“కొడుక్కి ఆమాత్రం ఇవ్వలేని వాడు వాడేం తండ్రి.” మా బెమ్మి గాడు అన్నాడు. ఇది నాలుగో సారి ఈ మాట అనటం.“సర్లే రా.. బో చెప్పావు.” నవ్వుతూ మందలించాను. బయట షామియానా కింద కుర్చీలో కూర్చుని ఉన్నాం ఇద్దరం. మా పెద్ద పాప వేడుక రోజు. 2006 అని గుర్తు.అతిధులు అందరూ అప్పటికే చాలా వరకు వెళ్లిపోయారు. భోజనాలు అయ్యాక మా బెమ్మి గాడు (లేట్ శ్రీ మాదాల బ్రహ్మయ్య) నేను పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నాం. ఈ లోగాContinue reading “కొడుక్కి ఆస్తి”
Author Archives: Sreenivasarao Sunkara
ఎందుకని అలాగ ??
మొన్న వైకుంఠ ఏకాదశకి గుడి కెళ్ళినప్పుడు..జనరల్ మెడిసిన్ డాక్టర్ సదాశివం గుళ్ళో ప్రదక్షణాలు చేస్తూ కనిపించారు.విష్ చేసి ప్రదక్షణాలు .. దర్శనం .. ప్రసాదాలు అయ్యాక గుడి ఆవరణలో కూర్చుని ఉన్నామా …మా ముసలాయన ఆయన దగ్గర చేరాడు.“డాక్టర్ గారు నడుము పూర్తిగా కిందికి వంచి రెండు చేతులని ఎడంగా చేసి ఏకాలు ఎత్తినా తుంటి దగ్గర ఒకటే నొప్పి గా ఉంటుంది .. ఎందుకని అంటారు “” హాస్పటల్ కి రండి ఒకసారి స్కానింగ్ చేయించి చూద్దాం ““రెండుContinue reading “ఎందుకని అలాగ ??”
మేకప్ ఆర్టిస్ట్ కావలెను.
మా రెండో అమ్మాయి పెళ్లి కి వర్క్ చేసిన వీడియోగ్రాఫర్ ఫోన్ నెంబరు తీసుకుంది ఈవిడ రహస్యం గా.. మా వాడిని చూస్తూ, నా ఎడం చెయ్యి మధ్యవేలు వెనక్కి విరిచి టక్కు న శబ్దం చేసాను. వాడు కుడి చెయ్యి తో గడ్డం గీక్కున్నాడు. మీకు అయోమయం గా ఉండొచ్చు.. జేమ్స్ బాండ్ సినిమాలు కాలేజి ఎగ్గొట్టి చూసిన వాళ్ళకి తేలిగ్గానే అర్ధం అవుతాయి. సాయంత్రానికి మా వాడు నేను ఇద్దరం ఇమో లో కనెక్ట్Continue reading “మేకప్ ఆర్టిస్ట్ కావలెను.”
CPU కుండీ !
“మనిద్దరం అలుక్కున్నాం. గుర్తుందా ఆ విషయం?” అద్దం వైపు చూస్తూ అంది ఆవిడ. “అలుక్కున్నప్పుడు మాట్లాడుకోరాదు. అసలు బేసిక్ గా మగాళ్లు దిగులు మొహాలతో బ్రహ్మానంద పడే కాలం అదే.” “ఇంట్లో ఆడమనిషి మనిషి అలిగితే ఏమీ కష్టం లేదంటారు?” “ఎంత మాట? దిగులుగా, లోకం అంతా చీకటయినట్లు, గడ్డం చేసుకోకుండా, బిక్కమొహం తో కనిపించడం ఎంత కష్టమో తెలుసా?’ “అబ్బా.. ఛా.” “అసలు పెళ్లి మంత్రాల్లోనే అనేక జాగర్తలు చెబుతాడు పురోహితుడు. ఏ ఐమూల చూపుContinue reading “CPU కుండీ !”
పంపకాలు
అంబానీ ఆస్తులని అరగంటలో పంచొచ్చు గాని అక్కూర కుండీలని పంచడానికి పెద్ద పంచాయితీ పెట్టాల్సివచ్చింది. అసలు ఈ ఇంటెర్వెల్ బాంగ్ కి ముందు చిన్న కధ ఉంది. నిన్న తోటకూరని గుర్తు పట్టలేక శాపగ్రస్తుడిని అవటం తోటకూర పోస్ట్ తర్వాత… నిన్న సాయంత్రం, ఒకటి రెండు సార్లు ఫోన్ లో మనకి కావల్సిన మనిషి సిద్దంగా ఉండటం కన్ఫర్మ్ చేసుకుని గుండమ్మ ..తో బంగారం అంగడికి బయలుదేరా.. కారు ఫర్లాంగ్ దూరం వెళ్ళి ఆగి పోయింది. “గేరుContinue reading “పంపకాలు”
తోటకూర
గోంగూర, మెంతి కూర మీద నాకు మంచి పట్టుంది. క్లోస్, మిడిల్, లాంగ్, జూమ్ ఏ షాట్ అయినా సరే ఇట్టే గుర్తు పట్టగలను. నా మీద కోపం ఉన్నప్పుడు మిగతా వాటిలో ఎదో కూర రెండు కట్టలు బేరం ఆడి తెమ్మని పురమాయిస్తుంది మా గుండమ్మ.”నీకు తెలుసుగా నేను ఆకు కూరలని గుర్తు పట్టలేను.” వీలయినంత బేలమొహం పెడతాను.”అదేం కుదరదు. పాలకూర, తీసుకొని, చుక్కాకు కూర, తెల్ల తోటకూర కట్ట, మెంతి కూర తీసుకు రండి.Continue reading “తోటకూర”
హార్మోనియం
వినాయకుని పందిట్లో ‘నవరాత్రులు భజన’ చేయటానికి ఒప్పుకున్న బృందం లో హార్మోనియం వాయించే అతన్ని వాలెంటీర్లు పోలీసులకి పట్టించారు. స్వామి వారి కి పూజ చేయటానికి తెచ్చిన వెండి దీపపు కుందులు తస్కరించడం గమనించి. ప్రోగ్రాం లో హార్మోనియం వాడకుండానే మర్నాడు పూజా కార్య క్రమానంతర భజన బృందం కార్యక్రమం నిర్వహించింది గాని భక్తులని అంతగా రంజింపలేక పోయింది. తాత్కాలికంగా నాలుగు రోజులు హార్మోనిస్టు దొరుకుతాడేమోనని స్థానికంగా ఉన్న డ్రామా కంపనీ ల్యాండ్ లైను కి ఫోన్ చేశాను. “బజనContinue reading “హార్మోనియం”
పిల్లలు- ఆర్ధిక క్రమశిక్షణ
నోకియా ఫోన్ నుండి మా ఇంటికి మెసేజ్ పెట్టాను. “ కలెక్టర్ గారి మీటింగ్ అయ్యేసరికి లేటయ్యింది. అక్క వాళ్ళ వద్ద (జిల్లా కేంద్రం) ఉండి రేపు టౌన్ లో పని చూసుకుని వచ్చేస్తాను. జాగర్త” అని**అక్క రోజు మాదిరిగా నాలుగున్నరకే లేచి కారేజి లు రెడి చేసింది. ఏడు గంటలకి బావ తను పని చేసే స్కూల్ కి వెళ్ళటానికి బస్టాండ్ కి , ఎనిమిదికి రవి బాబు హైస్చూల్ కి వెళ్ళిపోయారు.నేనూ స్నానం చేసిContinue reading “పిల్లలు- ఆర్ధిక క్రమశిక్షణ”
గురుదక్షణ
పొద్దుటే నేను నిద్ర లేచేసరికి మా అబ్బాయి బస్ స్టాండ్ కి వెళ్లి హైదరాబాదు నుండి వచ్చిన మా రెండో అమ్మాయిని పిక్ అప్ చేసుకు వచ్చాడు. టీ తాగుతూ పేపర్ చదువుతుంటే… ఇద్దరు “హుష్ హుష్” అనుకుంటూ సైగలు చేసుకుంటున్నారు. “బస్టాండ్ కి కారు తీసుకెళ్ళావా?” మా వాడిని అడిగాను. అవునన్నట్లు నవ్వాడు. “వచ్చేటప్పుడు అక్క డ్రైవ్ చేసిందా?”ఈ సారి జీవన నవ్వింది. త్రోవలో ఎవరో స్కూటీ నడిపుతూ ఎదురొచ్చిన అతన్ని భయ పెట్టి వచ్చిదట.Continue reading “గురుదక్షణ”
ఈ పెద్దోళ్ళున్నారే
కొత్తపట్నం లో ఉన్న తాబేలు పిల్లకి కి, పాకల ఎండ్రకాయ పిల్లాడికి కి స్నేహం కుదిరింది. రెండు బీచ్ లలోను అనేకం మాట్లాడుకున్నారు. ఇద్దరి మనసులు దగ్గరయ్యాయి. “మనం పెళ్లి చేసుకుంటే” అంది తాబేలు.“మా ఇంట్లో ఏమి అభ్యతరం ఉండదు మీ నాన్న తోనే సమస్య” అన్నాడు పిల్లాడు.“మా నాన్నకి నేనూ నచ్చ చెబుతాను” అంది తాబేలు పిల్ల.**“పాకల వాళ్ళు మొరటు వాళ్ళు . వాళ్ళ సంబంధం మనకి వద్దు. అసలు వాళ్లకి మనకి అసలు కుదరదు. సమస్య వస్తేContinue reading “ఈ పెద్దోళ్ళున్నారే”
