రత్న ఒక లివ్ ఇన్ మైడ్. (ధనవంతుల ఇళ్ళలో వంటగది సర్వీస్ నుండి ఎంట్రీ ఉన్న చిన్న రూమ్ లో ఉండే పనిమనిషి) అశ్విన్ అనే ఆర్కిటెక్ట్ అతనితో జీవితం పంచుకొనున్న గర్ల్ ఫ్రెండ్ సబీనా ఒక పల్లెటూరి నుండి రత్న ని పనికి కుదుర్చుకుంటారు. అశ్విన్ ఒక బ్లాగర్/రైటర్ కావాలనుకుని ఇండియా లోని తమ్ముడు అనారోగ్యం కారణంగా న్యూ యార్క్ నుండి వచ్చేస్తాడు. తమ్ముడు చనిపోయాక ఇక్కడే కుటుంబ కన్స్ట్రక్షన్ వ్యాపారం లో బాగం అవుతాడు. వ్యక్తిత్వం మాత్రమే మిగిలిన రత్న, ఇక్కడ పని చేస్తూ కుటుంబానికి ఆర్దిక సాయం చేస్తూ తన చెల్లెలిని చదివిస్తూ ఉంటుంది. తన కి సాద్యపదని చదువు ను చెల్లెలికి దక్కేలా చేస్తుంది. తను స్వయంగా ఒక ఫాషన్ డిజైనర్ అవటం ఆమె కోరిక. సినిమా రత్న ని పల్లె నుండి పనికి పిలిపించడం తో మొదలవుతుంది. సంభాషణల ద్వారా అతని గర్ల్ ఫ్రెండ్ సబీనా మోసగించి వెళ్ళిపోయిన విషయం దర్శకురాలు చెబుతుంది. అశ్విన్ దుఖానికి రత్న ఎమోషనల్ గా తోడు ఉంటుంది. . తనకి 19 ఏళ్ల వయసులో వివాహం అయిందని నాలుగు నెలలు తిరక్కుండా విధవ గా మిగిలిందని. తన జీవితం అయిపోయినట్లు తను భావించడం లేదని. జీవితం అయిపోవటం అంటూ ఉండదని (life never stops) అతనితో అంటుంది. ఒంటరిగా మిగిలిపోయిన అతనికి మైడ్ గా ఉండిపోతుంది. కథ నడిచే కొంది అశ్విన్ రత్న ని సమాజం లోని ఇతరులతో సమానంగా గుర్తిస్తున్నాడని, క్లాస్ వ్యత్యాసాలు చూపే మనస్తత్వం కాదని తెలుస్తుంది. రత్న తనకి ఖాళీ గా ఉన్న రెండు గంటలు ఒక టైలర్ వద్ద టైలరింగ్ నేర్చుకోటానికి వెళ్తానంటే అతను అంగీకరిస్తాడు. ‘’everyone has the right to dream’. అని అతనూ నమ్ముతాడు. అశ్విన్ పుట్టినరోజుకి ఆమె స్వయంగా కుట్టిన షర్ట్ బహుమతిగా ఇస్తుంది అది ఎంతో అభిమానంగా తీసుకుంటాడు. అలాగే ఆమెకి ఒక కుట్టు మిషను బహుమతిగా ఇస్తాడు. ఎమోషనల్ గా ఒకరికి మరొకరు సాయం చేసుకుంటూ గడుపుతుంటారు. రత్న చెల్లెలు వివాహం కుదురుతుంది. ఆమె చదువు కి అంతరాయం కలుగుతుందని ఆమె బాధ పడుతుంటే, అతను దైర్యం చెబుతాడు. ఆమె ఇంటికి వెళ్ళి చెల్లి పెళ్లి అటెండ్ అయి వస్తుంది. పల్లెలో ఉన్నప్పుడు అశ్విన్ ఫోన్ చెయ్యటం, ఇబ్బందిగాను, సంతోషం గాను అనిపిస్తుంది. వచ్చాక రత్న చెల్లెలి పెళ్లి వేడుక ఫోటో లు ఆమె సెల్ లో చూస్తాడు అతను. ఒక క్షణం వారిద్దరి మద్య దగ్గరితనం ఒక ముద్దుతో చెదురుతుంది. వారిద్దరి ఆ దగ్గరితనాన్ని మరచిపొమ్మని ఆమె అడుగుతుంది. సమాజం మీ ప్రేమని అంగీకరిస్తుందా అని అశ్విన్ స్నేహితుడు ప్రశ్నిస్తాడు. తనని ఇంటివద్ద అత్తింటివారు జుట్టుపట్టుకుని ఈడ్చుకుని వెళ్తారు అని రత్న అంటుంది.. ఆమె అతనివద్ద పని మానేసి సిటీకి వచ్చిన చెల్లెలు వద్దకి చేరుతుంది. అతని జోక్యం తో ఆమె ఒక ఫాషన్ డిజైనర్ వద్ద పనికి కుదరటం, అతను న్యూ యార్క్ తిరిగి వెళ్లిపోటానికి సిద్దపడటం… కొన్ని ఎమోషనల్ మలుపుల తర్వాత ఎప్పటిలా రత్న అతన్ని ‘సర్’ అని కాకుండా ఫోన్ లో ‘అశ్విన్’ అని సంభోదించడం తో సినిమా ముగుస్తుంది. Tillotama Shome రత్న పాత్ర లో పరకాయ ప్రవేశం చేసింది. 2018 లో విడుదల అయిన ఈ చిత్రం Netflix లో ఉంది. వీలుంటే చూడండి.

