Design a site like this with WordPress.com
Get started

చపాతీ

మార్నింగ్ వాక్ కి వెళ్ళామా? మొన్న పర్సు గొలుసు ఒక బక్క పలచటి కుర్రాడికి దానం చేసిన విషయం మరి కొందరికి తెలిసింది. చెరువు గట్టు మీదే ఒక సమావేశం ఏర్పాటు చేశారు. పరామర్శించారు. ఇంటావిడ నా క్షేమం కోరి, జేబులో డబ్బులు చేతికి ఉంగరాలు కూడా పీకెసి మూతికి చిక్కం (మాస్క్) కట్టి బయటకి పంపిస్తుందని చెప్పేశాను. వంతుల వారీగా అల్లం టీ ఇప్పిస్తామని ప్రామిస్ లు చేసేశారు. పనిలో పనిగా “బార్యని కంట్రోల్ లోContinue reading “చపాతీ”

రక్తం తో తడిచింది.

తెల్లవారు ఝామున మంచం పక్క ఏదో శబ్దానికి అతనికి మెళుకువ వచ్చింది. టి వి రిమోట్ క్రింద పడ్డ శబ్దం .మంచి నిద్రలో ఉన్న అతను లేచి దుప్పటి తొలగించాడు.మళ్ళీ నిద్రలోకి జారుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే వాష్ రూము తలుపు శబ్దం వచ్చేట్టు తెరుచుకుంది. మరో రెండు నిమిషాలకి బెడ్ రూములో ట్యూబ్లైట్ వెలిగింది. ఇంటావిడ హాల్లోకి వెళ్ళి వాళ్ల అమ్మతో చిన్నగా (అంటే అతనికి గట్టిగా అని అర్ధం) మాట్లాడసాగింది. అతన్ని తన్ని నిద్రలేపడం అనమాట .“ట్రైన్ తెనాలి దాటిందా ? ఇంకెంతContinue reading “రక్తం తో తడిచింది.”

దోసకాయ కి ఫేషియల్.!!

ఈ మధ్య బ్లాగ్ పని లో పడి సరిగా పట్టించుకోలేదు గాని మిద్దె తోట లో కొన్ని వర్ణ వివక్షలు మొదలయ్యాయి. మొదటి నుండి పంపకాల  ప్రకారమే ఇంటావిడ మా ఇంటి ముందు ఉన్న స్థలం లో పెరటి మొక్కలని, నేను మిద్దె మీద కుండీల పెంపకాన్ని పంచుకున్నాం. మొన్నీ మధ్య వర్షాల తర్వాత, ఆకు కూరలు ముఖ్యంగా పాల కూర  అంత ఫ్రెష్ గా రావటం లేదు. కొంచెం ముడుచుకున్నట్లు గా ఉంటుంది. టమోటా, మిర్చిContinue reading “దోసకాయ కి ఫేషియల్.!!”

CBI

ఒక బ్రహ్మానందాన్ని ఒక కోవై సరళ లాటి పెళ్ళాం ఒక ఫైన్ మార్కింగ్ ఎగిరి తన్నింది. డామినేషన్ సమానహక్కులు లాటి  సమస్య. మూగ దెబ్బలు. పైకి మామూలుగానే ఉంటుంది కానీ లోపల రచ్చ..రంబోలా న్యాయపరంగా కేసు తేల్చుకోవాలని ఫిక్స్ అయ్యి, దగ్గర్లోని  పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు. కంప్లయింట్ వ్రాసి ఇవ్వగానే “రోజు కి ఇలాటివి సవాలక్ష కేసులు వస్తుంటాయి. సర్దుకుని పోతుండాలి” అని   చెప్పి పంపేశారు. సమస్య తీవ్రత వాళ్ళకి అర్ధం కాలేదు. అలానే కుంటుకుంటూContinue reading “CBI”

చపాతీ చెయ్యి

‘బార్యా భాదితుల సంఘం’ ఒంగోల్లో బ్రాంచ్ ఓపెనింగ్ కి వక్త గా నన్ను పిలిచారు; నిన్న సాయంత్రం.“బార్యని అదుపు ఆజ్ఞ లలో పెట్టుకోవటం ఎలా? మనకి నచ్చిన పని వాళ్ళ చేత లౌక్యంగా ఎలా చేయించుకోవాలి?” అనే టాపిక్ మీద గంటన్నర మాట్లాడాను.చప్పట్లు, శాలువాలు కార్యక్రమం మరో అరగంట పట్టింది.ఇంటికొచ్చి స్నానానికి వెళ్తుంటే,“ఈ పూట టిఫిన్ ఏం చెయ్యను? పిండి ఉంది రెండు దోసె వేసి ఇవ్వనా?” అని ఆవిడ…“వద్దు. చపాతీ చెయ్యి. మెత్తగా కాల్చు. కోడిగుడ్డుContinue reading “చపాతీ చెయ్యి”

మతిమరుపుకి మరో పేరు

తెలుసండీ తెలుసు.. గతం తో ఆమెని కోప్పడి తిట్టిన సంఘటనలు తేదీలతో సహా చెప్పగలను. డైరీ వ్రాసే అలవాటు ఉంది. వాటిని చూడక పోయినా సరిగ్గా చెప్పగలను అంత జ్ఞాపక శక్తి ఉంది నాకు. అయితే మాత్రం మా ముసల్దానికి మతిమరుపు ఎక్కువవుతుంది. ఎప్పుడో రెండు గంటల క్రితం రోడ్డు పక్క దాబా హోటల్ లో తిన్నాం. అక్కడ మర్చిపోయిందట కళ్ళజోడు. దాదాపు డెబ్బై కిలోమీటర్లు ప్రయాణం చేశాక ఇప్పుడు తీరిగ్గా చెబుతుంది. “కళ్ళజోడు బోజనం చేసినContinue reading “మతిమరుపుకి మరో పేరు”

గృహ వాస్తు.

నమ్మం గాని ఆడవాళ్ళ ధారణ శక్తి అమోఘం అండి. నిన్న ఆఫీసు నుండి ఫోన్ చేసి “టాబ్ ఎక్కడ వుందో చూడు దానితో పని పడింది.” అని చెప్పాను. కావల్సిన వస్తువు కాకుండా మిగిలినవన్నీ దొరకటం మధ్య తరగతి ఇళ్ళలో సంప్రదాయ విధానం.సహజం గానే టాబ్ కనిపించలేదు గాని ‘ఏదో గృహ వాస్తు పుస్తకం కనిపించిందట. పుస్తకాల రేక్ లో ‘సాయంత్రం ఇంటికి వచ్చాక “ఈ పుస్తకం చదువుతున్నాను” అని చూపించింది. “హల్లో సోఫా నడవా కిContinue reading “గృహ వాస్తు.”

ఇంటావిడ

మీ కిప్పుడు పన్నెండు లక్షలా యబైవేల రూపాయల ప్రశ్న. కంప్యూటర్ స్క్రీన్ మీద…బంగారం ఏ ఫారన్ హీట్ ఉష్ణోగ్రత వద్ద కరుగుతుంది. (what is the melting point of the metal Gold?)A) 2017 B) 1945 C) 1497 D) 3612సుబ్బారావు సందేహం లో పడ్డాడు. ఈ ఒక్క ప్రశ్న చెబితే 12.5 లక్షలు అంటే టాక్స్ పోను సుమారుగా 9 లక్షలు తీసుకుపోవచ్చు. బాకీలన్నీ తీరతాయి.సుబ్బులు కి మెడ లోకి ఏదయినా చేయించొచ్చు. ఆ సుబ్బులు. (y)‘ఫోన్ ఏContinue reading “ఇంటావిడ”

మీ బర్త ని ప్రేమించండి

సంగీతాన్ని మరిపించే మీ నాన్ స్టాప్ గొంతు వినటానికి మివారు ప్రాణాలకి తెగించి, జీవితం మీద విరక్తి పెంచుకుని బిక్కు బిక్కు మంటూ సాయంత్రం ఇంటికి వస్తాడు — పాపం ఒక గ్లాసు మంచి నీళ్ళు, ఒక కప్పు టి/కాఫీ ఇవ్వండి.ఇంకో గంట పాటు సృహ తప్పకుండా మీరు చెప్పినవన్నీ వింటాడు.అతనెప్పుడయినా బయట స్త్రీ లని గమనిస్తుంటే అపార్ధం చేసుకోకండి.వారందరి లేని (?) అందం మీలొ ఉందని క్లారిఫై చేసుకుంటుండొచ్చు.మీ వంట కి వంకలు పెట్టినా ప్రేమించండి.అతని నాలుక ఈ మధ్యేContinue reading “మీ బర్త ని ప్రేమించండి”

2015 లో మగాళ్ల ప్రోగ్రెస్ రిపోర్ట్

అదేం ఖర్మో కానీ ఎవడినయినా అడుగు.. అందరూ చెప్పేమాట.కట్టుకున్న దాన్ని సుఖపెట్టు — అనే మాటసాధ్యమా? ఆహా సాధ్యమా? అని…..ఉదాహరణకి ఈ కింద ప్రశ్నలు, మార్కులు చూడండి. ఇంట్లో సాయం మంచం మీద దుప్పట్లు సర్దుతాం . (+1 మార్కు )మాచింగు దిండు గలీబులు మార్చడం మరుస్తాం (-10 మార్కులు)దుప్పటి పరుపు అంచులు వద్ద సర్దటం బద్దకిస్తాం (-3)ఆమెకి కావాల్సినవి తేటానికి బజారుకి వెళ్తాము (+5)అదీ వర్షం లో (+8)అలవాటయిన క్వార్టర్ తెచ్చుకుంటాం (-20).. గెస్ట్ లు /స్నేహితులు ఆదివారం మిత్రులు పలకరించడానికి వస్తారు (0)కర్టెన్స్ ని, సోఫాని, గోడమీద పెయింటింగ్Continue reading “2015 లో మగాళ్ల ప్రోగ్రెస్ రిపోర్ట్”