అర్ధరాత్రి బాగా చలి అనిపించినప్పుడు, బెడ్ పక్కనే ఉన్న రిమోట్ తో సరిచేసే ప్రయత్నం చేశాను.
ఒకటి రెండు సార్లు రెండో అరచేతితో చరిచాను. “బాటరీలు డ్రై అయిపోయినట్లు ఉన్నాయి.
‘వారం నుండి చెబుతూనే ఉన్నా..’
1.30 గెగాహెడ్స్ మీద ప్రత్యక రేడియో ప్రసారాలు మొదలయ్యాయి.
చాకచక్యం గా పక్కకి తిరిగి పడుకుని దుప్పటి కప్పుకున్నాను.
ఉదయాన్నే వాష్ రూమ్ కి వెళ్ళినప్పుడు, ట్రిపుల్ A సైజు బాటరీలు ఇంట్లోనే ఎక్కడో ఉన్నట్లు స్పురించింది.
బెడ్ రూమ్ లో ఉన్న కబోర్డ్, పుస్తకాల రాకు, కంప్యూటరు టేబుల్ సొరుగూ, సీఐడీ సోదా చేదా చేస్తే, గత రెండు వారాలుగా కనిపించని చేతి వాచీ ఒకటి కనిపించింది.
ఇప్పటికీ అనేక మార్లు దీని కోసం అడిగిన ప్రతిసారీ రేడియో ప్రసారాలు జరిగి ఉన్నాయి.
దాంతో పాటే మనమరాలి బొమ్మలు కూడా ఉన్నాయి.
వెతికిన వస్తువు తప్ప ఏవేవో దొరకటం అనేది ఆనవాయితీ..
లాండ్ లైన్ లు వచ్చిన కొత్తల్లో రైల్వే స్టేషన్ ఎంక్వైరీ కి ఫోన్ కలిపితే అది ప్రభుత్వ ఆసుపత్రికి పోయేది. ఎప్పుడూ కలిసేది కాదు. మా ఫ్రెండ్ ఒకడు మాత్రం ఫోన్ గురూ అయిపోయాడు. రైల్వే ఎంక్వయిరీ కి వాడు బస్ స్టాండ్ నెంబరు కొట్టేవాడు. కావలసినది కనెక్ట్ అయ్యేది.
**
ఈ సారి చేతి వాచీ తో పాటు రెండు AAA బాటరీల పాక్ కూడా కనిపించింది.
ఏసి రిమోట్ లో బాటరీలు మార్చి పాతవి జేబులో వేసుకుని వాకింగ్ కి బయలుదేరాను.
**
తిరిగి వచ్చే సరికి మా ‘మైడ్’ మాత కొడుకు ఇంటివద్ద కనిపించాడు. మళ్ళీ ఉదయం ప్రసారాలు మొదలయ్యాయి.
‘ఇంట్లో విషయాలు ఇంటాయనకి పట్టవు’ అనేది సబ్జెక్టు.
“రిమోట్ లో బాటరీలు మార్చేసాను’ టీ కప్పు తో పాటు వాయిస్ ఓవర్ వినిపించింది.
“పొద్దుటే నేను మార్చి వెళ్ళాను. దీక్షిత బొమ్మల్లో దొరికాయి.”
తర్వాత ‘చెప్పాలిగా?’ అనే కార్యక్రమం ప్రసారం అయింది.
విరామం లో “అందులో తీసిన బాటరీలు ఏవి? ” అన్నను దైర్యం గా
“చెత్తలో కలిపి మునిసిపల్ బండి లో వేశాను”
**
“బాటరీలు కిందకి జారవిడుస్తే ఎగరటం లేదా పక్కకి పడి పోవటం బట్టి పని చేస్తాయా లేదా అనేది చెప్పవచ్చు. విసిరేసే ముందు చెక్ చేసుకునే పద్దతి ఇది.” చెబుదాం అనుకున్నా కానీ..
‘అనంత చారిత్రాత్మక తప్పిదాలు’ అనే ప్రసారం మొదలయ్యే అవకాశం ఉంది.
చేతిలో టీ చల్లారాక ముందే మూసుకుని తాగేయటం ఉత్తమం అని చెప్పబడి ఉన్నది.
https://www.chemedx.org/blog/why-do-dead-batteries-bounce-chemistry-course


LMAO. Super ending. hilarious. Where have you been so far? Not seen on blog for a long time.
LikeLike
Not active because i am not active andi.
LikeLike