Design a site like this with WordPress.com
Get started

సత్తు గిన్నెల కారేజి

కొంత కాలం క్రితం ..ఒక ఆదివారం ఉదయాన్నే….ముందస్తు ప్రణాళిక ప్రకారం నేను ,పోకూరి వేంకటేశ్వర రావు (ఈతరం పిక్చర్స్ నిర్మాతలలో ఒకరు )మద్దిపాడు మండలం, రాచవారి పాలెం గ్రామనికి ఉదయం ఎనిమిది కల్లా చేరాము..అక్కడ సిద్దంగా ఉన్న ఒక మద్యవర్తి ని కలుపుకుని.ఒక చిన్న హోటల్ లో టిఫిన్ చేశాంబొలారోని ఊరి చివర అవకాశం ఉన్నంత వరకు వెళ్ళాక ఒక చెట్టు కింద వదిలేసి ..కాలి నడకన బయలు దేరాము..సబుకు తోటలు, చుట్టూ, తిప్పుతూ ,, .చేతిContinue reading “సత్తు గిన్నెల కారేజి”

రామనామీలు

కొన్ని యుగాల క్రితం రామ నామానికే పరవశించే ఒక మారుతి ని “ఏమోయ్ ఎప్పుడూ రాముడు రాముడూ అంటావు!! ఆయన ఎక్కడ? నీలో ఉన్నాడా?” అని అడిగితే, తన గుండెను చీల్చి, లోపల కొలువై ఉన్న రామలక్ష్మణుల ని చూపించాడట. నూట ఇరవై అయిదేళ్ళ క్రితం ఒక వర్గాన్ని కొంత మంది పెద్ద మనుష్యులు “మీకు రాముని గుడిలో ప్రవేశం లేదు. రామనామాన్ని సైతం ఉచ్చరించ కూడదు” అని కట్టడి చేశారు. ఆ వర్గం ఎటువంటి వివాదాలకి దిగకుండా ‘రామ’Continue reading “రామనామీలు”

Mr X భాను ప్రకాష్

అయిదేళ్ళ వయసులో X అనే పిల్లాడికి ఒక పెద్ద ప్రమాదం ఎదురయ్యింది. తలకి బలమైన గాయం. అనేక సర్జరీలు అవసరం అయ్యాయి. ఆ గాయాల నుండి కోలుకుంటూనే అతను అబాకస్ మీద, ఫజిల్స్ మీద ఇంట్రెస్ట్ పెంచుకున్నాడు. చిన్న వయసులోనే SPI  అకాడమీ లో అబాకస్ లో నమోదు చేసుకుని  9th లెవెల్  విన్నర్ అయ్యాడు. ఇంటెర్నేషనల్ అబాకస్ అకాడమీ లో మూడు సార్లు విన్నర్ అయి లిమ్కా రికార్డు లు సాధించాడు. అప్పటి నుండి లెక్కల్లోContinue reading “Mr X భాను ప్రకాష్”

భిక్ష పాత్ర

జీవితం మనకు అవసరం అయినవి అన్నీ ఇస్తుంది.కానీ అవసరాన్ని మించి మనం అడుగుతూ ఉంటాం.అప్పుడు నిజమయిన అవసరం మరుగునపడుతుంది. ఆశ అనేది ముందుకు వస్తుంది. ఆశ కి అంతులేదు.మనకి జీవితం ఇచ్చిన దాని పట్ల స్పృహ ఉంటే మన ఆనందం అక్కడే ఉంటుంది. ఒక రోజు..రోజు మాదిరిగానే రాజు గారు ఉధ్యానవనానికి వచ్చాడు.సాయంత్రం ఉల్లాసంగా ఉన్నాడు. గాలి స్వచ్చంగా ఉంది.వాతావరణం ఆహ్లాదంగా ఉంది. మందీ మార్బలం లేకుండా ఒంటరిగా వచ్చాడు. ఒక బిక్షగాడు ఎప్పటి నుండో రాజు గారిContinue reading “భిక్ష పాత్ర”

ఫైల్యూర్ స్టోరీ

నా లైఫ్ లో అత్యంత ఫెయిల్యూర్ పార్ట్ ఇంటర్ రెండు సంవత్సరాలు. 1980-82 దాని పోస్టుమార్టం పక్కన పెడితే.. వచ్చిన 58 శాతం ఉత్తీర్ణతకి, బి ఎస్సీ (CSR శర్మా కాలేజి, ఒంగోలు) లో సీటు రాలేదు. అప్పట్లో ఈ ప్రైవేట్ కాలేజీలు లేవు. ఇంటర్ నుండి ఇంజనీరింగ్ కి వెళ్తారన్న విషయం నాకు తెలియదు. నా చదువు ప్రశ్నార్థకం అయింది. నాగులుప్పలపాడు మండలం పెద గంజాం లో మాకు కొంత పొలం ఉండేది. మేము మాContinue reading “ఫైల్యూర్ స్టోరీ”

మనెమ్మ ఇక రాదు.

ఉదయం పూట .. అదీ వర్కింగ్ డే ఏ ఇల్లాలికయినా కురుక్షేత్రమే..కాలింగ్ బెల్ మోగింది. పొయ్యిమీద కుక్కర్ ఉంచి హల్లో కి వచ్చి తలుపు తీసింది మీనాక్షీ. బయట ఒక వ్యక్తి ఉన్నాడు ఆటో వాలా అని తెలుస్తుంది. ఖాకీ షర్ట్ వేసుకుని ఉన్నాడు. “ఏమిటి?” అడిగింది విసుగ్గా. “మీ పనావిడ మనెమ్మ మా ఆవిడ” మీనాక్షీ కి కోపం నషాలానికి అంటింది.మూడు రోజుల నుండి చెప్పా పెట్టకుండా పని లోకి రావటం మానేసింది. ఒక ఫోన్Continue reading “మనెమ్మ ఇక రాదు.”

ద్విభాషీ – పావులూరి శంకరనారాయణ శ్రేష్ఠి

ఇంగ్లీషువాడు సప్తసముద్రాలు దాటి వచ్చేశాడు.ముందు వ్యాపారం చేయడానికి… తరువాత అధికారం చెలాయించడానికి….వాడి భాష మనకి రాదు…వాడు “గాడ్ ఈజ్ గుడ్” అనేవాడు.మనకి అది “గాడిదగుడ్డు” గా అర్థమైంది.మనం “రాజమహేంద్రి” అన్నాం…వాడికి “రాజమండ్రి”లా వినిపించింది.మన మాట వాడికి అర్ధమయ్యేది కాదు… వాడి భాష మనకి బోధపడేది కాదు.వ్యాపారం, పరిపాలన వాళ్ల అవసరం కనుక తెల్ల అధికారులు ఒక్కొక్కరూ తెలుగు పదాలను పట్టుకున్నారు. డిక్షనరీలు తయారు చేశారు. 1818లో విలియం బ్రౌన్ తొలి తెలుగు – ఇంగ్లీషు డిక్షనరీ తయారుచేశాడు. 1821లో క్యాంప్ బెల్Continue reading “ద్విభాషీ – పావులూరి శంకరనారాయణ శ్రేష్ఠి”

పెద్దరికం అంటే ఇస్త్రీ చొక్కాలు, ఇనప వాచ్చీలెనా ?

మా ఊర్లో ఉన్న పెద్ద కళ్యాణ మండపం లలో అదొకటి.ఆటొ లో అక్కడికి చేరే సరికి దాదాపుగా మా (ఆఫీసు) బ్యాచ్ అందరూ దిగారు.తెలిసిన వాళ్ళ పెళ్లి. బ్రతికున్నప్పుడు మాతో పాటు పని చేసిన ఒక కొలీగ్ కుమార్తె పెళ్లి.ఒకరి నొకరు పలకరించు కున్నాం.రంగుల దీపాల అలంకరణ ని, పక్కనే ఉన్న ఖాళీస్థలం లో చక్కటి కార్పెట్స్ వేసి ఏర్పాటు చేసిన బఫే విందుని దాటి కళ్యాణ వేదిక వద్దకి వెళ్ళాం.పెళ్లి కూతురు అన్న విజయ్ వచ్చిContinue reading “పెద్దరికం అంటే ఇస్త్రీ చొక్కాలు, ఇనప వాచ్చీలెనా ?”

ముత్యాల హారం

ఒక యువకుడు  దారిన వెళుతూ ఉంటే ఒక ప్రక్క మురికి కాలవ లో ఒక ముత్యాల హారం కనిపించింది.పెద్ద ముత్యాలు. చూడగానే చాలా విలువయినదిగా తెలుస్తుంది.చుట్టూ గమనిస్తే కనుచూపు మేర లో ఎవరు కనిపించలేదు.ఒక కర్ర పుల్ల తీసుకుని కాలవలో ముంచాడు. ఊహూ కర్ర కి తగల్లేదుమరి కొంచెం లోపలికి ఉంది. వంగి చేతితో తీసే ప్రయత్నం చేశాడు. లాభం లేదు.మరికొంత వంగి చూశాడు. ముత్యాల హారం చేతికి తగల్లేదు. కానీ అది మెరుస్తూ ఉంది.ముత్యాలు కలుపుతూContinue reading “ముత్యాల హారం”

ఒక ధర్మ సందేహం

నిన్నటి రోజు..ఉదయం వాకింగ్ కి వెళ్లి వచ్చి, వరండా లో కూర్చుని పేపర్ తిరగేస్తూ.. కాఫీ తాగిన సుబ్బారావు..భార్యని పిలిచి ..’ఛాతి’ నొప్పిగా ఉందని ‘చమటలు’ కక్కాడు.అప్పటి కి అందుబాటులో ఉన్న ఆర్‌ఎం‌పి, ‘లో బిపి’ అని, మరో పావుగంటలో దగ్గర ఉన్న  హాస్పిటల్ కి చేరి  ecg మొదలెట్టగానే , డాక్టర్  మరో పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ కి తీసుకు వెళ్ల మని సలహా ఇస్తే,  ఆటో లో మెయిన్ రోడ్డు ఎక్కే సరికి అతనిContinue reading “ఒక ధర్మ సందేహం”