36 అట్టపెట్టెలో పాము

ఆయన అపనమ్మకంగా చూసి కేబిన్ బయట నాగేంద్రదేవ్ అని సబ్ ఎడిటర్ ఉంటారు కలవండి అన్నాడు. నేను ఆయన్ని కలిశాను. ఒక న్యూస్ ప్రింట్ పాడ్ ని నా వైపు నెట్టి, ‘ఏమయినా రాయండి’ అన్నారు. నేను అక్కడే ఆయన ఎదురుగా కూర్చుని “తెలుగువాడు” అనే చిన్న కొమెక (కొస మెరుపు కధ) వ్రాశాను.  బీరువాలోంచి ఒక పాడ్ లో కట్టిన నా చేతివ్రాతతో ఉన్న కధని తీసి నావ్రాతతో సరి చూసుకుని “మీ ఈ జన్మకిది చాలుContinue reading “36 అట్టపెట్టెలో పాము”

35 ఎడిటర్ ని కలిశాను

పల్లెటూర్లలో వేడుకలకి షామియానాలు వేసేటపుడు నాలుగు మూలలా వెదురు బొంగుని నిలబెట్టి దానిని స్తిరంగా ఉంచడానికి తాళ్లు కడతారు. అలానే మేం ఎక్కివచ్చిన లిఫ్ట్ ని స్తిరంగా ఉంచడం కోసం రెండు తాళ్ళు ఏటవాలుగా కట్టి ఉన్నాయి. నేలవైపు వెళ్తున్న సవారి శరీరం సరిగ్గా ఆతాడుకి తాకింది. సర్కస్ లో నెట్ మీద కళాకారులు గాలిలోకి లేచినట్లు అతను తిరిగి గాల్లోకి లేచి ఈసారి సరిగ్గా ఎటు చూసినా పదిఅడుగులు మించని నీటితొట్టిలో పడ్డాడు.మేమెవరం జరుగుతున్నది గ్రహించే స్తితిలో లేము.Continue reading “35 ఎడిటర్ ని కలిశాను”

33 హెయిర్ కట్

అలసిన సాయంత్రాలు కి ఆటవిడుపుగా TVలో వచ్చే బునియాద్, బంకేష్ బక్షి లాటి సిరియల్స్ దూరదర్శన్ ప్రైమ్ టైమ్ లో ఇరగదీసేవి. నా రూములో మంచం మళ్ళీ మళ్ళీ విరిగిపోయేది. మంచం విషయం ఏ‌ఓ ఆదినారాయణ గారితో చెప్పటం, ఆయన నన్ను ఎగాదిగా చూడటం ఎందుకని నేలమీద చాప వేసుకుని పడుకోవటం మొదలెట్టాను.పగలంతా పనిచేసి వచ్చాక, ఫ్రెష్ అయి భోజనం చేసి పడుకుంటే ప్రాణం ఎటో వెళ్ళి పోయేది.ఎంత టోపీ వాడినా, తలంతా సిమెంటు, దుమ్ముతో నిండిContinue reading “33 హెయిర్ కట్”

30 మంచం విరిగింది

చిటికినవేలు కన్నా తక్కువ పరిమాణంలో ఉండే డిటోనేటర్లు, సన్నటి వైర్లు ద్వారా ఒక చోటకి చేర్చి మరో బాటరీ సర్క్యూట్కి కలిపి ఉంచుతారు. చాలా సినిమాల్లో చూపించినంత ఘోరంగా, (సైకిల్ పంపు గట్టిగా కొట్టినట్లు) ఉండదు బ్లాస్టింగ్ అంటే. చాలా సింపుల్. మన బెండకాయ స్విచ్ వేసినంత సింపుల్. కానీ దాని పరిణామం మాత్రం చాలా పెద్దది. కొండరాయి గుండె పగిలి బీటలు వారొచ్చు లేదా ధుఖం తన్నుకు వచ్చినట్లు పగిలిన ముక్కలు ఎంతో దూరంలో పడొచ్చు. బాగాContinue reading “30 మంచం విరిగింది”

27 నన్న మగనే .. యు మూవ్డ్ మీ

మేము నుంచున్న దగ్గర కుడివైపున ఫ్లాట్ ఫామ్ మీద అమ్ముతున్న బూట్లు చూసి ప్రాణం లేచి వచ్చింది. సండే షాపులు శలవు కనుక ఎలా కొనటమా? అని ఆలోచిస్తూ ఉన్నాను. ఒక ప్లాస్టిక్ కారి బాగ్ కాలికి సాక్స్ లాగా వేసుకుని అక్కడున్న బూట్లు తొడుక్కుని సైజు చెక్ చేసుకుంటుంటే ‘మణిమారెన్’ దగ్గరకి వచ్చి ‘ఎక్కువ మందికి ఎడమకాలు పెద్దదిగా ఉంటుంది. ఆ కాలుకి కంఫర్ట్ గా ఉండే బూటు ని సెలెక్ట్ చేసుకోవాలని’ చెప్పాడు. నేను అతని సలహాతోContinue reading “27 నన్న మగనే .. యు మూవ్డ్ మీ”

20 గుస… గుస

ఎవరికయినా ఎదగడానికి పనికివచ్చేంత అసంతృప్తి, ఆనందంగా ఉండటానికి సరిపడే తృప్తి అవసరం. ఇవి సరైన పాళ్లలో ఉన్నపుడే బి.పిలు, షుగర్లు కొంత దూరంగా ఉంటాయి. అసంతృపిని గెలిపించి శుక్రవారం ఇంటర్వ్యూకి వెళ్ళటానికి నిర్ణయించుకున్నాను. మూడు బస్సులు మారి ‘శరవణా కంస్ట్రక్షన్’ ఆఫీసుకి వెళ్ళే సరికి చప్పగా తడిచి పోయాను. ఒక కవర్లో సర్టిఫికేట్లు జిరాక్స్ కాపీలు భద్రంగా తీసుకెళ్లాను. బెంగుళూరు వాతావరణం తమాషాగా ఉంటుంది. పెటేల్మని ఎండ కాస్తుంటుందా, బస్సు ఎక్కి మరో పాయింట్ లో దిగే సరికి జోరున వర్షం కురుస్తుంటుంది.Continue reading “20 గుస… గుస”

14. నాను బెంగుళూరు బందిదిని

సరిగ్గామధ్యాహ్నంభోజనం టైమ్కి బెంగుళూరు చేరింది బృందావన్ ఎక్స్ ప్రెస్. మరో అరగంట తర్వాత తిరిగి మద్రాస్ వెళ్లిపోతుంది. బెంగుళూరు రైల్వే స్టేషన్ , బస్ స్టాండ్ దగ్గరదగ్గరగా ఉంటాయి. ఒక ఫ్లై ఓవర్ మీదుగా ఈజీగా స్టేషన్ నుండి బస్ స్టాండ్ కి రావచ్చు. మొత్తం ఆ ఏరియాని ‘ మెజెస్టిక్ ‘ అంటారుట. ముందు రోజు గూడ్స్ లో బుక్ చేసిన ఇండ్ సుజికి బండికోసం పార్సిల్ ఆఫీసుకి వెళ్ళాం. ఎల్‌ఆర్ కాగితాలు చూపించి పార్సిల్ ఆఫీస్ నుండి దాన్ని హాండ్ఓవర్ చేసుకున్నాం. పాకింగ్Continue reading “14. నాను బెంగుళూరు బందిదిని”

Create your website with WordPress.com
Get started