Design a site like this with WordPress.com
Get started

The great indian kitchen

ఒక మంచి సంప్రదాయ కుటుంబం. అత్త, మామ గారు, బడిపంతులు భర్త. మంచి సంభందం. అమ్మాయి అత్తగారి ఇంట్లో అడుగు పెడుతుంది. పెళ్లి హడావిడి తగ్గి బందు మిత్రులు మాయమయ్యాక .. వంట, వార్పు లో అత్తగారికి సాయం చెయ్యటం తో మొదలవుతుంది ఆమె ప్రయాణం. అత్త గారు గల్ఫ్ లో ఉన్న కుమార్తె ప్రసవానికి సాయం గా వెళ్తుంది. ఇక 360 డిగ్రీలు, వంట, సింకు, ఆమెకి. ఆఖరికి ఆమెని పడకటింట్లో తన చేతి వాసన,Continue reading “The great indian kitchen”

వేప సబ్బులు

మా మనమరాలు Deekshitha కి ఏడు నెలలు నిండాయి. ఇల్లంతా దోగాడుతుంది. అతి చిన్న వస్తువులని కూడా రెండు వేళ్ళతో పట్టుకుని నోట్లో పెట్టుకుంటుంది. ఎప్పుడూ ఎవరో ఒకరు వెనకాలే అంటిపెట్టుకుని ఉండాల్సి వస్తుంది. సమస్య ఏమిటంటే వంటి మీద చిన్న దద్దుర్లు వస్తున్నాయి. దీనికోసం ఒక ప్రయోగం చేశాం. అమెజాన్ లో గ్లిజరిన్ బెసేడ్ సోప్ బేస్ కే‌జి సుమారు గా 200-450 వరకు ఉంటుంది. అది ఆర్డర్ చేసి తెప్పించాం. ఇంటి ముందు పెద్దContinue reading “వేప సబ్బులు”

రెండు మాటలు

గ్రామ సచివాలయం మిగులు పోస్టులకు ఆదివారం నుండి పరీక్షలు జరుగుతున్నాయి.ప్రశ్న పత్రాలు 8 ఒక సెట్ గా ప్రత్యేకమయిన బాగ్ లో వస్తాయి. గట్టిగా ఉంటాయి. ఉదయాన్నే 7.30 కి వెళ్లి రెండు సెషన్ల డ్యూటీ చేసుకుని ఇంటికి వచ్చేసరికి సాయంత్రం ఎనిమిదయ్యింది. గేట్ తీసుకుని లోపలికి వస్తుంటే, “తీసుకొచ్చావా?” అంది.”తప్పుతుందా?” “ఇంటికి తీసుకొస్తుంటే చిన్నతనంగా అనిపించింది.””గాడిద గుడ్డు కాదు? గ్రో బాగ్ ల కంటే ఇవే బాగుంటాయి.” చేదు మందు కి చక్కెర పూత పూస్తారుContinue reading “రెండు మాటలు”

Lion – long way home

“మేము ఖాళీ పేపర్లం కాదుగా? మీ స్వంత బిడ్డలు మీకు ఉంటే బాగుండేది?” అని ఒక దత్త పుత్రుడు తల్లిని అడుగుతాడు. “తల్లి కాగలిగి ఉండీ, ఇంత ప్రపంచం లో అనాధ బిడ్డలకు కుటుంబాన్ని ఇవ్వాలని నా 12 వ ఏట అనుకున్నాను. నా ఆలోచన ని గౌరవించిన వ్యక్తినే వివాహం చేసుకున్నాను” అని ఆ ఆస్ట్రేలియా తల్లి దుఃఖం తో చెబుతుంది. గూడ్స్ రైల్లో బొగ్గులు సేకరించి టీ అంగడిలో ఇచ్చి బదులుగా పాలు తీసుకునిContinue reading “Lion – long way home”

మెట్రో కధలు

రివ్యూ లు వ్రాయటం చేత కాదు. ఖదీర్ బాబు మీద అభిమానం తో, సన మీద ఉన్న ఖిచ్ ఖిచ్ తో మెట్రో కధలు, (ఆగస్టు 15 2020 నా విడుదల aha ఫ్లాట్ ఫామ్) .. డౌన్లోడ్ చేసుకుని మరీ చూసాను. నాలుగు షార్ట్ ఫిలిమ్స్ కలిస్తే ఈ సినిమా.. మొదటిది ..1988 లో (స్రవంతి వార పత్రిక) నిర్మల అని ఇలాటిదే ఒక చిన్న కథ వ్రాసాను. సంపాదన ఉన్న #అందమయిన అమ్మాయికి మొత్తంContinue reading “మెట్రో కధలు”

ద్విభాషీ – పావులూరి శంకరనారాయణ శ్రేష్ఠి

ఇంగ్లీషువాడు సప్తసముద్రాలు దాటి వచ్చేశాడు.ముందు వ్యాపారం చేయడానికి… తరువాత అధికారం చెలాయించడానికి….వాడి భాష మనకి రాదు…వాడు “గాడ్ ఈజ్ గుడ్” అనేవాడు.మనకి అది “గాడిదగుడ్డు” గా అర్థమైంది.మనం “రాజమహేంద్రి” అన్నాం…వాడికి “రాజమండ్రి”లా వినిపించింది.మన మాట వాడికి అర్ధమయ్యేది కాదు… వాడి భాష మనకి బోధపడేది కాదు.వ్యాపారం, పరిపాలన వాళ్ల అవసరం కనుక తెల్ల అధికారులు ఒక్కొక్కరూ తెలుగు పదాలను పట్టుకున్నారు. డిక్షనరీలు తయారు చేశారు. 1818లో విలియం బ్రౌన్ తొలి తెలుగు – ఇంగ్లీషు డిక్షనరీ తయారుచేశాడు. 1821లో క్యాంప్ బెల్Continue reading “ద్విభాషీ – పావులూరి శంకరనారాయణ శ్రేష్ఠి”

పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ (ప్రకాశం, ఆంధ్ర ప్రదేశ్, ఇండియా)

ఒక పదేళ్ళ తర్వాత.. మన ఆంధ్ర ప్రదేశ్ లో, ప్రకాశం -కర్నూలు జిల్లాల లో మనిషి సాధించిన ఒకానొక ఇంజనీరింగ్ అద్బుతం గా చెప్పుకోగలిగిన ఒక గొప్ప నిర్మాణం…కృష్ణ నది శ్రేశైలం డామ్ ఎగువ రిజర్వాయర్ కి చేరే మలుపు వద్ద నుండి, 18.8 కిలోమీటర్లు దూరం కొండలని తొలుచుకుంటూ నలమల్ల సాగర్ రిజర్వాయర్ కి కేవలం గ్రావిటీ ఆధారంగా నీళ్ళు ప్రవహించేట్టుగా , రెండు సొరంగమార్గాలు నిర్మాణం భావితరాల దేవాలయం “పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్”ప్రకాశంContinue reading “పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ (ప్రకాశం, ఆంధ్ర ప్రదేశ్, ఇండియా)”

‘భాన్ గఢ్’ కోట

ఇది చాలా పెద్ద చర్చే….ఈ విషయంపై టీవీల్లో గంటలు గంటల పాటూ చర్చలు జరుగుతాయి. కెమెరాల ముందు దాదాపు మీదపడి రక్కుకున్నంత పని చేస్తారు మన మేథావులు. నాస్తికులకు ఈ విషయం చూయింగ్ గమ్ లాంటి నిత్య నాస్తా .ఎంత నమిలితే అంత సాగుతుంది.ఎంత వాగితే అంత కొనసాగుతుంది.ఇంతకీ భారత ప్రభుత్వం ఏమంటుంది?ప్రభుత్వం లెక్కల ప్రకారం అధికారికంగా దయ్యాలూ, భూతాలూ, శాపాలూ ఉన్నాయా?ఉన్నాయి!!!భారత ప్రభుత్వం దయ్యాలున్నాయని డిక్లేర్ చేసిందా?చేసింది!!!ఎప్పుడు? ఎక్కడ?ఆ సంగతి తెలుసుకోవాలంటే మీరు ‘భాన్ గఢ్’Continue reading “‘భాన్ గఢ్’ కోట”

చె ద లు

స్వంత ఇంటి నిర్మాణం చేసుకున్న వారికి లేదా ఫ్లాట్ లో ఉంటున్న వారికి బాగా పరిచయం ఉండే చికాకు ‘చెదలు’ చెదలు అంటే తెల్ల ఛీమలు అని వాడుకలో అంటుంటారు కానీ అవి చీమలు కావు. చెదపురుగులు సాంఘీకంగా (చీమల లాగా) జీవించే కీటకాలు. పని చేయటానికి. లార్వాలు పుట్టించడానికి, సైన్యం లా కాపలాకి, ఆహార పరిశోదనకీ, విడివిడిగా ఇవి పనులు కేటాయించుకుంటాయి. రాణి కీటకాలు, కూలీ కీటకాలు ఇక్కడకూడా సేమ్ టూ సేమ్. ఇవి ఎక్కువగాContinue reading “చె ద లు”