శుభాభినందనలు

85 మండి తాజా ఇంజనీరింగ్ పట్టబధ్రులకి మూడు గంటల రిఫ్రెషింగ్ సెషన్ ఇవ్వటం అంటే అంత మామూలు విషయం ఏమీ కాదు. అంతా యువ ఇంజనీర్లు…. ప్రతిభా పాటవాలతో పరీక్షలలో మెరుగ్గా రాణించి ఉద్యోగాల లోకి వచ్చిన వారు. అసలు అంతమంది యూత్ ని పిన్ డ్రాప్ సైలెన్స్ తో కూర్చోబెట్టి, వాటి అటెన్షన్ రాబట్టటమే ఒక గెలుపు. అనేక విషయాలు కొద్ది కొద్దిగా మాట్లాడాను. నా 33 ఏళ్ల అనుభవం తో తెలుసుకున్న అనేక విషయాలుContinue reading “శుభాభినందనలు”

గొడల్లో పగుళ్లు

మొన్నా మధ్య ఒక మిత్రుడు ఫోన్ చేశాడు. నిండా రెండేళ్ళు వయసున్న తమ ఇంటికి గొడల్లో వచ్చిన పగుళ్లు అతన్ని భయపెట్టాయి. మర్నాడు ఉదయాన్నే వీడియొ కాల్ చెయ్యమని అతన్ని ఇల్లంతా పరిగెత్తించాను. తీరా చూస్తే ఇంటి నిర్మాణం లో స్ట్రక్చర్ చాలా బాగుంది. ఫినిషింగ్ హడావిడిగా చెయ్యటం,కారణం గా గమనించాను. గోడ కి గాడి కొట్టి నడిపిన కంసీల్డ్ కరెంట్ ఆర్ వాటర్ పైప్ నడిపినప్పుడు, వాటిని తిరిగి మాలు తో పూడ్చేస్తారు. ఆ తరువాతContinue reading “గొడల్లో పగుళ్లు”

మాగ్నెటిక్ లాక్

పోయినవారం ఒక సేనియర్ సిటిజన్ మిత్రుడు ఫోన్ చేశాడు. తను కొత్తగా తీసుకున్న 3BHK కి కబోర్డ్లు చేయించాలని, సలహా/ సూచన కోసం. ఒంగోలు లో ఉన్న మంచి బిల్డర్ చేసిన వర్క్ అది. అబ్జెక్షన్స్ పెద్దగా లేకుండా నాణ్యంగా ఉంది. నన్ను చూసి బిల్డర్ విష్ చేశాడు. మాతో పాటు తానూ సెకండ్ ఫ్లోర్ కి వచ్చాడు. తలుపుల వర్క్ జరుగుతూ ఉంది. కొద్ది సేపు కప్ బోర్డు ల గురించి క్లారిటీ గా మాట్లాడుకున్నాక,Continue reading “మాగ్నెటిక్ లాక్”

row houses with low roof ‘ventilation solutions

ఇప్పుడంటే, బెడ్రూం లు దానికి ఆటాచ్ద్ వాష్ రూంలు, హల్లో పౌడర్ రూంలు అలవాటు అయ్యాయి కానీ మేము 1996 లో దరిశి లో నాలుగు గదుల నిలువు ఇంట్లో బాడుగకి ఉన్నప్పుడు ఇల్లు అంటే నాలుగు దరవాజాలు, ఒక కిటికీ ఉన్న రైలు లాటి నిర్మాణం. కామన్ గోడలు. హద్దుమీద నిర్మాణాలు. పక్క స్థలం వాళ్ళు అభ్యంతరం కారణం గా బయటవైపు పూతపని చెయ్యని గోడలు. అరికాయలు మాగెసే గదుల్లాటి ఇల్లు. ఎండాకాలం, లోపల గాలిContinue reading “row houses with low roof ‘ventilation solutions”

దద్దుర్లు / Efflorescence

కోస్తా ప్రాంతాల్లో, సముద్ర తీర ప్రాంతాల్లో ఏదైనా మిగిలిపోయిన ఫ్లాట్ కొంటానికి వెళ్ళండి. లేదూ నాలుగైదు ఏళ్లుగా ఉంటున్న ఫ్లాట్ కి వెళ్ళండి. ఫ్లోరింగ్ లో skirting పై భాగాన, తెల్లగా పౌడర్ లాగా ఒక ఉప్పు లాటి పదార్ధం తయారయి ఉండటం గమనించారా? గోడకి అంటించిన మేలు జాతి putty  (వాల్ కేర్) కి దద్దుర్లు వచ్చినట్లు, ఉబ్బలు ఉబ్బలుగా ఉండటం చాలా మందికి తెలుసు. దీన్ని సాంకేతికంగా efflorescence అంటారు. నిఘంటువు లో పుష్పగుచ్చముContinue reading “దద్దుర్లు / Efflorescence”

Toilet Sheets

బాత్రూమ్ లలో బిగించే టాయ్లెట్ షీట్లు రెండు/మూడు రకాలు ఉంటాయి. ఇండియన్ షీట్ : Indian Water closet IWC సాధారణం గా మనం చాలా కాలంగా వాడుతున్న పింగాణీ షీట్స్ ఇవి. రెండు కాళ్ళు మడతపెట్టి కింది కడుపు మీద వత్తిడి  కలిగేట్టు కూర్చునే ఈ భంగిమ సరైనది. మాలవిసర్జనకి కరెక్ట్ భంగిమ. ‘ఉపాసన’ కూడా ఈ మద్య కాలం లో ఇండియన్ Pan/Sheet లనే వాడమని కాంపైన్ చేస్తున్నారు.  ఈ షీట్ లని PContinue reading “Toilet Sheets”

Interlocking mud bricks

ఎర్రమట్టి విరివిగా అందుబాటులో ఉండి, అర ఎకరా పొలము, హాఫ్ ఇంచ్ వాటర్ సౌకర్యం ఉన్నచోట ఎవరైనా ఈ inter locking bricks యూనిట్ ప్లాన్ చేసుకోవచ్చు. ఎర్రమట్టి లో 8% సిమెంట్ కలిపి, తడిపొడిగా తడిపి వీటిని ఈ వీడియొ లో చూపిన విధం గా తయారు చేసుకోవచ్చు. నిర్మాణం లో తక్కువ మాలు పడుతుంది. పూతపని చెయ్యకపోయినా ఔట్సైడ్ ఎలివేషన్ ఎలిజెంట్ గా కనిపిస్తుంది. సింగల్ ఫేజ్ కరెంటు తో నడిచే ఈ మిషన్Continue reading “Interlocking mud bricks”

చిన్నిల్లు

చిన్నిల్లు అంటే భాగ్యరాజా చెప్పింది కాదు. 288 చదరపు అడుగుల్లో బీదవాడికి సరిపడే చిన్న ఇల్లు ప్లాన్. రాష్ట్ర ప్రభుత్వం ఒకటిన్నర సెంట్లు స్థలం లో 288 చదరపు అడుగుల్లో ఒక నమూనా ఇల్లు అక్కడక్కడా నిర్మించింది. యు ట్యూబు లో వీడియొ ల కింద అనేక అసంతృప్తి కామెంట్లు చూశాను. చివర్లో mm కొలతలతో రెండు తూర్పు వాకిలీ మరియు పడమర వాకిలి తో ప్లాన్లు గీసి ఇక్కడ ఉంచాను. ఇవి కోతమందికి నచ్చే అవకాశంContinue reading “చిన్నిల్లు”

Crinkle crankle wall

అలల ఆకారం లో,  పెద్ద పెద్ద తోటల చుట్టూ నిర్మించే రిబ్బన్ వాల్స్ గురించి విన్నారా. వీటిని crinkle crankle waal అనీ, ముడతల గోడ అని కూడా అంటారు.  మెలికలు మెలికలుగా కుంభాకార, పుటాకార వంపులతో నిర్మించే సన్నటి గోడలు తీవ్రమయిన బలమయిన గాలులని తట్టుకుని నిలబడతాయి. సహజంగా మన నిర్మించే పొడవాటి గోడలు కూలి పోవటానికి అనేక కారణాలు ఉంటాయి. వాటిలో కొన్ని. Expantion జాయింట్ లేకపోవటం. 80 మీటర్లు పొడవును దాటి గోడContinue reading “Crinkle crankle wall”

Septic Tank

ఇల్లు ఇరుకులం. ఆలి మరుకులం. (ఇల్లాలుని మన బలహీనతలు తెలియని ప్రాంతం నుండి తెచ్చుకోవాలి. ఇల్లు తెలిసినవారున్న సమాజం లో నిర్మించుకోవాలి)  అనే సామెత జనం నానుడిలో పడి తన స్వరూపాన్ని మార్చుకుని ‘ఇల్లు ఇరుకు, ఆలి అనాకారి’ అనే చెత్త కింద ప్రచారం లో ఉంది. సెప్టిక్ టాంక్ నిర్మాణం కూడా అంతే. సరైన పద్దతిలో పైపులు అడ్డుగోడలు, మాన్ హోల్, వెంట్ పైప్ లు అమర్చకపోతే.. చాలా ఇబ్బందులు ఉంటాయి. తరచూ టాంక్ నిండటం.Continue reading “Septic Tank”

Create your website with WordPress.com
Get started