దీర్ఘ సుమంగళీ భవ

వర్షం కురవటం ఆగి అరగంట దాటింది.సిమెంటు రేకుల కప్పు నుండి సన్నగా కారుతున్న వర్షం నీరు సరిగ్గా స్టౌ మీద పడుతుంది.వర్ధని పొయ్యి పక్కకి జరిపి ఖాళీ పెయింట్ డబ్బా ఒకటి అక్కడ ఉంచింది.ముందు గదిలో పడక కుర్చీ లో కుర్చుని పేపరు చూస్తున్న ముకుందం “టైం ఎంతయింది?” అని పెద్ద గొంతు తో అడిగాడు.  తన మాట తనకి వినబడాలి అంటే ఆమాత్రం అరవాల్సిందే..“ఎనిమిదిన్నర..” అంతే గొంతు తో వర్ధని సమాదానం చెప్పింది.పక్కకి జరిపిన స్టవ్Continue reading “దీర్ఘ సుమంగళీ భవ”

ఎందుకిలా?

2016 ఒక మద్యాహ్నం ఒంగోలు రైల్వే స్టేషన్ లో పరిచయం. నేను సాయి చందు (మా అబ్బాయి) ట్రైన్ కోసం చూస్తూ ఉన్నాం. ఇద్దరం సెల్ లో వచ్చే పాటని ఒకే ఇయర్ ఫోన్స్ తో వింటున్నప్పుడు సన్నగా బలహీనం గా ఉన్న ఒక చామనచాయ పిల్లాడు ఒకడు తండ్రి తో పాటు నిలబడి ఉన్నాడు. ఒక కర్ర సంచి లో సర్దుకున్న లగెజి పట్టుకుని ఉన్నాడు.పిల్లాడి తండ్రి కూడా మొహమాటస్థుడే.. నేనే పలకరించాను. “SASTRA కేనా?”Continue reading “ఎందుకిలా?”

సత్తు గిన్నెల కారేజి

కొంత కాలం క్రితం ..ఒక ఆదివారం ఉదయాన్నే….ముందస్తు ప్రణాళిక ప్రకారం నేను ,పోకూరి వేంకటేశ్వర రావు (ఈతరం పిక్చర్స్ నిర్మాతలలో ఒకరు )మద్దిపాడు మండలం, రాచవారి పాలెం గ్రామనికి ఉదయం ఎనిమిది కల్లా చేరాము..అక్కడ సిద్దంగా ఉన్న ఒక మద్యవర్తి ని కలుపుకుని.ఒక చిన్న హోటల్ లో టిఫిన్ చేశాంబొలారోని ఊరి చివర అవకాశం ఉన్నంత వరకు వెళ్ళాక ఒక చెట్టు కింద వదిలేసి ..కాలి నడకన బయలు దేరాము..సబుకు తోటలు, చుట్టూ, తిప్పుతూ ,, .చేతిContinue reading “సత్తు గిన్నెల కారేజి”

రేగు పళ్ళు-3

కంచుపళ్ళెం (రేగుపళ్లు 3) పెద్ద ఖర్మ అయ్యాక,బోర్లించిన వెదురు బుట్ట కింద వెలిగించిన మట్టి ప్రమిద పక్కనతెల్ల చిర లో కూర్చున్న తల్లి ని చూడటానికి పెద్ద పిల్లలిద్దరికి కి ఎందుకో మనస్కరించలేదు.ఆరడుగుల ఎత్తు, సన్నగా దృడంగా ఉండే పెద్ద రోశయ్య ని చూసిన వాళ్ళెవరూ అతనికి పదహారు మాత్రమే నిండాయని చెబితే నమ్మరు.మల్లమ్మ కి అతనే ఇప్పుడు ఆశాదిపం.మరో రెండువారాలు గడిచాక పెద రోశయ్య వచ్చి తల్లికి చెప్పాడు“నేను ముఠా పనికి వెళ్తాను”బజార్లో లారీల్లో వచ్చిన సరుకుContinue reading “రేగు పళ్ళు-3”

రేగు పళ్ళు 2

నలికీసు (కంచుపళ్ళెం) ——————————-సైకిలు గురవారెడ్డి గారి అబ్బాయిది కాబట్టి, సామాజిక న్యాయం ప్రకారం ఆ అబ్బాయిని ఎక్కించుకుని అడ్డ తొక్కుడు తొక్కుకుంటూ స్కూల్ కి చేరాడు. రోశయ్య ….తన క్లాస్ రూముని చిమ్మి, బోర్డు ని శుబ్రంగా పాత గుడ్డతో కుట్టిన సంచి తో తుడిచి అయ్యవారి బెంచీ మీద రెండు బెత్తం పుల్లలు విరిచి సిద్దంగా ఉంచడం చిన రోశయ్య పని…పంతులు తెలుగు పద్యాలు చెప్పెటప్పుడు రోశయ్యకి ఎక్కడ లేని ఉత్చాహమ్ గా ఉండేది. శ్రావ్యమయిన పధ్యాలు మదురంగాContinue reading “రేగు పళ్ళు 2”

రేగు పళ్ళు 1

రేగు పళ్ళు (కంచుపళ్ళెం -1)=============పొద్దుపోయేంత వరకు అంగడిలో వెండి పని చేసి వచ్చి పడుకున్న చిన రోశయ్యని తెల్లారగట్ల నిద్ర లేపింది మల్లమ్మ…అప్పటికే పెద రోశయ్య, వసారాలో ఉన్న పెద్ద రోట్లో జొన్నలు దంచుతున్నాడు. చెల్లెలు, తమ్ముడు ఇంకా నిద్ర పోతున్నారు..నిద్ర లేచి కావిడి తీసుకుని వెళ్ళి ఫర్లాంగు దూరం లోని చేద బావి నుండి నీరు తోడుకుని వచ్చి దొడ్లో ఉన్న రాతి తొట్టి నిండా నీళ్ళు నింపాడు చిన రోశయ్య. అన్న తమ్ములిద్దరూ మైలు దూరం లోని పారేContinue reading “రేగు పళ్ళు 1”

Create your website at WordPress.com
Get started