నాన్నా తప్పు చేశాను

ఒక పలచటి చక్కముక్క మీద మూడు సన్నని సీలలు త్రిబుజాకారం లో దిగ్గోట్టి, రెండిటికి సిల్క్ వైరు ముక్కలు కలిపి టార్చి లైట్ లో త్రెడ్స్ ఉన్న బల్బు తీసుకుని రెండు సీలల మద్య తిప్పి హోల్డర్ లాగా చేయటం, సైకిల్ ట్యూబ్ లోకి బాటరీలు ఎక్కించి వాటిని కూడా రెండు రెండు అంగుళాల సీలల మద్య జాగర్తగా కూర్చో పెట్టి రెండువైపులా చీలలకి సిల్క్ వైరు చుట్టి వాటిని బెండ కాయ స్విచ్ లకి బిగించిContinue reading “నాన్నా తప్పు చేశాను”

దేవుడి పటం

ఊరికి దూరంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం లో ఉన్నదా ఇల్లు. వరండా తో కలిసి నాలుగు గదుల నిలువు ఇల్లు.చుట్టూ ప్రహరి గోడ ఉన్న స్తలం లో గోడ వారగా కూరగాయల మొక్కలు, పూల మొక్కలు ఉన్నట్లు మసక వెలుగులో కనిపిస్తూ ఉంది. గేటు నుండి ఇంటి వరండా వరకు నాపరాళ్ళు పరిచి ఉన్నాయి. నాపరాళ్ళ మద్య మెత్తటి గడ్డి.ఎక్కడయినా ఒక్క వీది లైటు వెలుగుతూ ఉంది. ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందని ప్రాంతం. అప్పుడప్పుడూ వచ్చిContinue reading “దేవుడి పటం”

మనెమ్మ ఇక రాదు.

ఉదయం పూట .. అదీ వర్కింగ్ డే ఏ ఇల్లాలికయినా కురుక్షేత్రమే..కాలింగ్ బెల్ మోగింది. పొయ్యిమీద కుక్కర్ ఉంచి హల్లో కి వచ్చి తలుపు తీసింది మీనాక్షీ. బయట ఒక వ్యక్తి ఉన్నాడు ఆటో వాలా అని తెలుస్తుంది. ఖాకీ షర్ట్ వేసుకుని ఉన్నాడు. “ఏమిటి?” అడిగింది విసుగ్గా. “మీ పనావిడ మనెమ్మ మా ఆవిడ” మీనాక్షీ కి కోపం నషాలానికి అంటింది.మూడు రోజుల నుండి చెప్పా పెట్టకుండా పని లోకి రావటం మానేసింది. ఒక ఫోన్Continue reading “మనెమ్మ ఇక రాదు.”

మతిమరుపుకి మరో పేరు

తెలుసండీ తెలుసు.. గతం తో ఆమెని కోప్పడి తిట్టిన సంఘటనలు తేదీలతో సహా చెప్పగలను. డైరీ వ్రాసే అలవాటు ఉంది. వాటిని చూడక పోయినా సరిగ్గా చెప్పగలను అంత జ్ఞాపక శక్తి ఉంది నాకు. అయితే మాత్రం మా ముసల్దానికి మతిమరుపు ఎక్కువవుతుంది. ఎప్పుడో రెండు గంటల క్రితం రోడ్డు పక్క దాబా హోటల్ లో తిన్నాం. అక్కడ మర్చిపోయిందట కళ్ళజోడు. దాదాపు డెబ్బై కిలోమీటర్లు ప్రయాణం చేశాక ఇప్పుడు తీరిగ్గా చెబుతుంది. “కళ్ళజోడు బోజనం చేసినContinue reading “మతిమరుపుకి మరో పేరు”

గృహ వాస్తు.

నమ్మం గాని ఆడవాళ్ళ ధారణ శక్తి అమోఘం అండి. నిన్న ఆఫీసు నుండి ఫోన్ చేసి “టాబ్ ఎక్కడ వుందో చూడు దానితో పని పడింది.” అని చెప్పాను. కావల్సిన వస్తువు కాకుండా మిగిలినవన్నీ దొరకటం మధ్య తరగతి ఇళ్ళలో సంప్రదాయ విధానం.సహజం గానే టాబ్ కనిపించలేదు గాని ‘ఏదో గృహ వాస్తు పుస్తకం కనిపించిందట. పుస్తకాల రేక్ లో ‘సాయంత్రం ఇంటికి వచ్చాక “ఈ పుస్తకం చదువుతున్నాను” అని చూపించింది. “హల్లో సోఫా నడవా కిContinue reading “గృహ వాస్తు.”

నలుపు.

“రిటైర్ అయ్యాక మీ నాన్న గారి చాదస్తం మరీ ఎక్కువయింది అంది జయలక్ష్మి కూతురితో వంటగదిలో నిలబడి, చట్నీ తాలింపు వేసిన చిన్న బాండి లో రెండు ఇడ్లీ అద్దుకు తినేస్తూ… “కాఫీ కాస్త వేడిచేసి నాన్నగారికి ఇవ్వు .. వచ్చేస్తున్నానని చెప్పు” అంది కూతురితోరాజు గారు కాఫీ తాగేసరికి ముడేసుకున్న జుట్టు అర్జంటుగా దువ్వేసి, క్లిప్ తగిలించుకుని, ముందుగా సర్ది ఉంచుకున్న హాండ్ బాగ్ అందుకుని, “నేను రెడీ” అంది హల్లో కి నడుస్తూ…రాజు గారిContinue reading “నలుపు.”

సన్మానం

వీది మలుపు తిరిగి ఇంటి వైపు వెళ్తుంటే.. మా వీదిలో మగాళ్ల గుంపు నా బండి ఆపేశారు. “ ఇంజనీర్ సార్ మీకో ఒక విషయం చెప్పాలి, ఆగండి” ఉపోద్ఘాతం గా మొదలెట్టారు. “ఇంటికెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను. ““అంత టైమ్ లేదు. అర్జెంట్ అయితే ఆ రోడ్డు పక్కకి వెళ్ళండి” ఒకాయన చెప్పాడు. అప్పటికే నానా విధాల పరిమళాలు నిలబడ్డ నలుగురి దగ్గర ఘుమాయిస్తున్నాయి. “కాసిని ఉడుకు నీళ్లయినా తాగి వస్తాను. “ “రేయ్ సారుకి మంచి టీ పట్టుకురా పో”Continue reading “సన్మానం”

విశ్వాసం.

జనవరి నెల 2015 గొంగోలి గ్రామం, ఉత్తర ప్రదేశ్.ఒక అనామక మహిళ ఆగ్రామం లో సంచరించడం, గ్రామస్తుల కంట పడింది. చాలా దయనీయమయిన పరిస్థితి లో ఉందావిడ. సరయిన తిండీ, బట్టా లేకుండా పిచ్చిదానిలా నీరసంగా ఉంది. ఏ వీది అరుగు మీదో చతికిల పడి ఎవరయినా ఏదయినా ఇస్తే తినటం మినహాయించి మరేమీ తెలియని స్థితి లో ఉంది. మనస్థిమితం కుడా సరిగా లేదు. ఆ గ్రామస్తులు ఆమెను ఒక చోట కూర్చోబెట్టి వివరాలు సేకరించేContinue reading “విశ్వాసం.”

తాళం

బాగా రద్దీగా ఉండే ప్రాంతం లో ఉన్న ఇరుకయిన దారులతో ఉన్న చిన్న చిన్న షాపుల సముదాయం.చెన్నై లో పారిస్ సెంటర్ ని గుర్తుకు తెస్తూ..ఒక్క దుకాణం లో ఒక్కో రకం వస్తువులు.కమర్షియల్ టాక్స్ ఆఫీసు లో పనిచేసే మాధవరావు ఆఫీసుకి కొత్తగా లీజు కి తీసుకున్న గోదాముకి  తాళాలు కొనటానికి వెళ్ళాడు. ఇస్మాయిల్ షాపు ఫేమస్ అని విని, ఫిక్షెడ్ రేట్లు కి   మన్నికయిన వస్తువులు దొరుకుతాయి అని వెతుక్కుంటూ వచ్చాడు.ఆఫీసుకి అవసరం అయినవి కొనిContinue reading “తాళం”

వేటూరి

1982-1986 మద్య కాలం లో ఒంగోలు డి‌ఏ గవర్నమెంటు పాలిటెక్నిక్ లో సివిల్ ఇంజనీరింగ్ చదివాను.క్లాసులో అల్లరి లో నెంబర్ టూ స్థానం కోసం :p కొంతమంది పోటీ పడుతుండేవాళ్లు.ఒక లెక్చర్ ఉండేవాడు. చెప్పేది తక్కువ. స్వత్కోర్ష ఎక్కువ. అప్పట్లో నేను…. అక్కడ పని చేసే రోజుల్లో …. అంటూ పీరియడ్ లో ఎక్కువ బాగం సోది చెప్పేవాడు.మనం ఇంటివద్ద చదవం కాబట్టి క్లాసులో శ్రద్ధగా వినేవాడిని. అల్లరి మామూలే ..ఒక రోజు ఆయన వచ్చే సరికి బోర్డు మీద “__________________”Continue reading “వేటూరి”

Design a site like this with WordPress.com
Get started