Design a site like this with WordPress.com
Get started

పులిహోర

మహానాడు కి వచ్చిన జనం పలచగా ఉన్నచోట/ ఖాళీ కుర్చీల ఫోటోలు తీసుకుని, తనకి కావల్సిన స్టఫ్ సేకరించుకుని బైక్ మీద తన ఊరు బయలుదేరాడు రాకేశ్..

ఏడు దాటింది. చీకటి ముసురుకుంటూ ఉంది. వెన్నెల వెలుగు రాబోతుంది.

మరో ఆరు కిలోమీటర్లు ప్రయాణం ఉండగా పాలేరు బ్రిడ్జ్ మీద మలుపులో ఒక అమ్మాయి అనుమానాస్పదంగా తచ్చట్లాడటం గమనించాడు.

కొద్ది దూరం ముందుకి వెళ్ళి తిరిగి వెనక్కి వచ్చాడు. బండి ఒక పక్క పార్క్ చేసి తానూ బ్రిడ్జ్ మీద నుండి కింద ఉన్న నది లోకి తొంగి చూశాడు. పెద్దగా నీళ్ళు లేవు. కానీ ఆ అమ్మాయి నిలబడ్డ చోట సరిగ్గా కింద నీరు ప్రవహిస్తూ ఉంది.

అతని ఉనికి కి ఆమె అలవాటు పడ్డాక చిన్నగా అటువైపు నడిచాడు.

రాకేశ్ ని గమనించి నా ఆ అమ్మాయి మెల్లగా కళ్ళు తుడుచుకుంది. ఏమీ జరగనట్లు మౌనంగా నిలబడి యబై అడుగుల కింద ఉన్న నది లోకి చూస్తూ ఉంది.

“వెన్నెల బాగుంది.” గొంతు సర్దుకుంటూ అన్నాడు.

అటునుండి ఏమీ చలనం లేదు. అతను మరికొంత దగ్గరగా వచ్చాడు.

ఆవిడ చమికీల దుస్తులని గమనిస్తూ, “గాలి చల్లగా ఉంది కదా?.. వెన్నెల .. గాలి” అంటూ ఉగాది కి తెగబడ్డ కవి లాగా …

“నైంటీ తర్వాత అన్నీ బానే ఉన్నట్లు ఉంటుంది.” పీల గొంతుతో ఆ మనిషి సమాదానం వినిపించింది.

“బ్యూటిఫుల్.. ఎంత అందం గా ఉన్నారు?”

ఒక్క నిమిషం మౌనం. “నన్ను జీవితం లోకి లాగకండి. నేను విరక్తి పెంచుకుని వెళ్లిపోటానికి సిద్దపడి ఉన్నాను.”

“అంత పెద్ద మాటలు ఎందుకు? జీవితం చాలా విలువైనది. అంత త్వరగా వెళ్ళక్కరలేదు. ఉన్నంతకాలం అనుభవించాలి.”

ఆమె గట్టిగా శ్వాస తీసుకుంది. “చాలా విన్నాను. మీ పని చూసుకోండి. వెళ్లిపొండి. నన్ను ప్రశాంతం గా చావనివ్వండి.” ఆ గొంతు లో తిరస్కరణ లేదు.

“నువ్వేంతో అందం గా ఉన్నావు.” మనోడు పులిహోర గరిట తీశాడు.

ఇంకొంచెం దగ్గరగా జరిగాడు. పదినిమిషాలకి పోపు పెట్టటం అయిపోయింది.

చీకట్లో ఇద్దరూ ఘాడం గా ముద్దుపెట్టుకున్నారు.

రాకేశ్ ఆమెని గట్టిగా పొదువుకున్నాడు.

“ఎందుకు .. చనిపోవాలని అనుకున్నావు..?” అనునయంగా అడిగాడు.

..

..

..

“మా ఇంట్లో వాళ్ళ కి నేను ఆడపిల్లలా మేకప్ చేసుకోవటం ఇష్టం లేదు”..

Published by Sreenivasarao Sunkara

Civil Engineer, Writer, and now a Grand father

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: