అసలు పేమ అంటే ఏంది బిడ్డా ???.

మేమంతా మట్టిలో దొర్లాడాము. పేడలో పోర్లాడాము.ఏం తిన్నామో గుర్తులేదు. ఏమి కట్టుకున్నామో కుడా గుర్తులేదు.పాకల్లో ఉన్నాం. గోడల సావిట్లోనే పడుకున్నాం.నువ్వు పుట్టాకే పాకా  వేసుకున్నాం. పేగు తెంచుకుని రక్తం పంచుకుని పుట్టిన నిన్ను క్రిష్ట్నుడిలా పెంచుకున్నాం.నువ్వు దోగిన నేలమీద పట్ట వేసుకుని పడుకున్నాం. నువ్వు తిని వదిలేసినా తిండే మేము తిన్నాం.పండక్కి రంగు రంగుల చొక్కాలు తోడిగాం. తిరునాళ్ళకి మెడ మీద కూచోబెట్టుకుని ఊరంతా తిప్పాం .నువ్వు ఆడింది ఆట. పాడింది పాట. నీకు నలతగా ఉంటె ఎన్ని దినాలు అమ్మతల్లికిContinue reading “అసలు పేమ అంటే ఏంది బిడ్డా ???.”

Create your website with WordPress.com
Get started