Design a site like this with WordPress.com
Get started

మారే హరి రఖే కోన్ :: రఖే హరి మారే కోన్

ఒకాయన చనిపోదలుచు కున్నాడు.సేఫ్టీగా నాలుగంచెల పద్దతి ఎన్నుకున్నాడు…సముద్రం ఒడ్డున ఒక చెట్టుకి ఊరి బిగించుకుని,విషం తాగేసి పిస్టల్ తో నుదుటిన పేల్చుకున్నాడు.పిస్టల్ గురి తప్పి ఉరితాడు తెగింది.కిందపడి సముద్రం లోకి పరిగెట్టాడు.విషం మత్తు లోకి నెట్టేసింది…స్పృహ తెలిసే సరికి, రంభ ఊర్వశి లు బదులుగా జాలర్లు మాటలు వినబడ్డాయి…“ఈడు బతికే ఉన్నాడురోయ్.. సముద్రం ఉప్పు కడుపు ఖాళీ చేయించింది”***మరోకాయన అసలు చావదల్చుకోలేదు..‘ఈత కల్లు’ కోసం వెళితే మృత్యువు ఎదురొచ్చింది…బర్రున తిరిగొచ్చి మిత్రుడిని కారు అప్పడిగాడు.“నేను అమరావతి పారిపోతున్నాను.Continue reading “మారే హరి రఖే కోన్ :: రఖే హరి మారే కోన్”

నేను ఆలయానికి రాను

ఒక 11 సంవత్సరాల కుమార్తె తన తండ్రి తో కలిసి దేవాలయానికి వెళ్లింది. భగవంతునికి నమస్కరించి వచ్చి ఓ ప్రక్కన కూర్చున్న సమయంలో, తన తండ్రితో ఆమె ఇలా అంది. “నేను ఇకపై ఆలయానికి రాను” తండ్రి ఇలా అడిగాడు: “ఎందుకో నేను తెలుసుకోవచ్చా?” ఆమె ఇలా అన్నది: ” భగవంతునికి సేవ చేయడం మరియు భజనలో సమయం గడపటం కోసం మనం ఇక్కడకు వస్తున్నాము, కానీ ఇక్కడ నాకు అందరూ కపట భక్తులే గోచరిస్తున్నారు. దేవాలయానికిContinue reading “నేను ఆలయానికి రాను”

రామనామీలు

కొన్ని యుగాల క్రితం రామ నామానికే పరవశించే ఒక మారుతి ని “ఏమోయ్ ఎప్పుడూ రాముడు రాముడూ అంటావు!! ఆయన ఎక్కడ? నీలో ఉన్నాడా?” అని అడిగితే, తన గుండెను చీల్చి, లోపల కొలువై ఉన్న రామలక్ష్మణుల ని చూపించాడట. నూట ఇరవై అయిదేళ్ళ క్రితం ఒక వర్గాన్ని కొంత మంది పెద్ద మనుష్యులు “మీకు రాముని గుడిలో ప్రవేశం లేదు. రామనామాన్ని సైతం ఉచ్చరించ కూడదు” అని కట్టడి చేశారు. ఆ వర్గం ఎటువంటి వివాదాలకి దిగకుండా ‘రామ’Continue reading “రామనామీలు”

భిక్ష పాత్ర

జీవితం మనకు అవసరం అయినవి అన్నీ ఇస్తుంది.కానీ అవసరాన్ని మించి మనం అడుగుతూ ఉంటాం.అప్పుడు నిజమయిన అవసరం మరుగునపడుతుంది. ఆశ అనేది ముందుకు వస్తుంది. ఆశ కి అంతులేదు.మనకి జీవితం ఇచ్చిన దాని పట్ల స్పృహ ఉంటే మన ఆనందం అక్కడే ఉంటుంది. ఒక రోజు..రోజు మాదిరిగానే రాజు గారు ఉధ్యానవనానికి వచ్చాడు.సాయంత్రం ఉల్లాసంగా ఉన్నాడు. గాలి స్వచ్చంగా ఉంది.వాతావరణం ఆహ్లాదంగా ఉంది. మందీ మార్బలం లేకుండా ఒంటరిగా వచ్చాడు. ఒక బిక్షగాడు ఎప్పటి నుండో రాజు గారిContinue reading “భిక్ష పాత్ర”

శారదా దేవి.

రామకృష్ణ పరమహంస శరీరం విడిచారు.ఆయన బార్య అనేక సంవత్సరాలు గా వస్తున్న ఆనవాయితిని వ్యతిరేకించింది.శిరోముండనం చేయించుకోలేదు. శ్వేతవస్త్రం ధరించలేదు. కంట నీరు కార్చలేదు.ఆయన శరీరాన్ని శ్మశానం కి తీసుకెళ్ళాక, రోజు మాదిరిగానే ఆయనకి వంట చేసింది.ఎప్పటి లాగే ఆయన కూర్చుని బోజనం చేసే బల్ల పక్క కూర్చుని విసనకర్రతో గాలి విసురుతు బోజనం వడ్డించింది.సాయంత్రానికి పడక ఏర్పాటు చేసింది. చుట్టూ తెరలు కట్టింది. అంతా యధావిది గా ఉంది.ఆమెకి పిచ్చి పట్టినట్లు శిష్యులు నిర్ధారణ చేసుకున్నారు.“ఆయన చనిపోలేదు.Continue reading “శారదా దేవి.”

గార్గి

అయిదువేల సంవత్సరాల క్రితం, ఉపనిషత్తుల కాలం లో ‘గార్గి’ అనే ఒక మహిళ ఉండేది.స్త్రీ ల పట్ల ఇంత వివక్ష ఉండేది కాదు.  తాత్వికుదయిన రాజు ప్రతి సంవత్సరం వివేకవంతులయిన పండితులని పిలిపించి పోటీ పెట్టేవాడు. గొప్ప జ్ణానులు మాత్రమే పోటీలకి హాజరయ్యే వారు. వాళ్ళలో కపటం అనేది ఉండేది కాదు.ఒక సంవత్సరం రాజు వేయి ఆవుల బహుమతి ప్రకటించాడు. ఆవుల కొమ్ములకు రత్నాలు తాపడం చేసిన బంగారు తొడుగులు ఉంటాయని చెప్పాడు.ఆ రోజుల్లో యజ్నవాల్యుడు సుప్రసిద్దుడు. విజయం పట్ల అనుమాత్రం కూడాContinue reading “గార్గి”

విశ్రాంతి.

మనుషులు అంతులేని శ్రమ లో మునిగి ఉండటమే కాదు. విశ్రాంతి పొందే సమయము ఉంటుంది.అనంత ఆహ్లాదాన్ని అందుకునే ఘడియలు ఉంటాయి. మనుషులు మరీ గంభీరం గా ఉండకూడదు.అది కూడా అనారోగ్య లక్షణమే.నవ్వుతూ ఉండటం అనేది జీవ లక్షణం. విశ్రాంతి సమయం లో పద్దతులు, ప్రణాళికలు ఉండవు. విరామమే విస్తరించి వుంటుంది.ఒక గొప్ప జెన్ గురువు ఉండేవాడు.ఆయనకు దేశం లో ఎంతో గొప్ప పేరు ఉండేది.చైనా దేశ చక్రవర్తి కూడా ఆయన పట్ల భక్తి ప్రవత్తులు ప్రదర్శించే వాడు.ఒకసారి చక్రవర్తిContinue reading “విశ్రాంతి.”

వింత గిన్నె

అనగనగా ఒక ఊరిలో రంగయ్య అని ఒక రైతు ఉండే వాడు.అతను బీదవాడు. తనకి తండ్రి ఇచ్చిన కొద్ది పాటి పొలం లో పక్కనే ప్రవహించే వాగు నుండి నీరు తెచ్చి కూరగాయలు పండించే వాడు.అతని బార్య ఆ కూరగాయలు దగ్గర్లో ఉన్న నగరం లో అమ్మి , ఇంటికి కావల్సిన అవసరాలు గడుపుతూ ఉండేది.ఒక రోజు ఆ రైతు తన పొలం లో చెట్ల పాదులు తవ్వుతూండగా అతని పలుగుకి ఏదో లోహం తగిలి శబ్దంContinue reading “వింత గిన్నె”

మూడో గొర్రే

ఒక ఊరు ఉంది. ఆ వూరి ప్రజలకి కావలసినవి అన్నీ ఆ ఊర్లో దొరుకుతాయి. ఎవరు బయటకి వెళ్ళేపని లేదు. మార్కెటింగ్ స్ట్రాటజీ లు పెరిగాయి.కావల్సిన వస్తువుల సంఖ్య, కొత్త అవసరాలు కూడా పెరిగాయి.బయట నుండి కొత్త వస్తువులు తెచ్చి ఇచ్చేవారు తయారయారు.వారి మధ్య పోటీ కూడా ఉంది. సేవలు క్వాలిటీ పెరిగింది.అయినా ప్రజలకి అసంతృప్తి., మరేదో కావాలని మరేదో లేదని..ఒకరోజు వాళ్ళు కొన్ని గొర్రెలని చూశారు. వాటి మీద మెరిసే పేయింట్ తో అంకెలు వేసిContinue reading “మూడో గొర్రే”

తిక్క శంకరయ్య

వారంతా అమృతం కోసం పాలసముద్రాన్ని మధిస్తున్నారు.దేవతలను అమరులుగా చేసేందుకు ‘అమృతం’ కావాలి.‘అమృతం’ కోసం ప్రయత్నిస్తే వద్దన్నా వచ్చేది ‘హాలాహలం’.‘హాలాహలం’  కాలకూట విషం. అది నిలువునా ప్రాణులని  చంపేస్తుంది.ఆ తర్వాత  అమృతం వస్తే ఎంత? రాకపోతే ఎంత?హాలాహలం వరకు  ఎవరైనా హరించేస్తే ఎంత బాగుంటుంది?అప్పుడు ఒక ‘బైరాగి’ ముందుకొచ్చాడు.అతడు బేసి  కన్నుల వాడు. గోచిపాత వాడు.అతను మంచుని, మంటని ఒక్కటిగా లెక్క చేసే తిక్క శంకరయ్య.చర్మమే ఆయన దుస్తులు……భస్మమే ఆయన ఆభరణాలు…..స్మశానమే ఆయన ఇల్లు……భూతాలు ఆయన మిత్రులు ……..”లోకాల… కోసం నేను విషాన్నిమింగేస్తాను.” అన్నాడు.”రేపు రాబోయే అమృతం కోసం నేడు హాలాహలం తాగేస్తాను” అన్నాడు.హాలా హల విషమంటే మాటలా? విషం దహించి వేస్తుంది. ఆవిరులు ఊపిరిని ఆపేస్తాయి.అయినా విషాన్ని ఖుషీగా తాగేస్తానంటున్నాడుContinue reading “తిక్క శంకరయ్య”