ఒక తాత గారు మనమడి తో కలిసి తన పాత కార్లో ఒక జింక పిల్లని కుడా తీసుకెళ్తున్నాడు. మనమడు, జింక పిల్ల… వెనక సీట్లో ఆడుకుంటున్నారు.దారిలో ట్రాఫిక్ పోలిస్ లు కారుని ఆపేశారు. “జింక పిల్ల ఎక్కడిది?” “ఏమో .. ఉదయం మా కాలనీ వెనక నున్న సరుగుడు తోట లో బుడి బుడి నడకలతో కనిపించింది. మా మనమడు చూసాడు. తెచ్చి పాల పీక సీసాతో పాలు తాపాము. షికారుకి వెళ్తున్నాము.” “చుస్తే పెద్దవారిలాContinue reading “రొజూ జూకేనా ?”
Author Archives: Sreenivasarao Sunkara
ప్రేమ.. – అభిమానం
‘మందిరం‘ లో హోమం నిర్వహించేటప్పుడు.. సుబ్బారావు చైనా పోన్ మ్రోగింది. రింగ్ టోన్ “పక్కా లోకల్ .. పక్కా లోకల్ “ అంటూ గయ్యిమంది. అందరూ అతన్ని వింతగాను, ఎబ్బెట్టుగాను చూసారు. సుబ్బారావు మొహం చిన్నబుచ్చుకోవాల్సి వచ్చింది. **ఆ సాయంత్రం బార్లో కూర్చున్నప్పుడు మళ్ళీ ఫోన్ మోగింది.జేబులోనుండి రెండో చేత్తో ఫోన్ తీస్తూ ఉంటె.. చేతిలో నిండు పెగ్ తొలికి పోయింది.బేరర్ టిష్యు పేపర్ తో చొక్కా తుడిచాడు. టేబుల్ మరో సారి క్లీన్ చేసాడు.వంగి ఫ్లోరింగ్ మీద పడిన మందుని శుభ్రంగాContinue reading “ప్రేమ.. – అభిమానం”
మెసెంజర్ లవ్
అర్దరాత్రి దాటి అరగంట అయింది. పదిహేనువేల కిలోమీటర్ల దూరాన్ని మెసెంజర్ మాయం చేస్తూ ఉంది. అరగంట సంభాషణ కి పుల్ స్టాప్ పెడుతూ అటునుండి అతను “గుడ్ నైట్ డియర్” అని ఒక టెక్స్ట్ ఒక లవ్ సింబల్. పంపాడు.“అప్పుడేనా?.. ఏం తొందర?“ పన్నెండు దాటింది. ఇక నిద్ర పో.. “ “ఉహూ నిద్ర రావటం లేదు. నువ్వెప్పుడు ఇండియా వస్తావా? నన్నెప్పుడు ❤ ❤😀 “ “ఊ…నన్నెప్పుడు .. పూర్తి చెయ్యొచ్చు కదా?” “ఇప్పుడు దిండు ఉన్న చోట ఉంచుకునిContinue reading “మెసెంజర్ లవ్”
అన్నపూర్ణ.
రెండు ఇడ్లీలని, చట్నీ లో అద్దుకుని తింటూ ప్రపంచాన్ని జయిస్తున్నట్లు గా ఆనందిస్తుంది తను. అడుగు ఎత్తుతో ఉన్న నాప బండ మీద రెండు వైపులా కాళ్ళు వేసి కుర్చుని ఇడ్లీలని ఆస్వాదిస్తూ ఉంది. కొంచెం శ్రద తక్కువగా పెరుగుతున్న పిల్ల. సన్నగా ఉంది. నాలుగు అయిదు ఏళ్ళు మించవు. దగ్గరలో ఉన్న వర్కింగ్ క్లాస్ ఇంటి పిల్లలా ఉంది. ఎందుకో తెలీదు చూడగానే నచ్చేసింది. అరడుగు మించని పాదాలకి, మరో రెండు అంగుళాలు పెద్దవి గా ఉన్నContinue reading “అన్నపూర్ణ.”
మట్టి గాజులు
అపర్ణ అటో దిగి ఫోన్ మాట్లాడుతూ…. ఎనిమిది అంతస్తుల అపార్ట్ మెంట్ ప్లాట్ లోకి వెళ్తూ ఉంటే, రోడ్డు మీద ‘తోపుడు బండి’ మీద మట్టిగాజులు అమ్ముతూ ఒక పదిహేను పదహారేళ్ళ పిల్ల కనిపించింది. ఒక్క క్షణం ఫోన్ మాట్లాడటం ఆపి రంగు రంగుల డిజైన్ గాజులు చూస్తుంటే… “ఇవి కొత్త గా వచ్చాయి అక్కా.. తళుకుల గాజులు నీకు బాగుంటాయి.” అంది ఆ అమ్మాయి. అపర్ణ ‘అక్కా’ అన్న ఆ పిల్లవయిపు.. తరువాత బండి మీద గాజుల వైపు చూసింది. గాజులు నిజంగానే బాగున్నాయి.Continue reading “మట్టి గాజులు”
అమ్మ అబద్దం ఆడింది.
నాకు మెలుకువ వచ్చేసరికి అమ్మ ఏడుస్తూ ఉంది. నాన్న అమ్మ జుట్టు పట్టుకుని ఉన్నాడు. తమ్ముడు నిద్ర పోతూ ఉన్నాడు. రోజూ లాగే .. “అపార్ట్ మెంట్ లో ఆరిల్లల్లో పని చేస్తావ్? డబ్బులు అడిగితె లేవంటావే?” “ఇంట్లో ఎచ్చాలు కొన్నాను. పిల్ల బడి లో కట్టాను. ఇంకేం మిగల్లేదు” “నువ్వు ఎప్పుడు నిజం చెప్పావే?” ఇద్దరు కాసేపు పెనుగులాడుకున్నారు. అమ్మ ఏడుస్తునే ఉంది నాకు మళ్ళీ నిద్ర పట్టింది. **ఉదయం మెలుకువ వచ్చే సరికి అమ్మContinue reading “అమ్మ అబద్దం ఆడింది.”
పరిష్కారం.
నిశబ్దం గా ఉన్న చల్లటి గదిలో కూడా ఆమె మాట డాక్టర్ సౌజన్య కి వినబడలేదు . “మళ్ళీ చెప్పండి” అంది.“రెండో బిడ్డ వెంటనే వద్దని నేనూ మా వారూ అనుకుంటున్నాం. పాపకి ఇంకా ఏడాది నిండలేదు. తన తోనే నిద్ర చాలటం లేదు. ఇంకా ఇప్పుడు రెండో సారి అంటే.. “డాక్టర్ సౌజన్య పేషంటు తాలూకు గత నెలలో US లో చేయించిన రిపోర్ట్స్ చూసి ఉంది. డబుల్ మార్కర్ టెస్ట్. అడ్వాన్స్డ్ సైన్సు రిపోర్ట్స్Continue reading “పరిష్కారం.”
అసలు పేమ అంటే ఏంది బిడ్డా ???.
మేమంతా మట్టిలో దొర్లాడాము. పేడలో పోర్లాడాము.ఏం తిన్నామో గుర్తులేదు. ఏమి కట్టుకున్నామో కుడా గుర్తులేదు.పాకల్లో ఉన్నాం. గోడల సావిట్లోనే పడుకున్నాం.నువ్వు పుట్టాకే పాకా వేసుకున్నాం. పేగు తెంచుకుని రక్తం పంచుకుని పుట్టిన నిన్ను క్రిష్ట్నుడిలా పెంచుకున్నాం.నువ్వు దోగిన నేలమీద పట్ట వేసుకుని పడుకున్నాం. నువ్వు తిని వదిలేసినా తిండే మేము తిన్నాం.పండక్కి రంగు రంగుల చొక్కాలు తోడిగాం. తిరునాళ్ళకి మెడ మీద కూచోబెట్టుకుని ఊరంతా తిప్పాం .నువ్వు ఆడింది ఆట. పాడింది పాట. నీకు నలతగా ఉంటె ఎన్ని దినాలు అమ్మతల్లికిContinue reading “అసలు పేమ అంటే ఏంది బిడ్డా ???.”
If you love them…
చాలా చిన్నప్పుడు వేసవి సెలవులకి మా నానమ్మ (తాళ్ళూరు) వాళ్ళ ఊరు వెళ్లినపుడు మా పెద్దమ్మ ఒకావిడ ఉండేవారు. మా పెదనాన్న నాగయ్య గారి భార్య. మేము వస్తున్నాం అని ఎలా తెలుసుకునేదో కాని వెళ్ళినప్పుడల్లా పెద్ద గిన్నె మీద బోర్లించిన జల్లి బుట్ట తీసి దానికింద నుండి పాల అరిసెలు తీసి ఇచ్చేది. అద్బుతంగా ఉండేవి. పిల్లలం అందరికీ తలా రెండు ఇచ్చేది కాని నన్ను ప్రత్యేకం గా చూసేది అనిపించేది. “పెద్దమ్మా పాల బూరెలుContinue reading “If you love them…”
నాన్నొచ్చాడు.
అజ్ఞాతం లో ఉంటున్న నాన్న అమీర్పేట హాస్టల్ కి వచ్చాడు.ఆర్నెల్లు దాటింది నాన్నని చూసి. తెల్లగడ్డం చింపిరిగా ఉంది. చర్మానికి ఏదో అయ్యింది. కళ్ల చుట్టూ నల్లగా ఉంది. నుదురు మీద పగుళ్లు కనిపిస్తున్నాయి. నోట్లో నుండి గుట్కా వాసన వస్తుంది. ఎప్పటిలాగా లెనిన్ ఫాంటు, బ్రాండెడ్ చొక్కాలో లేదు. ఫ్లాట్ ఫార్మ్ మీద అమ్మే లాటి బట్టలు వేసుకుని ఉన్నాడు.బాంకు లో పని ముగించుకుని హాస్టల్ కి వస్తుంటే కింద పార్కింగ్ లో ఎదురుచూస్తున్నాడు.“నాన్నా..” గుర్తు పట్టాకContinue reading “నాన్నొచ్చాడు.”
