ఒక మంచి సంప్రదాయ కుటుంబం. అత్త, మామ గారు, బడిపంతులు భర్త. మంచి సంభందం. అమ్మాయి అత్తగారి ఇంట్లో అడుగు పెడుతుంది. పెళ్లి హడావిడి తగ్గి బందు మిత్రులు మాయమయ్యాక .. వంట, వార్పు లో అత్తగారికి సాయం చెయ్యటం తో మొదలవుతుంది ఆమె ప్రయాణం. అత్త గారు గల్ఫ్ లో ఉన్న కుమార్తె ప్రసవానికి సాయం గా వెళ్తుంది. ఇక 360 డిగ్రీలు, వంట, సింకు, ఆమెకి. ఆఖరికి ఆమెని పడకటింట్లో తన చేతి వాసన, కారే సింకు, మిగిలిపోయిన అన్నం, అంట్లు, పురుగులు పట్టిన చెత్త.. వదలవు. హోటల్ లో మాత్రమే భర్త పాటించే టేబుల్ మేనర్స్ పై హాస్యం ఆ రాత్రి క్షమాపణ చెప్పాల్సినంత వరకు వెళ్తుంది. “శారీరక ఇబ్బంది గా ఉంది, లైటు అర్పే ముందు కొంత ‘సరదా’ కూడా ఉంటే బాగుంటుంది.” అన్న బార్య మాట అతనికి పెద్ద తప్పుగా అనిపిస్తుంది. సింకు కింద బక్కెట్లో ఉన్న అంట్లు కడిగిన నీళ్ళు అయ్యప్ప మాలలో ఉన్న తండ్రి కొడుకులకి ‘టీ’ కింద ఇవ్వటం వరకు వెళ్తుంది. ఉగ్ర రూపం లో వంటింట్లో ఆమె పై దాడికి వచ్చిన అతని మొహాన డబ్బాతో కుడితి నీళ్ళు గుమ్మరించి బయటకి వస్తుంది. పుట్టింట్లో కూర్చుని అమ్మా చెల్లెళ్లతో తన వేదన వెళ్లబోసుకుంటున్నప్పుడు ఉన్నప్పుడు తమ్ముడు వచ్చి అక్కని పలకరించి, తల్లి ని మంచి నీళ్ళు అడిగితే చెల్లెలు లేవబోతుంది. టేబుల్ మీద ఉన్న గ్లాసుని విసిరి “ఏం నువ్వు తీసుకోలేవా అని ప్రశ్నిస్తుంది?” తనకి ఇష్టమయిన డాన్స్ టీచర్ గా జీవితం ఆస్వాదించడం ప్రారంభిస్తుంది. ఇంతే కధ. ఇంతేనా ? అంటే. కాదు అనంతం. తడిగుడ్డ లాటి గృహ హింస. దర్శకుడికి హ్యాట్స్ ఆఫ్.గూగుల్ డ్రైవ్ లో లింక్ పంపి ఒక గొప్ప సినిమా చూసే అవకాశం కల్పించిన శ్రీరామ్ కణ్ణన్ కి థాంక్స్.


ఆ తమ్ముడిని కోప్పడే ఒక్క సన్నివేశంతో సమస్య మూలాలనీ అలాగే మార్పు ఎక్కడ నుండి మొదలవ్వాలో కూడా స్పష్టంగా చెప్పేశాడండీ దర్శకుడు. ఈ మధ్య కాలంలో నాకూ బాగా నచ్చిన సినిమా ఇది.
LikeLike
అవునండీ..
LikeLike