం చేసే బల్ల పక్క కూర్చుని విసనకర్రతో గాలి విసురుతు బోజనం వడ్డించింది.సాయంత్రానికి పడక ఏర్పాటు చేసింది. చుట్టూ తెరలు కట్టింది. అంతా యధావిది గా ఉంది.ఆమెకి పిచ్చి పట్టినట్లు శిష్యులు నిర్ధారణ చేసుకున్నారు.“ఆయన చనిపోలేదు.Continue reading “శారదా దేవి.”
షార్క్ చేప
తాజా చేపలు అంటే జపనీయులకి చాలా మక్కువ.తీర ప్రాంతాల లో చేపలు సంవృద్ధిగా దొరకటం తగ్గిపోయింది.పెద్ద పెద్ద బోట్లు వేసుకుని సముద్రం లోపలికి వెళ్ళి రోజుల తరబడి వలలు వేసి తీసుకురావాల్సి న పరిస్తితి.కానీ ఇక్కడో చిక్కు వచ్చి పడింది. చేపలు తాజా గా ఉండటం లేదు.రెండు మూడు రోజులు సముద్రం లో వేట పూర్తిచేసుకుని బోట్లు ఒడ్డుకి కి చేరి మార్కెట్ కి వెళ్ళే సరికి….ఫిషింగ్ కంపెనీ లు బోట్లులో డీజిల్ జెనరేటర్ తో పనిచేసేContinue reading “షార్క్ చేప”
బండరాయి
రహదారి మార్గం లో ఒక పెద్ద బండరాయిని అడ్డుగా వేయించి చాటుగా గమనించసాగాడు రాజు గారు.“ఏం రాజు? ఏం పరిపాలనా? శిస్తులకే గాని ప్రజల పనులు పట్టించుకొని రాజ్యం లో ఉన్నాం మనం. ఖర్మ” అంటూ ఈసడించుకున్నారు ఆ మార్గాన పోతున్న వారు కొందరు.అదికారులు ఆ బండరాయిని చూసి హుంకరించారు. “ఎవరు ఈ పని చేసింది. కనుక్కుని కారాగారం లో ఉంచండి” హుకుం లు జారీ చేశారు.రాజు గారు వింతగా చూస్తున్నారు. కొద్దిగా శ్రమ పడి బాద్యతContinue reading “బండరాయి”
గార్గి
అయిదువేల సంవత్సరాల క్రితం, ఉపనిషత్తుల కాలం లో ‘గార్గి’ అనే ఒక మహిళ ఉండేది.స్త్రీ ల పట్ల ఇంత వివక్ష ఉండేది కాదు. తాత్వికుదయిన రాజు ప్రతి సంవత్సరం వివేకవంతులయిన పండితులని పిలిపించి పోటీ పెట్టేవాడు. గొప్ప జ్ణానులు మాత్రమే పోటీలకి హాజరయ్యే వారు. వాళ్ళలో కపటం అనేది ఉండేది కాదు.ఒక సంవత్సరం రాజు వేయి ఆవుల బహుమతి ప్రకటించాడు. ఆవుల కొమ్ములకు రత్నాలు తాపడం చేసిన బంగారు తొడుగులు ఉంటాయని చెప్పాడు.ఆ రోజుల్లో యజ్నవాల్యుడు సుప్రసిద్దుడు. విజయం పట్ల అనుమాత్రం కూడాContinue reading “గార్గి”
విశ్రాంతి.
మనుషులు అంతులేని శ్రమ లో మునిగి ఉండటమే కాదు. విశ్రాంతి పొందే సమయము ఉంటుంది.అనంత ఆహ్లాదాన్ని అందుకునే ఘడియలు ఉంటాయి. మనుషులు మరీ గంభీరం గా ఉండకూడదు.అది కూడా అనారోగ్య లక్షణమే.నవ్వుతూ ఉండటం అనేది జీవ లక్షణం. విశ్రాంతి సమయం లో పద్దతులు, ప్రణాళికలు ఉండవు. విరామమే విస్తరించి వుంటుంది.ఒక గొప్ప జెన్ గురువు ఉండేవాడు.ఆయనకు దేశం లో ఎంతో గొప్ప పేరు ఉండేది.చైనా దేశ చక్రవర్తి కూడా ఆయన పట్ల భక్తి ప్రవత్తులు ప్రదర్శించే వాడు.ఒకసారి చక్రవర్తిContinue reading “విశ్రాంతి.”
పరిగెత్తిన ముసలావిడ
మహారాష్ట్ర బుల్ఢానా జిల్లా లో ని ఒక చిన్న కు గ్రామం లో ఉండే 65 ఏళ్ల లతమ్మ (లతా భగవాన్ ఖరే) తన భర్త, ముగ్గురు ఆడపిల్లలతో జీవిస్తూ ఉండేది.ఆదంపతులు ముగ్గురి ఆడపిల్లకి పెళ్లిళ్లు చేశారు. ఏళ్ల తరబడి పొదుపు చేసుకున్న డబ్బు హరించుకు పోయింది. అందినంతవరకు చేసిన అప్పులు మిగిలాయి.కాయ కష్టం చేసి ఋణ విముక్తులు కావటానికి శ్రమిస్తున్న ఆ జంటకి అనుకోకుండా ఒక విపత్తు వచ్చి పడింది.దాని పేరు “అనారోగ్యం”ఒకరోజు నలతగా ఉందని చెప్పాడు.స్థానికంగా అందుబాటు లో ఉన్న మెడికల్Continue reading “పరిగెత్తిన ముసలావిడ”
