నామకరణ

శాస్త్రి గారూ బాగున్నారా? శ్రీనివాస్ గారా .. బాగున్నాను. ఫోన్ లిఫ్ట్ చేస్తే ఏం అశుభం వినాల్సివస్తుందో, అనాల్సివస్తుందో అనే భయం. మిమ్మల్ని ఒకసారి కలవాలి. “ఏంటి విశేషం?” “పిల్లలకి పేరు పెట్టాలి.” “ఆహా మీ పని భేషుగ్గా ఉంది. మనవళ్లు, మనవరాళ్ళు తో మంచి కాలక్షేపం.” “మరే.. సాయంత్రం రమ్మన్నారా?” “రావటాలు ఏమీ పెట్టుకోకు. అంతా ఆన్లైన్ లోనే. మొన్న మా ఇంటావిడకి చెవి పోటు వస్తే డాక్టర్కి ఫోన్ చేశాం. ఒక app చెప్పాడు.Continue reading “నామకరణ”

దోసకాయ కి ఫేషియల్.!!

ఈ మధ్య బ్లాగ్ పని లో పడి సరిగా పట్టించుకోలేదు గాని మిద్దె తోట లో కొన్ని వర్ణ వివక్షలు మొదలయ్యాయి. మొదటి నుండి పంపకాల  ప్రకారమే ఇంటావిడ మా ఇంటి ముందు ఉన్న స్థలం లో పెరటి మొక్కలని, నేను మిద్దె మీద కుండీల పెంపకాన్ని పంచుకున్నాం. మొన్నీ మధ్య వర్షాల తర్వాత, ఆకు కూరలు ముఖ్యంగా పాల కూర  అంత ఫ్రెష్ గా రావటం లేదు. కొంచెం ముడుచుకున్నట్లు గా ఉంటుంది. టమోటా, మిర్చిContinue reading “దోసకాయ కి ఫేషియల్.!!”

పెరటి కూర

“కూర బాగుందా?” అని వంటింట్లో నుండి రెండో సారి ప్రశ్న వస్తే ‘అద్బుతం‘ అని చెప్పాలి వివేకవంతులు ఎవరయినా సరే. శ్రావణ మాసం మొత్తం లో తనకోసం ఏమీ కొనలేక పోయారనుకోండి. ఇంకా రెండు మూడు డైలాగుల స్లాట్ ఉంటుంది.మీకు. “మన కుండీ ల్లో పెంచిన కాయ కూరల రుచే వేరు. అమృతం అనుకో. బజార్లో # ఆర్గానిక్ అని అమ్ముతారు కానీ అంత కరెక్టు కాదు. మనం పెంచుకున్న కూరల రుచే కాదు ఆరోగ్యం కూడా..” అని చెప్పారనుకోండి.Continue reading “పెరటి కూర”

మేకప్ ఆర్టిస్ట్ కావలెను.

మా రెండో అమ్మాయి పెళ్లి కి వర్క్ చేసిన వీడియోగ్రాఫర్ ఫోన్ నెంబరు తీసుకుంది ఈవిడ రహస్యం గా.. మా వాడిని చూస్తూ, నా ఎడం చెయ్యి మధ్యవేలు వెనక్కి విరిచి టక్కు న శబ్దం చేసాను. వాడు కుడి చెయ్యి తో గడ్డం గీక్కున్నాడు. మీకు అయోమయం గా ఉండొచ్చు.. జేమ్స్ బాండ్ సినిమాలు కాలేజి ఎగ్గొట్టి చూసిన వాళ్ళకి తేలిగ్గానే అర్ధం అవుతాయి. సాయంత్రానికి మా వాడు నేను ఇద్దరం ఇమో లో కనెక్ట్Continue reading “మేకప్ ఆర్టిస్ట్ కావలెను.”

CPU కుండీ !

“మనిద్దరం అలుక్కున్నాం. గుర్తుందా ఆ విషయం?” అద్దం వైపు చూస్తూ అంది ఆవిడ. “అలుక్కున్నప్పుడు మాట్లాడుకోరాదు. అసలు బేసిక్ గా మగాళ్లు దిగులు మొహాలతో బ్రహ్మానంద పడే కాలం అదే.” “ఇంట్లో ఆడమనిషి మనిషి అలిగితే ఏమీ కష్టం లేదంటారు?” “ఎంత మాట? దిగులుగా, లోకం అంతా చీకటయినట్లు, గడ్డం చేసుకోకుండా, బిక్కమొహం తో కనిపించడం ఎంత కష్టమో తెలుసా?’ “అబ్బా.. ఛా.” “అసలు పెళ్లి మంత్రాల్లోనే అనేక జాగర్తలు చెబుతాడు పురోహితుడు. ఏ ఐమూల చూపుContinue reading “CPU కుండీ !”

పంపకాలు

అంబానీ ఆస్తులని అరగంటలో పంచొచ్చు గాని అక్కూర కుండీలని పంచడానికి పెద్ద పంచాయితీ పెట్టాల్సివచ్చింది. అసలు ఈ ఇంటెర్వెల్ బాంగ్ కి ముందు చిన్న కధ ఉంది. నిన్న తోటకూరని గుర్తు పట్టలేక శాపగ్రస్తుడిని అవటం తోటకూర పోస్ట్ తర్వాత… నిన్న సాయంత్రం, ఒకటి రెండు సార్లు ఫోన్ లో మనకి కావల్సిన మనిషి సిద్దంగా ఉండటం కన్ఫర్మ్ చేసుకుని గుండమ్మ ..తో బంగారం అంగడికి బయలుదేరా.. కారు ఫర్లాంగ్ దూరం వెళ్ళి ఆగి పోయింది. “గేరుContinue reading “పంపకాలు”

తోటకూర

గోంగూర, మెంతి కూర మీద నాకు మంచి పట్టుంది. క్లోస్, మిడిల్, లాంగ్, జూమ్ ఏ షాట్ అయినా సరే ఇట్టే గుర్తు పట్టగలను. నా మీద కోపం ఉన్నప్పుడు మిగతా వాటిలో ఎదో కూర రెండు కట్టలు బేరం ఆడి తెమ్మని పురమాయిస్తుంది మా గుండమ్మ.”నీకు తెలుసుగా నేను ఆకు కూరలని గుర్తు పట్టలేను.” వీలయినంత బేలమొహం పెడతాను.”అదేం కుదరదు. పాలకూర, తీసుకొని, చుక్కాకు కూర, తెల్ల తోటకూర కట్ట, మెంతి కూర తీసుకు రండి.Continue reading “తోటకూర”

Create your website with WordPress.com
Get started