Design a site like this with WordPress.com
Get started

పార్సిల్

“హలో.. మేడమ్”“హలో .. ఎవరు?”“సుగుణ మేడమ్ గారెనా? ‘అమెజాన్’ నుండి మీకో పార్సిల్ వచ్చింది. పెద్ద అట్టపెట్టె. ““తీసుకు వస్తున్నారా?”“ COD మేడమ్ రెండువేల చిల్లర ఉంది.”“పర్లేదు తీసుకురండి. పే చేస్తాను”“ఇక్కడ కస్తూరి బా గర్ల్స్ స్కూల్ అని ఉంది. వెలుగొండ రూట్ లో ఉన్న స్కూల్ .. ఆదేగా?”“అవును. అక్కడే ఉన్నాను. తీసుకురండి”“సారి మాం కనీసం 18 కి మీ పైగా రావాల్సి ఉంటుంది. సర్వీస్ గిట్టదు. మీరు సాయంత్రం. టౌన్ లోకి వచ్చినప్పుడు తీసుకుంటారా?”“నేనయినాContinue reading “పార్సిల్”

2. ఎంత బాగుందో

నెలకి 400 రూపాయల జీతం. ఉండటానికి జబర్దస్త్ ఏకామిడేషన్.ఆ కేక …శీను గాడు/రోశయ్య పంతులు కొడుకు మద్రాస్ లో ఉద్యోగం అని ఊర్లో పేరు.నా సామిరంగా జీవితం ప్రారంభం అయింది. 9 ఫిబ్రవరి 1986 నుండి. నాతో పాటు అక్కడ మరో స్టార్టర్ పని చేస్తుండేవాడు. పేరు గుర్తులేదు. అతను ఇంజనీరింగ్ డిగ్రీ చదివాడు. పని మీద కంటే తన 500 రూపాయల జీతం గురించి ఎక్కువ మాట్లాడేవాడు. డి‌ఆర్‌డిఓ (Defence Reacher and Development Organization)Continue reading “2. ఎంత బాగుందో”

మెట్లు

నేనతన్ని అక్కడ చూస్తానని అస్సలు అనుకోలేదు. అది కూడా కోటూ, బూటూ వేసుకుని హుందాగా, భారీ స్తాయి మోసగాడి లాగా, ఎక్కడో కొట్టుకొచ్చినట్టున్నాడు. కొంత మంది బకారాగాళ్ళు చుట్టూ చేరి వాడు చెప్పేది ఆసక్తిగా వింటున్నారు. మధ్య మధ్యలో నవ్వులతో కలిపిన చలోక్తులు విసురుతున్నాడు. గాలానికి యెర వేసినట్లు..ఆర్డీవో గారి  వియ్యంకుడి కొడుకు పెళ్లి రిసెప్షన్ అది. సమాజం లో ఉన్నత వర్గం తో పాటు అధికార్లు, ప్రజా ప్రతినిధులు లాటి  వారితో పాటు ఫోర్త్వెంటీ  రాజీ గాడు నా కదేContinue reading “మెట్లు”

Mr X భాను ప్రకాష్

అయిదేళ్ళ వయసులో X అనే పిల్లాడికి ఒక పెద్ద ప్రమాదం ఎదురయ్యింది. తలకి బలమైన గాయం. అనేక సర్జరీలు అవసరం అయ్యాయి. ఆ గాయాల నుండి కోలుకుంటూనే అతను అబాకస్ మీద, ఫజిల్స్ మీద ఇంట్రెస్ట్ పెంచుకున్నాడు. చిన్న వయసులోనే SPI  అకాడమీ లో అబాకస్ లో నమోదు చేసుకుని  9th లెవెల్  విన్నర్ అయ్యాడు. ఇంటెర్నేషనల్ అబాకస్ అకాడమీ లో మూడు సార్లు విన్నర్ అయి లిమ్కా రికార్డు లు సాధించాడు. అప్పటి నుండి లెక్కల్లోContinue reading “Mr X భాను ప్రకాష్”

మట్టి గాజులు

అపర్ణ అటో దిగి ఫోన్ మాట్లాడుతూ…. ఎనిమిది అంతస్తుల అపార్ట్ మెంట్ ప్లాట్ లోకి వెళ్తూ ఉంటే, రోడ్డు మీద ‘తోపుడు బండి’ మీద మట్టిగాజులు అమ్ముతూ ఒక పదిహేను పదహారేళ్ళ పిల్ల కనిపించింది. ఒక్క క్షణం ఫోన్ మాట్లాడటం ఆపి రంగు రంగుల డిజైన్ గాజులు చూస్తుంటే… “ఇవి కొత్త గా వచ్చాయి అక్కా.. తళుకుల గాజులు నీకు బాగుంటాయి.” అంది ఆ అమ్మాయి. అపర్ణ ‘అక్కా’ అన్న ఆ పిల్లవయిపు.. తరువాత బండి మీద గాజుల వైపు చూసింది. గాజులు నిజంగానే బాగున్నాయి.Continue reading “మట్టి గాజులు”

విశ్వాసం.

జనవరి నెల 2015 గొంగోలి గ్రామం, ఉత్తర ప్రదేశ్.ఒక అనామక మహిళ ఆగ్రామం లో సంచరించడం, గ్రామస్తుల కంట పడింది. చాలా దయనీయమయిన పరిస్థితి లో ఉందావిడ. సరయిన తిండీ, బట్టా లేకుండా పిచ్చిదానిలా నీరసంగా ఉంది. ఏ వీది అరుగు మీదో చతికిల పడి ఎవరయినా ఏదయినా ఇస్తే తినటం మినహాయించి మరేమీ తెలియని స్థితి లో ఉంది. మనస్థిమితం కుడా సరిగా లేదు. ఆ గ్రామస్తులు ఆమెను ఒక చోట కూర్చోబెట్టి వివరాలు సేకరించేContinue reading “విశ్వాసం.”

తాళం

బాగా రద్దీగా ఉండే ప్రాంతం లో ఉన్న ఇరుకయిన దారులతో ఉన్న చిన్న చిన్న షాపుల సముదాయం.చెన్నై లో పారిస్ సెంటర్ ని గుర్తుకు తెస్తూ..ఒక్క దుకాణం లో ఒక్కో రకం వస్తువులు.కమర్షియల్ టాక్స్ ఆఫీసు లో పనిచేసే మాధవరావు ఆఫీసుకి కొత్తగా లీజు కి తీసుకున్న గోదాముకి  తాళాలు కొనటానికి వెళ్ళాడు. ఇస్మాయిల్ షాపు ఫేమస్ అని విని, ఫిక్షెడ్ రేట్లు కి   మన్నికయిన వస్తువులు దొరుకుతాయి అని వెతుక్కుంటూ వచ్చాడు.ఆఫీసుకి అవసరం అయినవి కొనిContinue reading “తాళం”

షార్క్ చేప

తాజా చేపలు అంటే జపనీయులకి చాలా మక్కువ.తీర ప్రాంతాల లో చేపలు సంవృద్ధిగా దొరకటం తగ్గిపోయింది.పెద్ద పెద్ద బోట్లు వేసుకుని సముద్రం లోపలికి వెళ్ళి రోజుల తరబడి వలలు వేసి తీసుకురావాల్సి న పరిస్తితి.కానీ ఇక్కడో చిక్కు వచ్చి పడింది. చేపలు తాజా గా ఉండటం లేదు.రెండు మూడు రోజులు సముద్రం లో వేట పూర్తిచేసుకుని బోట్లు ఒడ్డుకి కి చేరి మార్కెట్ కి వెళ్ళే సరికి….ఫిషింగ్ కంపెనీ లు బోట్లులో డీజిల్ జెనరేటర్ తో పనిచేసేContinue reading “షార్క్ చేప”

బండరాయి

రహదారి మార్గం లో ఒక పెద్ద బండరాయిని అడ్డుగా వేయించి చాటుగా గమనించసాగాడు రాజు గారు.“ఏం రాజు? ఏం పరిపాలనా? శిస్తులకే గాని ప్రజల పనులు పట్టించుకొని రాజ్యం లో ఉన్నాం మనం. ఖర్మ” అంటూ ఈసడించుకున్నారు ఆ మార్గాన పోతున్న వారు కొందరు.అదికారులు ఆ బండరాయిని చూసి హుంకరించారు. “ఎవరు ఈ పని చేసింది. కనుక్కుని కారాగారం లో ఉంచండి” హుకుం లు జారీ చేశారు.రాజు గారు వింతగా చూస్తున్నారు. కొద్దిగా శ్రమ పడి బాద్యతContinue reading “బండరాయి”

పరిగెత్తిన ముసలావిడ

మహారాష్ట్ర బుల్ఢానా జిల్లా లో ని ఒక చిన్న కు గ్రామం లో ఉండే 65 ఏళ్ల లతమ్మ (లతా భగవాన్ ఖరే) తన భర్త, ముగ్గురు ఆడపిల్లలతో జీవిస్తూ ఉండేది.ఆదంపతులు ముగ్గురి ఆడపిల్లకి పెళ్లిళ్లు చేశారు. ఏళ్ల తరబడి పొదుపు చేసుకున్న డబ్బు హరించుకు పోయింది. అందినంతవరకు చేసిన అప్పులు మిగిలాయి.కాయ కష్టం చేసి ఋణ విముక్తులు కావటానికి శ్రమిస్తున్న ఆ జంటకి అనుకోకుండా ఒక విపత్తు వచ్చి పడింది.దాని పేరు “అనారోగ్యం”ఒకరోజు  నలతగా ఉందని చెప్పాడు.స్థానికంగా అందుబాటు లో ఉన్న మెడికల్Continue reading “పరిగెత్తిన ముసలావిడ”