Septic Tank

ఇల్లు ఇరుకులం. ఆలి మరుకులం.

(ఇల్లాలుని మన బలహీనతలు తెలియని ప్రాంతం నుండి తెచ్చుకోవాలి. ఇల్లు తెలిసినవారున్న సమాజం లో నిర్మించుకోవాలి)  అనే సామెత జనం నానుడిలో పడి తన స్వరూపాన్ని మార్చుకుని ‘ఇల్లు ఇరుకు, ఆలి అనాకారి’ అనే చెత్త కింద ప్రచారం లో ఉంది.

సెప్టిక్ టాంక్ నిర్మాణం కూడా అంతే.

సరైన పద్దతిలో పైపులు అడ్డుగోడలు, మాన్ హోల్, వెంట్ పైప్ లు అమర్చకపోతే.. చాలా ఇబ్బందులు ఉంటాయి.

  1. తరచూ టాంక్ నిండటం.
  2. డ్రైనేజ్ లోకి excreta వెళ్ళటం.
  3. టాయ్లెట్ లోకి దుర్గంధం రావటం.
  4. టాయ్లెట్ షీట్స్ సరిగ్గా ఫ్లష్ అవకపోవటం.

కనుక ఒక్కసారి ఈ చర్చ అవసరం అనిపించింది. ఇప్పుడు ఒక్కొక్కటి మాట్లాడుకుందాం.

సెప్టిక్ టాంక్ పొడవు : వెడల్పు 1:2 లో ఉంటే మంచిది. అనగా వెడల్పు 6 అడుగులు ఉంటే పొడవు 12అడుగులు . లోతు 8 అడుగులు ఉంటే మంచిది. . కానీ ఈ మధ్య సెప్టిక్ టాంక్ క్లీన్ చేసే వాహనాలు అందుబాటులోకి వచ్చాక ట్యాంక్ సైజుల్లో తగ్గిపోయాయి.  కనీస కొలతలు 4’x6’ కూడా ఉంచడం లేదు.

గోడలు ఇట్లుకతో కాకుండా మందం తగ్గటం కోసం కాంక్రీట్ తో కూడా ఏర్పాటు చేస్తున్నారు. బఫెల్ వాల్స్ బదులుగా నాపరాళ్ళు లేదా ఫ్రే కాస్ట్ బండలు వాడుతున్నారు. ఒక్కొక్కరు రెండు బఫెల్ వాల్స్ బదులు ఒకటే ఏర్పాటు చేస్తున్నారు. భూమి లోపల ఉండేది కదా అని అనేక ప్రయోగాలు చేస్తున్నారు. వెంట్ పైపు ని అన్నిటికంటే పైన ఉన్న టాయ్లెట్ షీట్ నుండి ఇస్తున్నారు ఇది తప్పు.

ఎలా కట్టినా సెప్టిక్ ట్యాంక్ లు రెండేళ్ళు ఏమీ ఇబ్బంది పెట్టవు. తర్వాత పైన వ్రాసిన సమస్యలు వస్తాయి.

విపరీతమయిన దుర్గంధం వస్తుంది. షీట్స్ ఫ్లెష్ అవవు. అనేక సమస్యలు వస్తాయి. ఇల్లు ఖాళీ అవుతాయి. (ఈ సమస్యల కారణం గా ఎప్పుడూ ఖాళీ ఉండే ఇల్లు నాకు తెలుసు)

కనుక కొన్ని నియమాలు పాటిద్దాం.

ట్యాంక్ గోడల నిర్మాణం జరిగాక  లోపలి కొలతలు  కనీసం 3” పొడవు 9” ఉండేట్టు చూసుకోవటం మంచిది. కింద పెద్ద కంకర (PCC 1:4:8) వేశాక, గోడలు ఇటుక తో 9” మందం కట్టటం ఉత్తమం. మధ్య గోడలు 4” మందం కల్లుకోవచ్చు. వీలుంటే గోడలని చిట్టెం రాళ్ళు (బాగా కాలిన ఇటుకరాళ్ళు) తో గాని సువ్వలతో కూడిన కాంక్రీట్ గాని వాడండి. లీక్ ప్రూఫ్ మెటీరీయల్ వాడి అంతా కళాయి పూత చేసుకోవాలి.

టాయ్లెట్ నుండి వచ్చే excreta టాంక్ లోనికి వదిలే పైపు చివర టి ఆకారం లో ఉండాలి. దానికంటే దిగువ భాగాన డ్రైనేజ్ పైపు కనెక్ట్ అయి ఉండాలి. (డ్రాయింగ్ చూడండి) మూడు అరలుగా ఉన్న ట్యాంక్ మొదటి అర లో దీన్ని అమర్చాలి. ఈ అర కి manhole ఏర్పాటు ఉండాలి. ఈ అర నిండిన తర్వాత నీరు మాత్రమే రెండో అరలోకి వస్తుంది.  రెండూ మూడు ఆరల మధ్య ఉండే గోడ water seal లాగా పని చేస్తుంది. కేవలం మురుగు నీటిని మాత్రమే డ్రైన్ లోకి వదిలేస్తుంది. రెండు పైపుల పై భాగం నుండి ట్యాంక్ మూత వరకు కనీసం 6” లేదా అడుగు బఫర్ ప్లేస్ ఉండాలి బఫర్ ప్లేస్ నుండి గాలి బయటికి వెళ్ళే వెంట్ పైప్ ని అమర్చుకోవాలి.

చుట్టూ ఎక్కడా లీక్ అనేది లేకుండా పూతపని చేసుకోవాలి. తక్కువ స్థలాల్లో నిర్మిస్తున్న ఇళ్లకు సెప్టిక్ ట్యాంక్ నుండి బోరు వాటర్/ రైన్ వాటర్ గుంటకి  మధ్య దూరం ఉండటం కష్టం అవుతుంది. ఆలాటప్పుడు సెప్టిక్ ట్యాంక్ దుర్గంధం వీటిలో చేరుతుంది. క్రమీణా నీరు కంటామినేట్ అయ్యి ఇంటిల్లపాది రోగాల బారి పడతారు.

అత్యంత ముఖ్యమయిన ఈ సెప్టిక్ ట్యాంక్ నిర్మాణాన్ని అశ్రద్ద చేసుకోవద్దు అని చెప్పటం ఈ పోస్ట్ ఉద్దేశం.

ఇప్పుడు కట్టే నిర్మాణాలలో toilet, washrooms, powder room, WC ఇలా ఎన్ని పేర్లు పెట్టినా మరుగుదొడ్లు మొత్తాన్ని కలుపుతూ manholes ఏర్పాటు, పైపులు సరైన వాటం తో ఏర్పాటు చేసుకోవటం, ఎల్బో బెండ్లు కాకుండా లాంగ్ బెండ్ లు, సాధ్యం కానీ పక్షం లో డోర్ ఎల్బో లు వాడటం లాటి జాగర్తలు తీసుకోవాలి. నాణ్యత తక్కువగా ఉండే అపార్ట్మెంట్లు ఉన్నవారికి నేను వ్రాసిన అనుభవాలు తెలిసే ఉంటాయి. (సింగల్ వెంట్ ఫ్లాట్ తీసుకోకూడదు)

ఉపసంహారం.: పాత ఇల్లు టాయ్లెట్ నుండి దుర్వాసన వస్తూ ఉంటే, ఒక పది కేజిల కల్లు ఉప్పు తీసుకుని, బకెట్ నీళ్ళలో వేసి ఒక్కసారిగా టాయ్లెట్ షీట్ లో పోయండి. పది పన్నెండు గంటలు టాయ్లెట్ వాడకండి.

ఆ తర్వాత ట్యాంక్ క్లీన్ చేయించడానికి కొన్నాళ్లు టైమ్ తీసుకున్నా పర్లేదు. ఖచ్చితం గా ఫలితం ఉంటుంది.

Published by Sreenivasarao Sunkara

Civil Engineer, Writer, and now a Grand father

Leave a comment

Design a site like this with WordPress.com
Get started