ఒక బ్రహ్మానందాన్ని ఒక కోవై సరళ లాటి పెళ్ళాం ఒక ఫైన్ మార్కింగ్ ఎగిరి తన్నింది. డామినేషన్ సమానహక్కులు లాటి సమస్య. మూగ దెబ్బలు. పైకి మామూలుగానే ఉంటుంది కానీ లోపల రచ్చ..రంబోలా
న్యాయపరంగా కేసు తేల్చుకోవాలని ఫిక్స్ అయ్యి, దగ్గర్లోని పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు.
కంప్లయింట్ వ్రాసి ఇవ్వగానే “రోజు కి ఇలాటివి సవాలక్ష కేసులు వస్తుంటాయి. సర్దుకుని పోతుండాలి” అని చెప్పి పంపేశారు. సమస్య తీవ్రత వాళ్ళకి అర్ధం కాలేదు.
అలానే కుంటుకుంటూ వెళ్ళి సిబిఐ ఆఫీసు కి వెళ్ళాడు. అక్కడ అతన్ని కూర్చోబెట్టి కంప్లైంట్ తీసుకున్నారు.
కేసు రిజిస్టర్ అయ్యింది.
“పదండి సీన్ re create చేద్దాం చెప్పాడు” ఒక అధికారి
..

..
లేదండీ .. నేను కేసు డ్రాప్ చేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా గుర్తుచేసుకుంటే అసలు మా సరళ కొట్టిన దెబ్బల కావు ఇవి. పొద్దుటే పాల పేకెట్ కోసం రోడ్డు మీద సైకిల్ తొక్కుకుంటూ వెళ్తుంటే బురదలో జారీ పడ్డాను అంతే..
