Design a site like this with WordPress.com
Get started

పులిహోర

మహానాడు కి వచ్చిన జనం పలచగా ఉన్నచోట/ ఖాళీ కుర్చీల ఫోటోలు తీసుకుని, తనకి కావల్సిన స్టఫ్ సేకరించుకుని బైక్ మీద తన ఊరు బయలుదేరాడు రాకేశ్.. ఏడు దాటింది. చీకటి ముసురుకుంటూ ఉంది. వెన్నెల వెలుగు రాబోతుంది. మరో ఆరు కిలోమీటర్లు ప్రయాణం ఉండగా పాలేరు బ్రిడ్జ్ మీద మలుపులో ఒక అమ్మాయి అనుమానాస్పదంగా తచ్చట్లాడటం గమనించాడు. కొద్ది దూరం ముందుకి వెళ్ళి తిరిగి వెనక్కి వచ్చాడు. బండి ఒక పక్క పార్క్ చేసి తానూContinue reading “పులిహోర”

కుక్క కరిచింది

తెల్లవారు ఝామున మంచం పక్క ఏదో శబ్దానికి అతనికి మెళుకువ వచ్చింది. టి వి రిమోట్ క్రింద పడ్డ శబ్దం . మంచి నిద్రలో ఉన్న అతను లేచి దుప్పటి తొలగించాడు. మళ్ళీ నిద్రలోకి జారుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే వాష్ రూము తలుపు శబ్దం వచ్చేట్టు తెరుచుకుంది. మరో రెండు నిమిషాలకి బెడ్ రూములో ట్యూబ్లైట్ వెలిగింది. ఇంటావిడ హాల్లోకి వెళ్ళి వాళ్ల అమ్మతో చిన్నగా (అంటే అతనికి గట్టిగా అని అర్ధం) మాట్లాడసాగింది. అతన్నిContinue reading “కుక్క కరిచింది”

మన్మధరావు

పసుపు పచ్చ చొక్కా మీద ఆకుపచ్చ పూలు ఉన్న లూజు షర్ట్ వేసుకుని, అనేక రంగుల బర్ముడా వేసుకుని నెత్తిన టోపీ పెట్టుకుని కొబ్బరి బొండం లో కలుపుకున్న ద్రవం సిప్ చేస్తూ గోవా లో బీచ్ లో కూర్చుని ఉన్నాడు మన్మధరావు. పది నిమిషాల నుండి తననే గమనిస్తూ, ఒక పాతిక నిండని బ్యూటీ ఎదురు టేబుల్ వద్ద కూర్చుని ఉంది. చక్కటి పలు వరస. చక్కటి శరీరం. కాన్ఫిడెంట్ గా చూపులు. ఫోర్క్ తోContinue reading “మన్మధరావు”

ఉత్తరం/ తూర్పు ఏది మంచిది?

సాయంత్రం మన అయస్కాంత పరిది  లో వచ్చిన ఒక కొత్త మిత్రుడి ఇంటికి ‘టీ’ కి వెళ్ళాను. గ్రౌండ్ ఫ్లోర్ లో షాప్ లు కట్టి ముప్పై వేలు రెంట్ తీసుకుంటున్నాడు. మొదటి అంతస్తులో విశాలం గా కట్టుకున్న ఇంటి లో ఫర్నీచర్ కొనలేక పోయినందుకు బాదపడ్డాడు. ఒక పాప మెడిసిన్ (ఫ్రీ సీటు) సిద్దార్ధ, విజయవాడ లో, పిల్లాడు ఏయూ లో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. సెంటు 20/22 లక్షలు చేసే రోడ్ ఫేస్ 20Continue reading “ఉత్తరం/ తూర్పు ఏది మంచిది?”

టాటా సుమో

యూట్యూబ్ వీడియో లో కంటెంట్ ఎక్కడ మొదలవుతుందో చూసి కామెంట్ లో పోస్ట్ చేసే త్యాగరాజు లు మనకి తెలుసు. ఈ త్యాగరాజు లకి ఏమాత్రం తీసిపోని ‘మొనగాళ్లు’ మన చుట్టూ చాలా మంది ఉన్నారు. మా నియోకవర్గం లో ఇంచార్జ్ నాయకుడు ఈ పది రోజుల్లో నాలుగు సార్లు ఫోన్ చేశాడు. “మా వాడు వస్తాడు. ‘తన్నీరు మాధవి’ అనే పేరు కి ఇంటి బిల్లు ఇవ్వాలి.” అంటూ..పక్కనే ఉన్న మగ మనిషి ఎవరో ప్రాంటింగ్Continue reading “టాటా సుమో”

సాయం

ఎవరికయినా ఏదైనా ఇచ్చినప్పుడు ఎంతో ఆనందం గా ఉంటుంది. అది చెప్పేటం కుదిరేది కాదు.చీకట్లో మార్కింగ్ వాకింగ్ చేస్తూ, ఒక బక్కపలచ్చటి కుర్రాడికి జేబులో పర్సు, మెడలో గొలుసు ఇచ్చేసాను. పాపం ఎంత ఆనందపడ్డాడో బిడ్డ. ** చేతిలో బండరాయి విసిరేసి, కత్తి మడిచి జేబులో పెట్టుకుంటున్నప్పుడు అతని ఆనందం చూసి తీరాల్సిందే.

చపాతీ

మార్నింగ్ వాక్ కి వెళ్ళామా? మొన్న పర్సు గొలుసు ఒక బక్క పలచటి కుర్రాడికి దానం చేసిన విషయం మరి కొందరికి తెలిసింది. చెరువు గట్టు మీదే ఒక సమావేశం ఏర్పాటు చేశారు. పరామర్శించారు. ఇంటావిడ నా క్షేమం కోరి, జేబులో డబ్బులు చేతికి ఉంగరాలు కూడా పీకెసి మూతికి చిక్కం (మాస్క్) కట్టి బయటకి పంపిస్తుందని చెప్పేశాను. వంతుల వారీగా అల్లం టీ ఇప్పిస్తామని ప్రామిస్ లు చేసేశారు. పనిలో పనిగా “బార్యని కంట్రోల్ లోContinue reading “చపాతీ”

చిన్ననాటి స్నేహం

ఇప్పుడంటే గజిటెడ్ పోస్టు, ఓ పాతికమంది సబ్ స్టాఫ్ తో బుద్దిమంతయ్య లాగా బిల్ట్ అప్ ఇస్తున్నాగాని చిన్నప్పుడు చెడ్డీ రోజుల్లో మనం రికార్డ్ హోల్డర్ అనమాట. బాగా అల్లరి చేసే వయసులో పెద కొత్తపల్లి లో బచ్చాలు, ఓకులు, గోలీలు, కర్రా బిల్లా ఆటల్లో ఫేమస్ మనం.అప్పుడో చెడ్డీ దోస్త్ ఉండేవాడు ఖాసిం వలీ అనేది వాడి పేరు. ఇద్దరం కల్సి అనేకానేక కార్యక్రమాల్లో పాల్గొనేవాళ్లం. చింత తోపు కి వెళ్ళి కాయలు కోసే వాళ్ళం,Continue reading “చిన్ననాటి స్నేహం”

నవ్వుల రోజు

World Laughter Day నవ్వుల రోజు. ఒక ఇంటర్వ్యూ జరుగుతుంది.  రైల్వే సిగ్నల్ మెన్ పోస్ట్. ఇంటర్వ్యూ చేసే ఆయన తన అనుభవాన్ని అంతటినీ సిద్దం చేసుకుని ఉన్నాడు. అభ్యర్థి రానే వచ్చాడు. కొంత సాధారణ ప్రశ్నలు జరిగాక ఒకే ట్రాక్ మీద “రెండు ట్రైన్స్ ఎదురెదురుగా వస్తున్నట్లు తెలిస్తే ఏమి చేస్తావు ?”అన్నాడాయన. అభ్యర్థి కొంచెం ఆలోచించి “రెడ్ సిగ్నల్ ఇస్తాను.” “సిగ్నల్ పనిచెయ్యలేదు.” “లివర్ ఆపరేట్ చేసి ఒక ట్రైన్ ని లూప్ మీదికిContinue reading “నవ్వుల రోజు”

అలగా

ఆంజనేయులికి ఫోన్ చేసి షాప్ లో ఉన్నాడో లేడో కనుక్కుందాం అనుకున్నాను. తను మా ఆస్థాన హైర్ కట్టర్. :)పదిహేనేళ్ళ గా అదే షాప్ .. అంజయ్య రోడ్ లో ఒక ఆరామక్షేత్రం పక్కనే ఉన్న మునిసిపల్ కాలవ మీద ఉండే బార్బర్ షాప్ .. అబ్బా కొడుకులం అక్కడ కె వెళ్తాం.ఈ మధ్య కరోనా కాలం లో మా చిన్నమ్మాయి ట్రిమ్మర్ తో క్రాఫులు చేసేది. (మా చిన్నదానికి తెలియని విద్య ఉందనుకొను).ఫోన్ మీదికి చెయ్యేContinue reading “అలగా”