నేను ఆలయానికి రాను

ఒక 11 సంవత్సరాల కుమార్తె తన తండ్రి తో కలిసి దేవాలయానికి వెళ్లింది. భగవంతునికి నమస్కరించి వచ్చి ఓ ప్రక్కన కూర్చున్న సమయంలో, తన తండ్రితో ఆమె ఇలా అంది. “నేను ఇకపై ఆలయానికి రాను” తండ్రి ఇలా అడిగాడు: “ఎందుకో నేను తెలుసుకోవచ్చా?” ఆమె ఇలా అన్నది: ” భగవంతునికి సేవ చేయడం మరియు భజనలో సమయం గడపటం కోసం మనం ఇక్కడకు వస్తున్నాము, కానీ ఇక్కడ నాకు అందరూ కపట భక్తులే గోచరిస్తున్నారు. దేవాలయానికిContinue reading “నేను ఆలయానికి రాను”

శర్మ గారు

వెంకటరెడ్డి నేనూ రవ్వదోశ కి న్యాయం చేసి ఇరాని టీ కోసం వెళుతూ ఉంటే, బక్కపలచటి శరీరంకి తెల్లటి వెంట్రుకలు పెవికాల్ తో అడ్డదిడ్డంగా అంటించినట్లు ఉన్న మొహంతో ఒకతను మమ్మల్ని ఆపాడు. వెంకటరెడ్డి ఆయనతో పలకరింపు మాటలు మాట్లాడుతూ. “శర్మ గారు, గుర్తున్నారుగా అన్నా” అన్నాడు నన్ను చూస్తూ. అలా గుర్తు చెయ్యక పొతే ఖచ్చితంగా గుర్తుపట్టేవాడిని కాదు. “బావున్నారా?” అడిగాను. చెయ్యి కలుపుతూ.. చెయ్యి చల్లగా ఉంది.ఆయన రెండో చేతి లో కూరగాయల సంచిContinue reading “శర్మ గారు”

ఖాళీ పెట్టె

“తాతా నాన్న ఎప్పుడొస్తాడు.” అంది మనమరాలు.కుర్చీలో కూర్చుని కాఫీ చప్పరిస్తున్న రామనాధం తో..రామనాధం మనమరాలిని దగ్గరకి తీసుకున్నాడు. “రేపు వచ్చేస్తాడు. ఈ పాటికి బయలు దేరి ఉంటాడు. అక్కడ విమానం ఎక్కి జుమ్మని వచ్చి హైదరాబాదు లో దిగి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. బుజ్జి తల్లిని చూడటానికి” ఆరేళ్ళ మనమరాలికి చక్కిలి గిలి పెట్టాడాయన. లావణ్య నవ్వింది. సిగ్గు పడింది. “నాకు బోలెడు బొమ్మలు తెస్తాడు. గౌనులు, ఇంకా కర్జూరాలు, చాక్లెట్లూ.” కళ్ళు పెద్దవి చేస్తూ చెప్పింది.. “అవునుContinue reading “ఖాళీ పెట్టె”

గిఫ్ట్

ఆఫీసు లో మేనేజర్ బర్త్ డే సెలబ్రేట్ చేయాలని స్టాఫ్ ఫిక్స్ అయ్యారు. సాయంత్రం ఆఫీసు అవర్స్ అయ్యాక ఆయన కేబిన్ లో అందరూ సమావేశం అయ్యారు. గుడ్ లుక్స్ కోసం పాటుపడే కొందరు శాలువా కప్పారు. బర్త్ డే కేక్ కట్ చేయించారు.బొకెలు, షేక్ హ్యాండ్లు .. అభినందనలు. హగ్ లు… స్టాఫ్ అంతా కలిసి ఒక బాగా పాక్ చేసిన కార్టన్ ఒకటి బహుమతిగా ఇచ్చారు. మేనేజర్ పాకెట్ ఊపి చూశాడు. పెట్టె ఒకContinue reading “గిఫ్ట్”

మెట్లు

నేనతన్ని అక్కడ చూస్తానని అస్సలు అనుకోలేదు. అది కూడా కోటూ, బూటూ వేసుకుని హుందాగా, భారీ స్తాయి మోసగాడి లాగా, ఎక్కడో కొట్టుకొచ్చినట్టున్నాడు. కొంత మంది బకారాగాళ్ళు చుట్టూ చేరి వాడు చెప్పేది ఆసక్తిగా వింటున్నారు. మధ్య మధ్యలో నవ్వులతో కలిపిన చలోక్తులు విసురుతున్నాడు. గాలానికి యెర వేసినట్లు..ఆర్డీవో గారి  వియ్యంకుడి కొడుకు పెళ్లి రిసెప్షన్ అది. సమాజం లో ఉన్నత వర్గం తో పాటు అధికార్లు, ప్రజా ప్రతినిధులు లాటి  వారితో పాటు ఫోర్త్వెంటీ  రాజీ గాడు నా కదేContinue reading “మెట్లు”

AAC Blocks Vs Red Bricks

Autoclaved Aerated Concrete Blocks అనే పూర్తి పేరు కలిగిన AAC బ్లాక్లు మరియు మన సంప్రదాయ మట్టి ఇటుకలు, ఏవి మంచివి? ఎంత మంచివి? అనేవి ఈ వీడియొ లో చూడండి. ఇటుక ఖచ్చితమయిన సైజు, నీటిలో నానబెట్టినప్పుడు వాటి పీల్చుడు గుణం, స్వంత బరువు, ele/plumbing అవసరాలు, mortor, time, labour వినియోగం లో ఆదా, strength మొదలయిన విషయాలు ఇందులో వివరింపబడ్డాయి. చూడండి. మరికొన్ని గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ కోసం the makingContinue reading “AAC Blocks Vs Red Bricks”

Design a site like this with WordPress.com
Get started