దయామయుడయిన ప్రభువా!!

అనురాధ ట్రైని పైలెట్ తో టు మెన్ సీటర్ లో ఫ్త్లెయింగ్ ప్రాక్టీస్ చేస్తుంది.అనుకోకుండా ట్రైనర్ కి కార్డియాక్ స్ట్రోక్ వచ్చింది.వళ్లంతా చెమటలు పట్టాయి. మాట్లాడలేక పోతున్నాడు. ఊపిరి కూడా కష్టంగా ఉంది. కళ్ళు తేలేశాడు. అనురాధ కి పరిస్తితి అర్ధం అయింది. వెంటనే కంట్రోల్ రూముకి కనెక్ట్ అయింది.“హలో.. హలో.. నేను ట్రైని పైలెట్ గయ్యాళి అనురాధని.నా ట్రైనర్ కి హటాత్తుగా హెల్త్ ప్రాబ్లెమ్ వచ్చింది. మన స్పృహలో లేడు.అతని ప్రాణం పోయేలా ఉంది.నాకు ఫ్లైట్ నడపటంContinue reading “దయామయుడయిన ప్రభువా!!”

బాటిల్ బ్రిక్స్

ప్రపంచం కనిపించకుండా ఎదుర్కుంటున్న మరో పెండమిక్   ప్లాస్టిక్. పర్యావరణమే కాదు, మూగ జీవాలు, సముద్ర జీవరాసులను నష్టపరుస్తున్న భూతం ప్లాస్టిక్. ప్లాస్టిక్ రద్దు ని తిరిగి వాడటం మీద అనేక రకాల పద్దతుల పై అన్వేషణ జరుగు తుంది. ప్లాస్టిక్ బాటిల్స్ ని ఇంటి నిర్మాణానికి వాడటం అనేది ఒక మంచి పరిష్కారం. బీద దేశాలు లేదా పర్యావరణం పై అవగాహన ఉన్న ప్రాంతాల్లో ఇప్పుడు ఈ ప్లాస్టిక్ బాటిల్స్ ని ఇటుకల లాగా వాడుతున్నారు. అదేలాగోContinue reading “బాటిల్ బ్రిక్స్”

రామనామీలు

కొన్ని యుగాల క్రితం రామ నామానికే పరవశించే ఒక మారుతి ని “ఏమోయ్ ఎప్పుడూ రాముడు రాముడూ అంటావు!! ఆయన ఎక్కడ? నీలో ఉన్నాడా?” అని అడిగితే, తన గుండెను చీల్చి, లోపల కొలువై ఉన్న రామలక్ష్మణుల ని చూపించాడట. నూట ఇరవై అయిదేళ్ళ క్రితం ఒక వర్గాన్ని కొంత మంది పెద్ద మనుష్యులు “మీకు రాముని గుడిలో ప్రవేశం లేదు. రామనామాన్ని సైతం ఉచ్చరించ కూడదు” అని కట్టడి చేశారు. ఆ వర్గం ఎటువంటి వివాదాలకి దిగకుండా ‘రామ’Continue reading “రామనామీలు”

Mr X భాను ప్రకాష్

అయిదేళ్ళ వయసులో X అనే పిల్లాడికి ఒక పెద్ద ప్రమాదం ఎదురయ్యింది. తలకి బలమైన గాయం. అనేక సర్జరీలు అవసరం అయ్యాయి. ఆ గాయాల నుండి కోలుకుంటూనే అతను అబాకస్ మీద, ఫజిల్స్ మీద ఇంట్రెస్ట్ పెంచుకున్నాడు. చిన్న వయసులోనే SPI  అకాడమీ లో అబాకస్ లో నమోదు చేసుకుని  9th లెవెల్  విన్నర్ అయ్యాడు. ఇంటెర్నేషనల్ అబాకస్ అకాడమీ లో మూడు సార్లు విన్నర్ అయి లిమ్కా రికార్డు లు సాధించాడు. అప్పటి నుండి లెక్కల్లోContinue reading “Mr X భాను ప్రకాష్”

భిక్ష పాత్ర

జీవితం మనకు అవసరం అయినవి అన్నీ ఇస్తుంది.కానీ అవసరాన్ని మించి మనం అడుగుతూ ఉంటాం.అప్పుడు నిజమయిన అవసరం మరుగునపడుతుంది. ఆశ అనేది ముందుకు వస్తుంది. ఆశ కి అంతులేదు.మనకి జీవితం ఇచ్చిన దాని పట్ల స్పృహ ఉంటే మన ఆనందం అక్కడే ఉంటుంది. ఒక రోజు..రోజు మాదిరిగానే రాజు గారు ఉధ్యానవనానికి వచ్చాడు.సాయంత్రం ఉల్లాసంగా ఉన్నాడు. గాలి స్వచ్చంగా ఉంది.వాతావరణం ఆహ్లాదంగా ఉంది. మందీ మార్బలం లేకుండా ఒంటరిగా వచ్చాడు. ఒక బిక్షగాడు ఎప్పటి నుండో రాజు గారిContinue reading “భిక్ష పాత్ర”

వెంకట్రావ్.. ఆగు

“అర్జంటుగా ఇటు రండి” కేక వేసింది ఇంటావిడ. హడావిడిగా వెళ్లి చూద్దును గదా రెండో ఫ్లోర్ బాల్కనీ లో ఉంది ఈవిడ “ఏమయింది?” వెనక అపార్ట్ మెంట్ చూపిస్తూ “ మూడో ఫ్లోర్ లో మీ ఫ్రెండ్ వెంకట్రావ్ ని చూడండి. నా కెందుకో అనుమానం గా ఉంది” అప్పుడే గమనించాను. సాయంకాలం చీకటి మొదలవుతుంది. వాడి ఫ్లాట్ లో వెనుక పోర్చ్ చివరి కొచ్చి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు. ముఖం లో విపరీతమయిన విసుగు. మాట్లాడుతూContinue reading “వెంకట్రావ్.. ఆగు”

దోసకాయ కి ఫేషియల్.!!

ఈ మధ్య బ్లాగ్ పని లో పడి సరిగా పట్టించుకోలేదు గాని మిద్దె తోట లో కొన్ని వర్ణ వివక్షలు మొదలయ్యాయి. మొదటి నుండి పంపకాల  ప్రకారమే ఇంటావిడ మా ఇంటి ముందు ఉన్న స్థలం లో పెరటి మొక్కలని, నేను మిద్దె మీద కుండీల పెంపకాన్ని పంచుకున్నాం. మొన్నీ మధ్య వర్షాల తర్వాత, ఆకు కూరలు ముఖ్యంగా పాల కూర  అంత ఫ్రెష్ గా రావటం లేదు. కొంచెం ముడుచుకున్నట్లు గా ఉంటుంది. టమోటా, మిర్చిContinue reading “దోసకాయ కి ఫేషియల్.!!”

CBI

ఒక బ్రహ్మానందాన్ని ఒక కోవై సరళ లాటి పెళ్ళాం ఒక ఫైన్ మార్కింగ్ ఎగిరి తన్నింది. డామినేషన్ సమానహక్కులు లాటి  సమస్య. మూగ దెబ్బలు. పైకి మామూలుగానే ఉంటుంది కానీ లోపల రచ్చ..రంబోలా న్యాయపరంగా కేసు తేల్చుకోవాలని ఫిక్స్ అయ్యి, దగ్గర్లోని  పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు. కంప్లయింట్ వ్రాసి ఇవ్వగానే “రోజు కి ఇలాటివి సవాలక్ష కేసులు వస్తుంటాయి. సర్దుకుని పోతుండాలి” అని   చెప్పి పంపేశారు. సమస్య తీవ్రత వాళ్ళకి అర్ధం కాలేదు. అలానే కుంటుకుంటూContinue reading “CBI”

అటక

ఇప్పుడంటే అందరూ సోకులు మరిగారు కానీ.. దశాబ్దం క్రితం వరకు ఇంటి ప్లాన్ కోసం వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా Loft (లో రూఫ్)/ఆటక స్టోరేజ్ స్పేస్ లు కావాలని పట్టుబట్టేవారు.మధ్య తరగతి ఇళ్లలో ఇంట్లో ఉంచుకోలేని, బయట పడేయ లేని సామాను బోలెడు..రాగి/ఇత్తడి కాగులు, గిన్నెలు, బక్కెట్లు, ఫర్నిచర్ అట్టపెట్టెలు, వాట్ నాట్ .. అనేకం (ఐదేళ్ల పాటు వాడని వస్తువులు పారేయ్యాలని కొంత మంది సిద్ధాంతీకరించారు.) మా నాన్న వాడిన పడక కుర్చీ మడత పెట్టిContinue reading “అటక”

Lion – long way home

“మేము ఖాళీ పేపర్లం కాదుగా? మీ స్వంత బిడ్డలు మీకు ఉంటే బాగుండేది?” అని ఒక దత్త పుత్రుడు తల్లిని అడుగుతాడు. “తల్లి కాగలిగి ఉండీ, ఇంత ప్రపంచం లో అనాధ బిడ్డలకు కుటుంబాన్ని ఇవ్వాలని నా 12 వ ఏట అనుకున్నాను. నా ఆలోచన ని గౌరవించిన వ్యక్తినే వివాహం చేసుకున్నాను” అని ఆ ఆస్ట్రేలియా తల్లి దుఃఖం తో చెబుతుంది. గూడ్స్ రైల్లో బొగ్గులు సేకరించి టీ అంగడిలో ఇచ్చి బదులుగా పాలు తీసుకునిContinue reading “Lion – long way home”

Design a site like this with WordPress.com
Get started