Design a site like this with WordPress.com
Get started

తండ్రి- కొడుకు

పది / పన్నెండు యేళ్ళ ఆ పిల్లాడు వయసుకి తగినంత చురుగ్గా ఉండకపోవటం ఆ హోటల్ రిసెప్షనిస్ట్ గమనించాడు.రెండు రోజుల క్రితం వచ్చారా ఇద్దరు. ఒక తండ్రి బేలగా ఉన్న కుమారుడిని వెంటబెట్టుకుని.“ఒక రూము కావాలి. ఒక వారం పాటు ఉంటాం. హాస్పిటల్ పని మీద వచ్చాం”రెసెప్షన్ లో ఉన్నతను తండ్రి వివరాలు ఆధార్ వివరాలు నమోదు చేసుకుని రూమ్ బాయ్ ని పంపాడు.అప్పటి నుండి వాళ్ళిద్దరిని అతను గమనిస్తూనే ఉన్నాడు. అతనితో పాటు రూము బాయ్స్Continue reading “తండ్రి- కొడుకు”

సున్నితమయిన సమస్య

ఆఫీస్ అవర్స్ ముగిసేటప్పుడు పర్సనల్ నెంబరు మోగింది.డాక్టర్ విజయ్.. నా మిత్రుడు, డెంటిస్ట్.“ఇప్పుడు రాగలవా? నీ RCT క్లోజ్ చేస్తాను.”“రేపు అనుకున్నాం కదా?”“రేపు నైట్ బ్యాంకాక్ వెళ్తున్నాను. మరో వారం దొరకను”“ఒక్కడివేనా?”“అవును. వస్తున్నావా?లేదా?”“వస్తున్నాను. గంటలో అక్కడ ఉంటాను. బైక్ తీసుకుని వస్తాను”సబ్ స్టాఫ్ కి చెప్పి బయలుదేరాను.మరో అరగంట దూరం లో ఉన్నప్పుడు SE గారి టెలీ కాన్ఫరెన్స్ మొదలయ్యింది.ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వింటూ అక్కడికి చేరాను…తన రూం లో మరో కుర్రాడు కూడా ఉన్నాడు. అతనేContinue reading “సున్నితమయిన సమస్య”

1. మొదలు

జీవితం ప్రారంభం అనేది సాధారణం గా మొదలవుతుంది. కొంతమంది అదృష్టవంతులకి మార్గదర్శకులు ఉంటారు. వివిధ వ్యక్తుల కారణం గా అనేక మంచి మార్గాలు తారసపడుతుంటాయి. కొందరు అందిపుచ్చుకుని ఎదుగుతారు. చాలామంది వాటిని నిర్లక్షం చేస్తారు. మరి కొందరు ప్రవాహానికి ఎదురు ఈదుతారు. నా జీవితం ఏమిటి అనేది నాకే తెలీదు. చదువు పూర్తి అయ్యాక ఒక సంవత్సరకాలం చాలా విలువయినది అని, తరవాత కాలం లో కాని నాకు తెలిసి రాలేదు. నా జీవితం లో అత్యంతContinue reading “1. మొదలు”

ఖాళీ పెట్టె

“తాతా నాన్న ఎప్పుడొస్తాడు.” అంది మనమరాలు.కుర్చీలో కూర్చుని కాఫీ చప్పరిస్తున్న రామనాధం తో..రామనాధం మనమరాలిని దగ్గరకి తీసుకున్నాడు. “రేపు వచ్చేస్తాడు. ఈ పాటికి బయలు దేరి ఉంటాడు. అక్కడ విమానం ఎక్కి జుమ్మని వచ్చి హైదరాబాదు లో దిగి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. బుజ్జి తల్లిని చూడటానికి” ఆరేళ్ళ మనమరాలికి చక్కిలి గిలి పెట్టాడాయన. లావణ్య నవ్వింది. సిగ్గు పడింది. “నాకు బోలెడు బొమ్మలు తెస్తాడు. గౌనులు, ఇంకా కర్జూరాలు, చాక్లెట్లూ.” కళ్ళు పెద్దవి చేస్తూ చెప్పింది.. “అవునుContinue reading “ఖాళీ పెట్టె”

నొప్పి

ఎక్కువదూరం నడిస్తే కాలు నొప్పి వస్తుందని ఈ మధ్య వాకింగ్ మానేశాను. శరీరం నా మాట వినటం మానేసింది. ఇంట్లో సిస్టమ్ కి ఒక ఎలెక్ట్రికల్ ఆడాప్టర్ కావాల్సి వచ్చింది. ఇంతకు మునుపులా స్వేచ్చగా తిరిగే అవకాశం లేదు. లాక్ డౌన్ అమల్లో ఉంది. కరోనా కేసులు పెరుగుతున్నాయని నిబందనలు ఖటినతరం చేశారు. నిత్యావసరాల కోసం ఉదయాన్నే రెండుగంటల సడలింపు మాత్రమే ఉంది. పొద్దుటే చెరో త్రీ ఫోర్త్ వేసుకుని, మాస్క్ లు పెట్టుకుని, టౌన్ సెంటర్Continue reading “నొప్పి”

అమ్మ అబద్దం ఆడింది.

నాకు మెలుకువ వచ్చేసరికి అమ్మ ఏడుస్తూ ఉంది. నాన్న అమ్మ జుట్టు పట్టుకుని ఉన్నాడు. తమ్ముడు నిద్ర పోతూ ఉన్నాడు. రోజూ లాగే .. “అపార్ట్ మెంట్ లో ఆరిల్లల్లో పని చేస్తావ్? డబ్బులు అడిగితె లేవంటావే?” “ఇంట్లో ఎచ్చాలు కొన్నాను. పిల్ల బడి లో కట్టాను. ఇంకేం మిగల్లేదు” “నువ్వు ఎప్పుడు నిజం చెప్పావే?” ఇద్దరు కాసేపు పెనుగులాడుకున్నారు. అమ్మ ఏడుస్తునే ఉంది నాకు మళ్ళీ నిద్ర పట్టింది. **ఉదయం మెలుకువ వచ్చే సరికి అమ్మContinue reading “అమ్మ అబద్దం ఆడింది.”

నాన్నొచ్చాడు.

అజ్ఞాతం లో ఉంటున్న నాన్న అమీర్పేట హాస్టల్ కి వచ్చాడు.ఆర్నెల్లు దాటింది నాన్నని చూసి. తెల్లగడ్డం చింపిరిగా ఉంది. చర్మానికి ఏదో అయ్యింది. కళ్ల చుట్టూ నల్లగా ఉంది. నుదురు మీద పగుళ్లు కనిపిస్తున్నాయి. నోట్లో నుండి గుట్కా వాసన వస్తుంది. ఎప్పటిలాగా లెనిన్ ఫాంటు, బ్రాండెడ్ చొక్కాలో లేదు. ఫ్లాట్ ఫార్మ్ మీద అమ్మే లాటి బట్టలు వేసుకుని ఉన్నాడు.బాంకు లో పని ముగించుకుని హాస్టల్ కి వస్తుంటే కింద పార్కింగ్ లో ఎదురుచూస్తున్నాడు.“నాన్నా..” గుర్తు పట్టాకContinue reading “నాన్నొచ్చాడు.”

నాన్నా తప్పు చేశాను

ఒక పలచటి చక్కముక్క మీద మూడు సన్నని సీలలు త్రిబుజాకారం లో దిగ్గోట్టి, రెండిటికి సిల్క్ వైరు ముక్కలు కలిపి టార్చి లైట్ లో త్రెడ్స్ ఉన్న బల్బు తీసుకుని రెండు సీలల మద్య తిప్పి హోల్డర్ లాగా చేయటం, సైకిల్ ట్యూబ్ లోకి బాటరీలు ఎక్కించి వాటిని కూడా రెండు రెండు అంగుళాల సీలల మద్య జాగర్తగా కూర్చో పెట్టి రెండువైపులా చీలలకి సిల్క్ వైరు చుట్టి వాటిని బెండ కాయ స్విచ్ లకి బిగించిContinue reading “నాన్నా తప్పు చేశాను”

నలుపు.

“రిటైర్ అయ్యాక మీ నాన్న గారి చాదస్తం మరీ ఎక్కువయింది అంది జయలక్ష్మి కూతురితో వంటగదిలో నిలబడి, చట్నీ తాలింపు వేసిన చిన్న బాండి లో రెండు ఇడ్లీ అద్దుకు తినేస్తూ… “కాఫీ కాస్త వేడిచేసి నాన్నగారికి ఇవ్వు .. వచ్చేస్తున్నానని చెప్పు” అంది కూతురితోరాజు గారు కాఫీ తాగేసరికి ముడేసుకున్న జుట్టు అర్జంటుగా దువ్వేసి, క్లిప్ తగిలించుకుని, ముందుగా సర్ది ఉంచుకున్న హాండ్ బాగ్ అందుకుని, “నేను రెడీ” అంది హల్లో కి నడుస్తూ…రాజు గారిContinue reading “నలుపు.”

ఆరాధన

1996 ఏప్రియల్ 27 నిన్ననే ఒంగోలు పార్లమెంటు బై ఎలక్షన్లు ముగిశాయి.వైశాఖ శుద్ద దశమి ఈ రాత్రి కి ఆరాధన ఘడియలు ప్రారంభం.(తిరిగి 19 యేండ్ల తర్వాత 2015 యెప్రియల్ 27 న కూడా రాత్రి 9-45 కి ప్రారంభం ).సాయంత్రం కాంపు నుండి రాగానే తాళ్ళూరు లో ఉన్న మా పాత పెంకుల ఇంటి నుండిఒంగోలు లో ఉన్న అమ్మా నాన్న వద్దకు వెళ్ళటానికి రెడీ అయ్యామ్.జీన్సు పేంటు మీద పొడవాటి లాల్చీ వేసుకుని తలుపుContinue reading “ఆరాధన”