కుక్క కరిచింది

తెల్లవారు ఝామున మంచం పక్క ఏదో శబ్దానికి అతనికి మెళుకువ వచ్చింది. టి వి రిమోట్ క్రింద పడ్డ శబ్దం . మంచి నిద్రలో ఉన్న అతను లేచి దుప్పటి తొలగించాడు. మళ్ళీ నిద్రలోకి జారుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే వాష్ రూము తలుపు శబ్దం వచ్చేట్టు తెరుచుకుంది. మరో రెండు నిమిషాలకి బెడ్ రూములో ట్యూబ్లైట్ వెలిగింది. ఇంటావిడ హాల్లోకి వెళ్ళి వాళ్ల అమ్మతో చిన్నగా (అంటే అతనికి గట్టిగా అని అర్ధం) మాట్లాడసాగింది. అతన్నిContinue reading “కుక్క కరిచింది”

మన్మధరావు

పసుపు పచ్చ చొక్కా మీద ఆకుపచ్చ పూలు ఉన్న లూజు షర్ట్ వేసుకుని, అనేక రంగుల బర్ముడా వేసుకుని నెత్తిన టోపీ పెట్టుకుని కొబ్బరి బొండం లో కలుపుకున్న ద్రవం సిప్ చేస్తూ గోవా లో బీచ్ లో కూర్చుని ఉన్నాడు మన్మధరావు. పది నిమిషాల నుండి తననే గమనిస్తూ, ఒక పాతిక నిండని బ్యూటీ ఎదురు టేబుల్ వద్ద కూర్చుని ఉంది. చక్కటి పలు వరస. చక్కటి శరీరం. కాన్ఫిడెంట్ గా చూపులు. ఫోర్క్ తోContinue reading “మన్మధరావు”

పందికొక్కు

మూడు రోజుల నుండి పంది కొక్కు సమస్య చర్చకి వస్తూనే ఉంది. మొదటి రోజు పప్పీలా గా ముద్దుగా ఉండే ప్రస్తావన, రెండో రోజుకి వేట కుక్క అయి మూడో రోజుకి చిరుత గా మారుతుంది. గ్రౌండ్ ఫ్లోర్ లో కుండీలలో మట్టి తోడటం, మెట్లు మీద నానా చెత్త వదలటం, సీసా లో నుండి వచ్చిన భాష తెలియని చైనీస్ పొగ భూతం లాగా తలుపు తీయగానే చెప్పుల స్టాండ్ నుండి గబాలున దూకటం …Continue reading “పందికొక్కు”

మాల్ కల్చర్

“చిన్నప్పుడు పచారీ కొట్టుకి పావు కేజీ కందిపప్పుకి వెళ్తే అదొక్కటే తెచ్చేవాళ్లం. ఈ దరిద్రపు మాల్ కల్చర్ వచ్చింది అడ్డమైన నానా చెత్త కొంటున్నాం. కందిపప్పు తప్ప.” ఆవిడ కూర్చోగానే గేరు మారుస్తూ చెప్పాను. “మాల్ కి వెళ్ళే ప్రతిసారి నీ మొదటి డైలాగ్ ఇదే” అంది. “అబ్బే అవసరమయినవి మాత్రమే కొంటావు అనుకో..నీ విషయం కాదు. జనరల్ గా చెబుతున్నాను.” అది జనరల్ కాదని ఇద్దరికీ తెలుసు. ఏసి ఆన్ చేసినా కారు లో వేడిContinue reading “మాల్ కల్చర్”

సత్తు గిన్నెల కారేజి

కొంత కాలం క్రితం ..ఒక ఆదివారం ఉదయాన్నే….ముందస్తు ప్రణాళిక ప్రకారం నేను ,పోకూరి వేంకటేశ్వర రావు (ఈతరం పిక్చర్స్ నిర్మాతలలో ఒకరు )మద్దిపాడు మండలం, రాచవారి పాలెం గ్రామనికి ఉదయం ఎనిమిది కల్లా చేరాము..అక్కడ సిద్దంగా ఉన్న ఒక మద్యవర్తి ని కలుపుకుని.ఒక చిన్న హోటల్ లో టిఫిన్ చేశాంబొలారోని ఊరి చివర అవకాశం ఉన్నంత వరకు వెళ్ళాక ఒక చెట్టు కింద వదిలేసి ..కాలి నడకన బయలు దేరాము..సబుకు తోటలు, చుట్టూ, తిప్పుతూ ,, .చేతిContinue reading “సత్తు గిన్నెల కారేజి”

రెండు మాటలు

గ్రామ సచివాలయం మిగులు పోస్టులకు ఆదివారం నుండి పరీక్షలు జరుగుతున్నాయి.ప్రశ్న పత్రాలు 8 ఒక సెట్ గా ప్రత్యేకమయిన బాగ్ లో వస్తాయి. గట్టిగా ఉంటాయి. ఉదయాన్నే 7.30 కి వెళ్లి రెండు సెషన్ల డ్యూటీ చేసుకుని ఇంటికి వచ్చేసరికి సాయంత్రం ఎనిమిదయ్యింది. గేట్ తీసుకుని లోపలికి వస్తుంటే, “తీసుకొచ్చావా?” అంది.”తప్పుతుందా?” “ఇంటికి తీసుకొస్తుంటే చిన్నతనంగా అనిపించింది.””గాడిద గుడ్డు కాదు? గ్రో బాగ్ ల కంటే ఇవే బాగుంటాయి.” చేదు మందు కి చక్కెర పూత పూస్తారుContinue reading “రెండు మాటలు”

తండ్రి- కొడుకు

పది / పన్నెండు యేళ్ళ ఆ పిల్లాడు వయసుకి తగినంత చురుగ్గా ఉండకపోవటం ఆ హోటల్ రిసెప్షనిస్ట్ గమనించాడు.రెండు రోజుల క్రితం వచ్చారా ఇద్దరు. ఒక తండ్రి బేలగా ఉన్న కుమారుడిని వెంటబెట్టుకుని.“ఒక రూము కావాలి. ఒక వారం పాటు ఉంటాం. హాస్పిటల్ పని మీద వచ్చాం”రెసెప్షన్ లో ఉన్నతను తండ్రి వివరాలు ఆధార్ వివరాలు నమోదు చేసుకుని రూమ్ బాయ్ ని పంపాడు.అప్పటి నుండి వాళ్ళిద్దరిని అతను గమనిస్తూనే ఉన్నాడు. అతనితో పాటు రూము బాయ్స్Continue reading “తండ్రి- కొడుకు”

మారే హరి రఖే కోన్ :: రఖే హరి మారే కోన్

ఒకాయన చనిపోదలుచు కున్నాడు.సేఫ్టీగా నాలుగంచెల పద్దతి ఎన్నుకున్నాడు…సముద్రం ఒడ్డున ఒక చెట్టుకి ఊరి బిగించుకుని,విషం తాగేసి పిస్టల్ తో నుదుటిన పేల్చుకున్నాడు.పిస్టల్ గురి తప్పి ఉరితాడు తెగింది.కిందపడి సముద్రం లోకి పరిగెట్టాడు.విషం మత్తు లోకి నెట్టేసింది…స్పృహ తెలిసే సరికి, రంభ ఊర్వశి లు బదులుగా జాలర్లు మాటలు వినబడ్డాయి…“ఈడు బతికే ఉన్నాడురోయ్.. సముద్రం ఉప్పు కడుపు ఖాళీ చేయించింది”***మరోకాయన అసలు చావదల్చుకోలేదు..‘ఈత కల్లు’ కోసం వెళితే మృత్యువు ఎదురొచ్చింది…బర్రున తిరిగొచ్చి మిత్రుడిని కారు అప్పడిగాడు.“నేను అమరావతి పారిపోతున్నాను.Continue reading “మారే హరి రఖే కోన్ :: రఖే హరి మారే కోన్”

తర్జుమా

వేగంగా వెళ్ళే కారు కి పెట్రోలింగ్ వెహికల్ అడ్డుగా వచ్చింది.పెద్దావిడ డ్రైవింగ్ చేస్తుంటే పక్కనే ముసలాయన కూర్చొని ఉన్నాడు. “స్పీడ్ లిమిట్ దాటి నట్టున్నారు?” అన్నాడు పెట్రోలింగ్ పోలీస్ అధికారి హింది లో.అవిడ ‘ఏమంటున్నాడు?’ అంది భర్త తో.“నువు వేగంగా వెళ్తున్నావని అంటున్నాడు”“మీ లైసెన్స్ చూడొచ్చా?”ఆవిడ మళ్ళీ పెద్దాయన వైపు తిరిగింది. తెలుగు లోకి తర్జుమా చేశాడీయన.“ఓహ్ మీ నేటివ్ ఆంధ్ర లో ఒంగోలా? అక్కడ మా దూరపు బందువు ఒకావిడ ఉండేది. బహు గయ్యాళిది.” డ్రైవింగ్Continue reading “తర్జుమా”

సున్నితమయిన సమస్య

ఆఫీస్ అవర్స్ ముగిసేటప్పుడు పర్సనల్ నెంబరు మోగింది.డాక్టర్ విజయ్.. నా మిత్రుడు, డెంటిస్ట్.“ఇప్పుడు రాగలవా? నీ RCT క్లోజ్ చేస్తాను.”“రేపు అనుకున్నాం కదా?”“రేపు నైట్ బ్యాంకాక్ వెళ్తున్నాను. మరో వారం దొరకను”“ఒక్కడివేనా?”“అవును. వస్తున్నావా?లేదా?”“వస్తున్నాను. గంటలో అక్కడ ఉంటాను. బైక్ తీసుకుని వస్తాను”సబ్ స్టాఫ్ కి చెప్పి బయలుదేరాను.మరో అరగంట దూరం లో ఉన్నప్పుడు SE గారి టెలీ కాన్ఫరెన్స్ మొదలయ్యింది.ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వింటూ అక్కడికి చేరాను…తన రూం లో మరో కుర్రాడు కూడా ఉన్నాడు. అతనేContinue reading “సున్నితమయిన సమస్య”

Create your website with WordPress.com
Get started